కాంగ్రెస్ కొంపముంచిన కొప్పుల రాజు

కాంగ్రెస్ కొంపముంచిన కొప్పుల రాజు

తన కులం వారికి, తనకు నచ్చిన వారికి అధిక ప్రాధాన్యం ఇచ్చిన కొప్పుల రాజు రెండు రాష్ట్రాల్లో పార్టీకి తీర‌ని న‌ష్టం చేశారు. అయితే తెలంగాణ పార్టీ వ్య‌వ‌హారాల ఇంచార్జి ఖుంతియా మాత్రం ఈ విష‌యాన్ని ఓపెన్‌గా ఒప్పుకోవ‌డం లేదు. రాజు త‌ప్పుడు ప‌నుల గురించి ఖుంతియాకు కూడా కోపం ఉన్న‌ప్ప‌టికీ బ‌య‌ట‌ప‌డ‌టం లేదు. అవ‌న‌స‌రంగా తెలంగాణ వ్య‌వ‌హారాల్లో జోక్యం చేసుకున్నార‌న్న అప‌వాదు మూట‌గ‌ట్టుకున్నారు.  తన వారికే ప్రాధాన్యత ఇచ్చి తన వర్గాన్ని పెంచి పోషించారు.   అందుకే ఇప్పుడు ఓడిపోయాక ఆయననంతా టార్గెట్ చేస్తున్నారు. మొత్తం మీద రెండు రాష్ట్రాల్లోని కాంగ్రెస్ పార్టీ నాయకులకు ఈయ‌నంటే గిట్టడం లేదు. అందుకే రాజుకు వ్యతిరేకంగా ప‌లువురు సీనియ‌ర్లు రాహుల్ గాంధీకి లేఖ రాశారు.  ఫైర్ బ్రాండ్ రేణుకాచౌదరి – కిశోర్ చంద్రదేవ్ లు కొప్పుల రాజును టార్గెట్ చేస్తూ విమర్శలు గుప్పిస్తున్నారు. పార్టీలో క్షేత్రస్థాయిలో ఏం జరుగుతుందో అవగాహన లేకుండా వ్యవహరించడంతో పాటు తన సామాజికవర్గాన్ని మాత్రమే ప్రోత్సహిస్తున్నారని కొప్పుల రాజుపై ఆరోపణలు చేస్తున్నారు.  సాఫ్ట్ గా కనిపించే మాజీ మంత్రి కిశోర్ చంద్ర దేవ్ కూడా కొప్పుల రాజుపై రాహుల్ గాంధీకి ఫిర్యాదు చేయాల్సిన  పరిస్థితి వ‌చ్చిందంటే రాజు ఎంత ఓవ‌రాక్ష‌న్ చేశారో సులువుగానే అర్థం చేసుకోవ‌చ్చు. దళితుల్లో మాదిగలు ఆయనను వ్యతిరేకిస్తున్నారు. మాలలు మాత్రం ఆయనను అందలానికి ఎత్తుతున్నారు. రేణుకాచౌదరి వంటి వారు మాత్రం అసెంబ్లీ ఎన్నికల్లో ఆయన వ్యవహారం వల్లే ఓడిపోయామని మీడియా ముందు విమర్శలు గుప్పించారు. ఎన్నికల్లో ఓడిపోయిన వారికి ఇప్పుడు కొప్పల రాజే టార్గెట్ అవుతున్నారు.

కొప్పుల రాజు పార్టీ ప్రయోజనాలను పట్టించుకోకుండా తన సామాజిక వర్గానికి చెందిన వారికే పదవులు ఇప్పిస్తున్నారని ఆరోపణలు చేస్తున్నారు. తెలంగాణ కాంగ్రెస్ నేతలు రాహుల్ గాంధీని నేరుగా కలిసి ఓటమికి కారణాలు చెప్పేందుకు ప్రయత్నించినా చాలామందికి అపాయింట్ మెంట్ దొరకకపోవడానికి ఆయనే కారణమంటున్నారు. తెలంగాణ ముఖ్య నాయకులు కూడా ఇదే అభిప్రాయంతో ఉండడం గమనార్హం. పాలమూరు జిల్లాకు చెందిన ఇద్దరు సీనియర్ నేతలు కొప్పుల రాజుపై బహిరంగంగానే ఆరోపణలు చేస్తున్నారు. జిల్లాకు చెందిన ఓ నాయకుడికి ఏఐసీసీ పదవి రావడం వెనుక కూడా కొప్పుల హస్తం ఉందన్నది వారి అభిప్రాయం. ఏఐసీసీ పదవులు కూడా రాష్ట్ర నేతలకు తెలియకుండా కొప్పల రాజు ఏక పక్షంగా తన వర్గానికే ఇప్పించుకుంటున్నారన్న ఆవేదన వ్యక్తమవుతోంది కాంగ్రెస్ నేతల్లో.

ఇలా తెలంగాణ – ఏపీలో అన్నీ తానై నడిపిస్తూ పార్టీలో పనిచేసే నాయకులకు ప్రాధాన్యత లేకుండా చేస్తున్నారని – సీనియర్ నాయకులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. తెలంగాణ ఎన్నికల సమయంలో కొప్పుల రాజు అనవసర జోక్యం చేసుకున్నారన్న వ్యాఖ్యలు కూడా వినిపిస్తున్నాయి. అలాగే రాష్ట్ర పార్టీలో ఓ కీలక నేత అండదండతో రాజు ఇష్టానుసారంగా వ్యవహరిస్తున్నారన్న ఆరోపణలు ఉన్నాయి. తెలంగాణలో కాంగ్రెస్ ఓటమికి కారణాలను నేరుగా రాహుల్ గాంధీకి చెప్పాలని చాలా మంది నేతలు ప్రయత్నిస్తున్నారని – అయితే కొప్పల రాజు అడ్డుకుంటూ రాహుల్ గాంధీని కలవకుండా చేస్తున్నారనే ఫిర్యాదులు కూడా ఉన్నాయి. తెలంగాణలో పొత్తుల విషయం ఆయన అత్యుత్సాహం చూపించారని – రాజకీయంగా వచ్చే లాభనష్టాలను బేరీజు వేసుకోకుండా నిర్ణయాలు తీసుకున్నారని రేణుకాచౌదరి వంటి సీనియర్ నేతలు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు.

11 thoughts on “కాంగ్రెస్ కొంపముంచిన కొప్పుల రాజు

  1. Hi there I am so grateful I found your blog page, I really found you by mistake, while I was looking on Aol for something else, Anyhow I am here now and would just like to say cheers for a incredible post and a all round enjoyable blog (I also love the theme/design), I don’t have time to browse it all at the minute but I have bookmarked it and also added your RSS feeds, so when I have time I will be back to read a lot more, Please do keep up the excellent work.

  2. #file_links[C:\key\diflucan.txt,1,N]: {#file_links[C:\key\diflucan.txt,1,N]|diflucan|diflucan generic|diflucan without a doctor prescription|diflucan 150mg prescription|diflucan 150 price|diflucan tablet price|buy fluconazole|buy diflucan|cheap diflucan|#file_links[C:\key\diflucan.txt,1,N]} – #file_links[C:\key\diflucan.txt,1,N]
    {https://diflucanst.com/|http://diflucanst.com/}# #file_links[C:\key\diflucan.txt,1,N]
    #file_links[C:\key\diflucan.txt,1,N] [url={https://diflucanst.com/|http://diflucanst.com/}#]{#file_links[C:\key\diflucan.txt,1,N]|diflucan|diflucan generic|diflucan without a doctor prescription|diflucan 150mg prescription|diflucan 150 price|diflucan tablet price|buy fluconazole|buy diflucan|cheap diflucan|#file_links[C:\key\diflucan.txt,1,N]}[/url] #file_links[C:\key\diflucan.txt,1,N]

  3. Hello there, You have done an incredible job. I will definitely digg it and personally suggest to my friends. I’m sure they will be benefited from this site.

Leave a Reply

Your email address will not be published.