మధ్యాహ్న భోజన పథకానికి ఢోకాలేదు.

  • మధ్యాహ్న భోజన పథకానికి ఢోకాలేదు.
  • మిడ్ డే మీల్స్ పై కాంగ్రెస్ నాయకులు విష ప్రచారం.
  • సన్నబియ్యంతో విద్యార్థుల కడుపు నింపుతోంది సర్కార్.
  • కానీ.. మధ్యాహ్న భోజన పథకానికి తూట్లు పొడుస్తున్నారని..
  • దీపక్ జాన్ అనే మోతుబరి సొల్లు ముచ్చట్లు చెబుతున్నాడు.

కేవలం ఆరో తరగతి వరకే పెట్టే మధ్యాహ్న భోజన పథకాన్ని పదో తరగతి వరకు పెంచి అమలు చేస్తోంది తెలంగాణ ప్రభుత్వం. మెస్ రేట్లను పెంచడంతో పాటు.. మధ్యాహ్న భోజన ఆయాల జీతాలు సైతం పెంచారు. అలాగే దేశంలో ఎక్కడా లేని విధంగా సన్నబియ్యంతో విద్యార్థుల కడుపు నింపుతున్నారు. ప్రభుత్వ ఇంటర్ కాలేజీల్లోనూ మధ్యాహ్న భోజన పథకాన్ని తీసుకొచ్చిన ఘనత సీఎం కేసీఆర్ ది. అటువంటిది.. టీఆర్ఎస్ ప్రభుత్వం మధ్యాహ్న భోజన పథకానికి తూట్లు పొడుస్తుందా దీపక్ జాన్. అది నోరా.. మూసీ మోరా?.

మధ్యాహ్న భోజన పథకం ఎక్కడ అమలు కావడం లేదో.. దీపక్ జాన్ నిరూపించకపోతే.. అబిడ్స్ సెంటర్ల ముక్కు నేలకు రాస్తాడా?. విద్యార్థులకు తిండి సంగతి పక్కన పెడితే.. కనీసం తాగునీరు, టాయిలెట్ల లాంటి వసతులు కల్పించని దౌర్భాగ్య ప్రభుత్వాలు నడిపారు మీ కాంగ్రెస్ పార్టీ నాయకులు. ప్రభుత్వ విద్యావ్యవస్థను భ్రష్టు పట్టించి.. ప్రైవేట్, కార్పొరేట్ విద్యకు రెడ్ కార్పెట్ వేశారు. ఫలితంగా పేదలను విద్యకు దూరం చేశారు. కానీ.. ప్రభుత్వ విద్యకు పూర్వవైభవం తీసుకొచ్చేందుకు సీఎం కేసీఆర్ ప్రయత్నిస్తున్నారు. అందుకే వందలాది గురుకులాలు ప్రారంభించి.. ఒక్కో విద్యార్థిపై లక్షా 25వేలు ఖర్చు చేస్తూ.. తల్లిదండ్రులకు పైసా ఖర్చు లేకుండా.. ఉచిత విద్యను అందిస్తున్నారు.

ప్రభుత్వం విద్యావ్యవస్థలో మార్పులు తెచ్చేందుకు ప్రయత్నిస్తుంటే.. ఇంకా మధ్యాహ్న భోజనం అంటూ అట్టడుగున ఆగిపోతున్నారు కాంగ్రెస్ నాయకులు. చేతకాదు.. చావు రాదు అన్నట్లు.. కాంగ్రెస్ నాయకులు అధికారంలో ఉన్నప్పుడు సీఎం కేసీఆర్ లాగా చేయలేకపోయారు. ఇప్పుడు ప్రజలకు మంచి చేయాలని చూస్తుంటే మోకాలడ్డుతున్నారు. అర్థం లేని విమర్శలు చేస్తూ తప్పుడు ప్రచారం చేస్తున్నారు. అందుకే కాంగ్రెస్ పార్టీని రెండోసారి కూడా విజయవంతంగా గాంధీభవన్ కే పరిమితం చేశారు ప్రజలు. ప్రభుత్వం మీద ఇలాగే తప్పుడు ప్రచారం చేస్తే.. ఇక రాష్ట్రంలో కాంగ్రెస్ కనుమరుగు కావడం పక్కా.

Leave a Reply

Your email address will not be published.