ఇకపై కొత్త మున్సిపల్ చట్టం.

  • ఇకపై కొత్త మున్సిపల్ చట్టం.
  • ఏకగ్రీవంగా ఆమోదం తెలిపిన శాసనసభ.
  • కట్టుదిట్టంగా కొత్త మున్సిపల్ చట్టం రూపకల్పన.
  • కలెక్టర్లకు అధికారాలు పెంచుతూ నిర్ణయం.
  • పట్టణాల్లో అభివృద్ధే లక్ష్యంగా ప్రణాళికలు.
  • పౌర సేవలు అన్నీ ప్రజలకు ఈజీగా అందేలా యాక్ట్.

మున్నిపల్ ఎన్నికలు ఇన్ టైంలో జరగాలి, జవాబుదారీ తనంతో అధికారులు, ప్రజా ప్రతినిధులు పనిచెయ్యాలి, అవినీతి రహితంగా పౌరులకు సేవలు అందాలన్న ఉద్దేశంతో కొత్త మున్సిపల్ యాక్ట్ ను తీసుకొచ్చారు సీఎం కేసీఆర్. గందరగోళంగా ఉన్న పాత మున్సిపల్ యాక్ట్ ను సవరిస్తూ.. కొత్త పాలసీని తీసుకొచ్చారు. మున్సిపల్ యాక్ట్ లో హరితహారానికి పెద్ద పీట వేసినట్లు తెలుస్తోంది. కలెక్టర్ ఆధ్వర్యంలో గ్రీన్ యాక్షన్ ప్లాన్ ప్రతిపాదనలు తయారయ్యాయి. కొత్త చట్టంలో పురపాలక ఉద్యోగులకు ఏకీకృత మున్సిపల్ నిబంధనలు, మున్సిపాలిటీలకు ఎన్నికైన ప్రజాప్రతినిధులకు కోడ్ ఆఫ్ కాండక్ట్ వర్తింపజేసేలా చట్టంలో మార్పులు తీసుకొస్తున్నారు.

మున్సిపల్ కమిషనర్లు, ఉద్యోగులు అవినీతికి పాల్పడితే.. వెంటనే సస్పెండ్ చేసే అధికారాన్ని కలెక్టర్లకు కట్టబెట్టనున్నారు. తోటి సభ్యులతోగానీ, ఉద్యోగులతోగానీ తప్పుగా ప్రవర్తించినా, దాడికి పాల్పడినా, మున్సిపాలిటీ ఆస్తులను ధ్వంసంచేసినా చైర్మన్లు, వైస్‌చైర్మన్లను సస్పెండ్ చేసే అధికారాన్ని కలెక్టర్లకు ఇస్తూ చట్టంలో చేర్చారు. అన్ని మున్సిపాలిటీల్లో వ్యర్థాల నిర్వహణకు ఒక ప్రత్యేక కమిటీని ఏర్పాటు చేయనున్నట్టు తెలుస్తోంది. ప్రభుత్వ స్థలాల్లో పౌరుల కోసం మూత్రశాలలు, రెస్ట్ రూములను నిర్మించాలని నిర్ణయించారు. ఉపాధి కల్పన కోసం పబ్లిక్ మార్కెట్లు, మున్సిపల్ షాపులు, ప్రైవేటు మార్కెట్లు లాంటివి నిరుద్యోగులకు ఏర్పాటు చేసే ప్రతిపాదనలున్నాయి.

ప్రతి పట్టణంలో లేఅవుట్లు, అపార్టుమెంట్లు, మల్టీప్లెక్సులు వంటివి అభివృద్ధి చేయడానికి అవసరమయ్యే నిబంధనలు, ఆక్యుపెన్సీ సర్టిఫికెట్ జారీలో పాటించాల్సిన నిబంధనలు వంటివి కొత్త చట్టంలో ప్రతిపాదించారు. అక్రమ నిర్మాణాలపై ఉక్కుపాదం మోపేలా కఠిన చర్యల్ని ప్రతిపాదిస్తూ చట్టాన్ని రూపొందించారు. వార్డుల్ని విభజిస్తూ.. రిజర్వేషన్లు ఖరారు చేస్తూ చట్టంలో పేర్కొన్నారు. ఇలా పాత మున్సిపల్ చట్టంలో మార్పులు చేస్తూ ఇన్ టైంలో మున్సిపల్ ఎన్నికలు

Leave a Reply

Your email address will not be published.