కెసిఆర్ సారధ్యానికి మరోసారి  జై కొట్టిన ప్రజలు.

  • కెసిఆర్ సారధ్యానికి  జై మరోసారి కొట్టిన ప్రజలు….
  • పార్లమెంట్ ఎన్నికల్లో అతి పెద్ద పార్టీగా నిలిచిన టీఆర్ఎస్….
  • ఎ ఎన్నికలు వచ్చినా కూడా టిఆర్ఎస్ దే గెలుపు అంటున్న విశ్లేషకులు…
  • కారు జోరు ముందు ఏ పార్టీ అయినా బేజారు అని అంటున్న ప్రజలు….

తెలంగాణ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర రావు గత ఐదేళ్ల కష్టం ఫలించిందని ప్రజలు భావిస్తున్నారు. తెలంగాణ పార్లమెంటు ఎన్నికల్లో తెలంగాణ రాష్ట్ర సమితి పార్టీ అతిపెద్ద పార్టీగా అవతరించిందని ఈ సందర్భంగా గుర్తిస్తున్నారు. అభివృద్ధికి పట్టం కడుతూ ప్రజలు ఈరోజు ఇచ్చిన తీర్పు చరిత్రాత్మకమని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. మెదక్ లాంటి చోట్ల టిఆర్ఎస్ పార్టీ కి మూడు లక్షలకు పైగా మెజార్టీ రావడమనేది మామూలు విషయం కాదని కెసిఆర్ పై అన్ని వర్గాల ప్రజలు నమ్మకం చేయడమే దీనికి కారణమని ప్రజలు పేర్కొంటున్నారు.అలాగే మరికొన్ని చోట్ల టీఆర్ఎస్ పార్టీకి ప్రజలు బ్రహ్మరథం పట్టారని పేర్కొంటున్నారు. దేశంలో ఏ రాష్ట్రం కూడా చేపట్టని ఈ విధంగా సంక్షేమ పథకాలు అమలు చేయడంతో ఈ స్థాయి ఫలితాలు వచ్చాయని విశ్లేషకులు సైతం అంగీకరిస్తున్నారు.

కొన్ని చోట్ల ప్రతిపక్షాలన్నీ ఏకమై టిఆర్ఎస్ పార్టీ నిలువరించాలని చూసిన ప్రజలు తమ ఓటు హక్కు వారికి బుద్ధి చెప్పారని పేర్కొన్నారు. కెసిఆర్ అభివృద్ధి బాటనే నమ్మిన తెలంగాణ ప్రజలు గత అసెంబ్లీ ఎన్నికల్లో మెజారిటీ కట్టబెట్టారని, అదే పంథాను ఈ పార్లమెంటు ఎన్నికల్లో కూడా కొనసాగించారని ప్రజలు అభిప్రాయపడుతున్నారు. రోజురోజుకు అభివృద్ధి పథంలో దూసుకుపోతున్న తెలంగాణ రాష్ట్రానికి టీఆర్ఎస్ మినహా మరో పార్టీ అవసరం లేదని తాజా ఫలితాలతో మరోసారి వెల్లడైందని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. రాష్ట్రంలో ఎన్నికలు వచ్చినా కూడా ప్రజలంతా తెలంగాణ రాష్ట్ర సమితి వైపే నిలుస్తారని మరోసారి రుజువైందని పేర్కొంటున్నారు. ముఖ్యమంత్రి కే చంద్రశేఖరరావు అభివృద్ధి నినాదానికి ప్రజలంతా మరోసారి జై కొట్టారని విశ్లేషకులు పేర్కొంటున్నారు. రాబోయే రోజుల్లో ఇది మరింత బలపడి రాష్ట్రంలో ప్రతిపక్ష ఉనికి లేకుండా పోతుందని ప్రజలు కృతనిశ్చయంతో ఉన్నారు.

 

 

 

Leave a Reply

Your email address will not be published.