ఉద్యోగుల సమస్యలను మీరైతే ఏనాడూ పరిష్కరించలేదు కదా భట్టీ

  • ఉద్యోగుల సమస్యలను మీరైతే ఏనాడూ పరిష్కరించలేదు కదా భట్టీ
  • నియంతల్లా వ్యవహరించిందే కాంగ్రెస్ పార్టీ
  • ఇప్పుడు మీరు శుద్ధపూసల్లా మాట్లాడకండి
  • ఉపాధ్యాయులను ఏనాడైనా మీరు పట్టించుకున్నారా?

భట్టి విక్రమార్క.. ఇప్పుడు మేం శుద్ధపూసలం అని నువ్వు మాట్లాడినంత మాత్రాన మిమ్మల్ని ఆ దేవుడు కూడా నమ్మడు. తెలంగాణ ప్రజలకు తెలియదా? అంతెందుకు ఉపాధ్యాయులకు తెలియదా? ఏళ్లుగా వాళ్లు ఎన్ని సమస్యలను ఎదుర్కొంటున్నారో? ఇప్పుడు మేం శుద్ధపూసలం అని నువ్వు మాట్లాడితే ఎవరు నమ్ముతారు చెప్పండి. మైకుల ముందు ప్రభుత్వ ఉపాధ్యాయుల మీద తెగ ప్రేమ ఒలక పోస్తున్నారు.

ఈ సోయి మీరు పాలించినప్పుడు ఎందుకు లేదు. అప్పుడు ఉండదు. అప్పుడు అడిగేవాడు లేడని.. మాదే ఇష్టారాజ్యం అని అనుకున్నారు. ఉపాధ్యాయుల సమస్యల్లో మీరు మీ దశాబ్దాల పాలనలో ఎన్ని సమస్యలను తీర్చారు చెప్పండి. వాళ్లకు కనీసం ఫిట్ మెంట్ కూడా ఇవ్వలేకపోయారు. కానీ.. సీఎం కేసీఆర్ తెలంగాణ ప్రభుత్వం రాగానే వాళ్లకు ఎవ్వరూ ఇవ్వని రీతిలో ఫిట్ మెంట్ ఇచ్చి జీతాలు పెంచారు.

వాళ్ల సమస్యలపై స్పందించారు. పదవి విరమణ అంశంపై కూడా సీఎం కేసీఆర్ నిర్ణయం తీసుకుంటారు. అన్నీ జరుగుతాయి కానీ.. తొందర పడితే ఏ పనీ కాదు. దానికి ఒక ప్రొసీజర్ ఉంటది. ఏ పని చేయాలన్నా ఓ ప్రొసీజర్ ను ఫాలో కావాలి. ఊరికే అడ్డిమారి గుడ్డి దెబ్బగా ఇవ్వలేరు కదా. ఆ విషయాన్ని ప్రభుత్వ ఉపాధ్యాయులు కూడా గమనించాలి.

విచిత్రం ఏంటంటే… 40 ఏళ్ల తమ హయాంలో కాంగ్రెస్ పార్టీ ఏనాడూ ప్రభుత్వ ఉపాధ్యాయుల సమస్యలను పట్టించోకున్నా.. ఇప్పుడు ప్రభుత్వ ఉపాధ్యాయుల సంఘాలు, ఆయా నేతలు వాళ్ల పంచన చేరి.. ప్రభుత్వంపై నిందలు మోస్తున్నారు. ఇదే ఇక్కడ విచిత్రం. అంటే.. తెలంగాణ ప్రభుత్వంపై నిందలు వేయాలని.. అసత్యపు ప్రచారాలు చేయాలని… ప్రభుత్వ ఉపాధ్యాయ సంఘాలతో ఈ పని చేయించాలని కాంగ్రెస్ తహతహలాడుతోంది. భట్టి.. మీరు ఎన్ని కుయుక్తులకు పాల్పడినా మీ వల్ల ఏం కాదు. ఏం చేసినా అది మీ పార్టీకే నష్టం. ఒకరిని దెబ్బ తీయాలని చూస్తే మీరే దెబ్బయిపోతారు అనే విషయం గుర్తు పెట్టుకోండి. ప్రభుత్వ ఉపాధ్యాయ సంఘాలు కూడా కాంగ్రెస్ నాయకుల మొసలి కన్నీరు చూసి మోసపోకండి. మీకు సీఎం కేసీఆర్ ఉన్నారు. మీరు అడగాల్సిన అవసరం లేదు. మీకు ఏం కావాలో ఆయనకు తెలుసు. మీరు ఆవేశపడినంత మాత్రాన సమస్యలు పరిష్కారం కావు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *