ముందస్తు చెల్లింపు హామీ పత్రంపై వెనక్కి తగ్గని కేంద్రం.

  • కరెంటు కష్టాలు తెచ్చే దిశగా కేంద్రం.
  • ముందస్తు చెల్లింపు హామీ పత్రంపై వెనక్కి తగ్గని కేంద్రం.
  • ఎల్-సి నిబంధనతో రాష్ట్రాన్ని ఇబ్బంది పెట్టాలనుకుంటున్న కేంద్రం.
  • కరెంటు వినియోగానికి ముందస్తు చెల్లింపు ఏ విధంగా చేస్తారు.
  • ఒకసారి ఎక్కువ వినియోగం.. మరోసారి తక్కువ వినియోగం ఉంటుంది.

కేంద్రం మొండి వైఖరితో రాష్ట్రాల్లో కరెంటు సంక్షోభాన్ని తెచ్చేందుకు ప్రయత్నిస్తోంది. ఎందుకంటే.. లెటర్ ఆఫ్ క్రెడిట్ పేరుతో కొత్త నిబంధన తీసుకొచ్చి రాష్ట్ర డిస్కంలను ఇబ్బంది పెట్టాలని చూస్తోంది. ఇప్పటికే సరిగ్గా బిల్లులు వసూలు కాక తలలు పట్టుకుంటున్నాయి డిస్కంలు. ఈ నేపథ్యంలో ముందస్తు చెల్లింపులకు సంబంధించిన ఎల్సీ ఇవ్వాల్సిందేనని లేకపోతే.. ఇతర రాష్ట్రాల నుంచి సరఫరా అయ్యే కరెంటు నిలిపేస్తామని చెప్పడం ఎంత వరకు కరెక్ట్. రాష్ట్రాలు ఏ పరిస్థితుల్లో ఉన్నాయని ఆలోచించే సోయి ఉండదా?. లేక కావాలని కక్షసాధింపు చర్యలకు పాల్పడుతున్నారా?.

రాష్ట్రంలో ప్రస్తుతం సాగునీటి ప్రాజెక్టుల కోసం విద్యుత్ వినియోగం ఎక్కువగా జరుగుతోంది. ముఖ్యంగా కాళేశ్వరం ద్వారా ఎత్తిపోతల కొనసాగుతోంది. కేంద్ర విద్యుత్ సంస్థల నుంచి కరెంటు సరఫరా నిలిపివేస్తే.. రాష్ట్రంలో కరెంటు కోతలు ఎదుర్కోవాల్సి ఉంటుంది. కాళేశ్వరంతో రైతులకు నీళ్లు ఇవ్వాలనే ప్రయత్నాలకు గండి కొట్టాలన్నదే బీజేపీ సర్కార్ ఆలోచనగా తెలుస్తోంది. లేకపోతే.. ఇన్నేళ్లుగా లేని ఎల్సీ నిబంధన ఇప్పుడే ఎందుకు అమలు చేయాలని రాష్ట్రాలపై ఒత్తిడి తెస్తోంది. ఎల్సీ నిబంధన అమలైతే తెలంగాణకే ఎక్కువ నష్టం జరుగుతుంది. ఎందుకంటే విభజన తర్వాత.. రాష్ట్రానికి న్యాయంగా రావాల్సిన విద్యుత్ ను ఏపీ ఆపేసింది. దాంతో.. ప్రైవేట్ విద్యుత్ సంస్థలు, చత్తీస్ గఢ్ రాష్ట్రం నుంచి విద్యుత్ కొనుగోలు చేస్తోంది తెలంగాణ సర్కార్.

ఇప్పుడు ఎల్ సి నిబంధనతో ముందస్తు చెల్లింపు హామీ పత్రం అంటే.. కరెంటు వాడుకున్నా, వాడుకోకున్నా… డబ్బు చెల్లించాల్సి ఉంటుంది. వానాకాలం కాబట్టి.. కరెంటు వినియోగంలో ప్రతీరోజు హెచ్చు తగ్గులు ఉంటాయి. ఒకసారి వినియోగం పెరగొచ్చు, మరోసారి తగ్గొచ్చు. కానీ.. వాడినా వాడకున్నా..ఒకే విధంగా పేమెంట్ చెయ్యాలంటే అయ్యే పనేనా?. కేంద్ర మొండి వైఖరి వల్ల తెలంగాణ తీవ్రంగా నష్టపోయే అవకాశాలు ఉన్నాయి. డిస్కంలు మూతపడే ప్రమాదం కూడా ఉంది. బీజేపీ తమతో కలిసి రాని రాష్ట్రాలను ఏదో విధంగా ఇబ్బందులు పెట్టాలనే ఆలోచనలో భాగంగానే ఇదంగా చేస్తున్నట్లు అర్థం అవుతోంది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *