కకావికలమై కుదేలైన టిడిపి.

  • కకావికలమై కుదేలైన టిడిపి.
  • టిడిపి చరిత్రలోనే అత్యంత దరిద్రమైన ఓటమి.
  • నలభై ఏళ్ల అనుభవజ్ఞుడు నలభైయేళ్ళ యువకుడి పై చిత్తుగా ఓడిన తీరు.
దేశానికి అది చేస్తాను ఇది చేస్తాను, నలభై ఏళ్ల చరిత్ర నాది, దేశంలో నా కంటే గొప్ప నాయకుడు లేడు అని ప్రగల్భాలు పలికిన చంద్రబాబు నాయుడు కి ఆంధ్రప్రదేశ్ ప్రజలు చెంప పెట్టు లాంటి తీర్పునిచ్చారు.ముప్పైఐదు ఏళ్ల చరిత్ర కలిగిన ఒక పార్టీకి కనీసం ముప్పైఐదు సీట్లు కూడా రాకుండా చిత్తుగా ఒడగొట్టారు.రాష్ట్రంలో ప్రజలు ఎన్నో ఇబ్బందులు పడుతున్న అవి మాత్రం పట్టించుకోవడం చేతగాని చంద్రబాబునాయుడు,దేశానికి ఏదో చేస్తానని,తన అవసరం దేశానికి చాలా ఉందని రాష్ట్రాలు,రాష్ట్రాలు పర్యటనలు చేశాడు.
రాష్ట్ర  భవిష్యత్తును మసిపూసి మారేడు కాయ చేసైనా తను గెలవాలని చివరికి పక్క రాష్ట్రం అయిన తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రిని కూడా విమర్శించడానికి దిగజారాడు.ఆత్మగౌరవం,ఆత్మఘోష అంటూ చిల్లరమల్లర పదాలు వాడి ప్రజల్ని అయోమయానికి గురి చేయాలని చూసాడు. చివరికి ప్రజలు ఇచ్చిన తీర్పుతో తన భవిష్యత్ ఏంటని అయోమయంలో పడ్డాడు.నీతి నిజాయితీ లేకుండా కాంగ్రెస్ పార్టీ తో అక్రమ సంబంధం పెట్టుకుని ఎలాగైనా పదవిలోకి రావాలని చూసాడు చివరికి కకావికలమయ్యాడు..
చిత్తుగా ఓడిపోయిన చంద్రబాబునాయుడుపై ప్రజలు ఇప్పుడు సానుభూతి పడేలా లేరు, తను చేసిన పాపం తనకు తాకింది అని ప్రజలు అనుకుంటున్నారు. పాపం ఏ స్థాయికి చేరిందంటే తన కొడుకు కూడా ఓడిపోయేలా ప్రజలు తీర్పు నిచ్చారు.పిల్లనిచ్చిన సొంత మామనే వెన్నుపోటు పొడిచిన,ప్రజల జీవితాలతో చెలగాటమాడుకున్న ఇటువంటి దరిద్రునికి ఇంతకన్నా మంచి శాస్త్రి  ఏముంటుంది అని ప్రజలు అనుకుంటున్నారు.

Leave a Reply

Your email address will not be published.