బుడ్డరఖాన్ చెప్పేదొకటి చేసేది ఇంకోటి?.

 

  • మాట మీద నిలబడటం రేవంత్ ఇంటా వంట లేదు.
  • కొడంగల్ లో ఓడితే శాశ్వతంగా రాజకీయాల నుంచి తప్పుకుంట అన్న రేవంత్…
  • ఇప్పుడు మల్కాజ్ గిరి బరిలో ఎందుకు దిగుతున్నట్లు?.
  • ప్రెస్ మీట్లు పెట్టి బహిరంగంగా శపథాలు చేసిన రేవంత్ మాటెందుకు తప్పావ్.

విలువలు, ప్రజాస్వామ్యం అని తెగ బట్టలు చింపుకునే రేవంత్ రెడ్డి.. ముందు ఇచ్చిన మాట ప్రకారం నడుచుకుంటే బాగుంటుంది. మొన్నటి అసెంబ్లీ ఎన్నికలలో కొడంగల్ లో ఓడిపోతే.. రాజకీయాల నుంచి శాశ్వతంగా తప్పుకుంటానని మంగమ్మ శపథాలు చేసిన ఈ రవ్వంత రెడ్డి.. చెప్పేది ఒకటి చేసేది ఇంకోటి. రాజకీయ నాయకుడన్న తర్వాత.. ఇచ్చిన మాట మీద నిలబడాలి. రోజుకో మాట మాట్లాడితే.. నీకు ప్రజల్లో విలువ ఎలా ఉంటుంది మిస్టర్ రేవంత్. పూటకో మాట మాట్లాడే నిన్ను ప్రజలు ఎందుకు నమ్మాలి?.

ఎన్నికల ముందు ఎన్నెన్ని మాటలు చెప్పినవ్ రేవంత్. ప్రెస్ మీట్లు, బహిరంగ సభల్లో సవాళ్లు చేసినవ్, తొడలు కొట్టినవ్, మీసాలు తిప్పినవ్ కదా?. సొంతగడ్డ మీదే చిత్తుగా ఓడి ఏ మొహం పెట్టుకుని మల్కాజ్ గిరి బరిలో దిగుతున్నవ్. ప్రజలు కోరుకుంటున్నరా నిన్ను. సిగ్గుండాలి ఈ విధంగా ప్రచారం చేసుకోవడానికి. ఏ ప్రజలు కోరుకున్నరు నిన్ను?. ఎవరు పోటీ చేయమన్నారు??. ఒక్కరి పేరు చెప్పగలవా?.

రేవంత్ చెప్పేవన్నీ అబద్ధాలేనని తేలిపోయింది. అయినా.. కొడంగల్ లో చెల్లని రేవంత్.. మల్కాజ్ గిరిలో ఎలా చెల్లుతాడు. సిగ్గు, శరం, చీము నెత్తురు ఏమైనా ఉంటే.. పోటీకి దిగడు. పచ్చ పార్టీ చంద్రబాబు దగ్గర ట్రైనింగ్ కదా?. బాబులెక్క ఊసరవెల్లి లెక్క రంగులు మార్చడం రేవంత్ కూడా నేర్చుకున్నడు. ఈ బుడ్డర ఖాన్ చెప్పిన మాట మీద నిలబడడు.. ఈ మోతుబరిని నమ్మి ఓట్లెయ్యాల్నా?. మల్కాజ్ గిరిలో కనీసం డిపాజిట్లు రాకుండా తన్ని తరిమివేయాల్సిందే. ప్రజలు ఏ మొహం పెట్టుకుని ఓట్లు అడుగుతున్నవ్ అని గల్లా పట్టుకుని నిలదీయండి. స్థానికత కాదు.. మల్కాజ్ గిరికి సంబంధమే లేదు. ఎవరో ఎక్కడి నుంచో వచ్చి పోటీ చేస్తే మీరెందుకు ఆదరించాలి??. ఓట్లెయ్యాలి??.

మల్కాజ్ గిరి ప్రజలారా మేలుకోండి. అబద్దాలు, అసత్యాలతో మిమ్మల్ని మభ్య పెట్టేందుకు కాంగ్రెస్ ప్రయత్నిస్తుంది. ఓటుకు నోటు దొంగను ముందు పెట్టి.. పనికిమాలిన రాజకీయాలు చేస్తోంది. ఓడిపోతామని తెలిసి కూడా పోటీకి దింపితే.. మరోసారి ఎన్నికల్లో పోటీకే భయపడేలా తీర్పు ఇవ్వండి. రేవంత్ కు శాశ్వతంగా రాజకీయ సమాధి కట్టండి. అస్త్రం మీ చేతిలోనే ఉంది. ఓటు అనే ఆయుధంతో కాంగ్రెస్ పునాదులు కదిలిస్తే కానీ.. వాళ్లకు బుద్ధి వచ్చేలా లేదు.

9,826 thoughts on “బుడ్డరఖాన్ చెప్పేదొకటి చేసేది ఇంకోటి?.