ఆధారాలు చూపడానికి చేతకాక సీపీ మీద ఆరోపణలా?.

  • అక్భరుద్దీన్ కు క్లీన్ చీట్ ఎవరిచ్చారు?.
  • బీజేపీ నాయకులు టీఆర్ఎస్ మీద అనవసర ఆరోపణలు చేస్తున్నారు.
  • అక్భరుద్దీన్ తప్పు చేస్తే శిక్షించడానికి కోర్టులున్నాయి.
  • వివాదాస్పద వ్యాఖ్యలు చేస్తే..ఆధారాలతో నిరూపించండి.
  • ఆధారాలు చూపడానికి చేతకాక సీపీ మీద ఆరోపణలా?.

బీజేపీ వాళ్లు శుద్దపూసలా.. దేశంలో రెచ్చగొట్టే పనులు చేయడం లేదా?. హిందూత్వం పేరుతో అరాచకాలు సృష్టించడంలేదా?. ప్రజల్ని ఇబ్బందులకు గురి చేయడం లేదా?. ఎంఐఎం అక్భరుద్దీన్ రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేస్తే కోర్టుల్లో కేసులేసి నిరూపించండి. కరీంనగర్ పరిధిలో అక్భరుద్దీన్ పై కేసులు పెట్టండి. అంతేకానీ.. సీపీ టీఆర్ఎస్ కార్యకర్తలా వ్యవహరిస్తున్నారని ఆరోపించడం ఎందుకు?. దమ్ముంటే కేసులు పెట్టి నిరూపించండి. అంతేకానీ చేతకాని దద్దమ్మల్లాగా.. పార్టీ ఆఫీసుల్లో కూర్చుని ప్రభుత్వం మీద, పోలీసుల మీద ఆరోపణలు చేయకండి.

అక్భరుద్దీన్ రెచ్చగొట్టే వ్యాక్యలు చేసినా.. ప్రభుత్వం ఏమీ అనడం లేదని పోలీసులు టీఆర్ఎస్ కార్యకర్తల్లాగా వ్యవహరిస్తున్నారని మాట్లాడుతున్న బీజేపీ నాయకులు ఒకసారి దేశవ్యాప్తంగా ఏం జరుగుతుందో కూడా తెలుసుకోవాలి. ఉన్నావా రేప్ ఘటన బాధితురాలిని గుద్ది చంపేందుకు ప్రయత్నించారు. ఇది… మోడీ 2.0లో జరుగుతున్న పాలన. దేశవ్యాప్తంగా అరాచకాలు సృష్టించుకుంటూ… మీరు అధికారంలో లేని ప్రాంతంలో మాత్రం శుద్దపూసలన్నట్లు మాట్లాడుతున్నారు. అధికార పార్టీలపై విమర్శలు చేస్తున్నారు.

ఒకవేళ అక్భరుద్దీన్ తప్పుగా మాట్లాడితే.. నేరం నిరూపితం అయితే శిక్షించడానికి కోర్టులు ఉన్నాయి. వివాదాస్పద మాటలు మాట్లాడారని అంటున్నారే తప్పు.. అవి నిరూపించారా?. అక్భరుద్దీన్ ను శిక్షించకుండా క్లీన్ చిట్ ఇచ్చారంటున్నారు. అక్భర్ కు క్లీన్ చిట్ ఇవ్వడానికి సర్కార్ ఎవరు?. నేరం చేస్తే చట్టం ప్రకారం శిక్షించబడతారు. అంతేకానీ రాజ్యాంగానికి, చట్టానికి ఎవరూ అతీతులు కారన్న విషయం తెలుసుకోండి బీజేపీ నాయకుల్లారా?. ఆరోపణలు చేసే ముందు ఒకటికి రెండు సార్లు ఆలోచించి మాట్లాడండి.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *