రుణమాఫీపై అనవసర రాద్దాంతమేల కోదండరామ్.

  • రుణమాఫీపై అనవసర రాద్దాంతమేల కోదండరామ్.
  • ప్రభుత్వ ఇవాళే దిగిపోవడం లేదు కదా?.
  • రుణమాఫీ అమలు చేసేందుకు ఐదేళ్ల సమయం ఉంది.
  • రెండోసారి అధికారంలోకి వచ్చి ఏడాది కూడా కాలేదు.
  • రాష్ట్రంలో సమస్యలు తీర్చి.. ఆ తర్వాత రుణమాఫీ చేస్తుంది సర్కార్.

రుణమాఫీ చేయడం లేదు.. చేతులెత్తేస్తున్నాం అని ప్రభుత్వం ఎక్కడా చెప్పలేదు. ఇచ్చిన మాట ప్రకారం లక్షలోపు రుణమాఫీ ఖచ్చితంగా చేసి తీరుతుంది టీఆర్ఎస్ సర్కార్. ముఖ్యమంత్రి కేసీఆర్ ఇచ్చిన ప్రతీ హామీని నిలబెట్టుకుంటారు. రుణమాఫీ ఊసేలేదని.. హామీ నిలుపుకోలేక పోయిందని కోదండరామ్ ఆరోపించడంలో అర్థం లేదు. ఎందుకంటే ఇప్పటికిప్పుడు రుణమాఫీ అమలు చేయాలంటే 24వేల కోట్లకు పైగానే నిధులు కావాలి. ఇప్పుడున్న పరిస్థితుల్లో 24వేల కోట్లు అంటే అసాధ్యం. ఎందుకంటే.. ప్రాజెక్టుల నిర్వాహణకు, సంక్షేమ పథకాల అమలుకు, ఉద్యోగుల జీతాలకే ఖజానాలోని డబ్బంతా అయిపోతోంది.
రుణమాఫీ అమలు చేయాలంటే.. మళ్లీ అప్పు చేయాలి. ఇప్పటికే రాష్ట్రానికి భారీగా అప్పులున్నాయి. తలకు మించిన భారం ఎందుకు అనే ఉద్దేశంతోనే.. సీఎం కేసీఆర్ అప్పులు అనే ఆలోచన చేయడం లేదు. రాష్ట్రంలో వచ్చే నిధులతోనే రుణమాఫీ అమలు చేసే ఆలోచనలో ఉన్నారు. అందుకే రైతు రుణమాఫీకి ఆలస్యం అవుతోంది. అంతేకానీ.. కేసీఆర్ హామీని నిలబెట్టుకోలేక పోవడం అనేది ఏమీ ఉండదు. ఐదేళ్లలో ఖచ్చితంగా రుణమాఫీ చేసి తీరతారు. ఒకవేళ లేట్ అయ్యే పరిస్థితి ఉంటే.. గతంలో లాగా లక్షలోపు రుణాలను ప్రభుత్వమే కడుతుందని బ్యాంకర్లకు హామీ పత్రాలు ఇస్తుంది.
రైతుల్ని ఇబ్బంది పెట్టాలని గానీ.. రుణమాఫీ హామీ ఎగ్గొట్టాలని కానీ.. ప్రభుత్వ ఉద్దేశం కాదు. ఎవ్వరిపై భారం పడకుండా సమస్య తీర్చాలని సర్కార్ అనుకుంటోంది. ఒకవైపు సంక్షేమ పథకాలు, మరోవైపు అభివృద్ధి రెండూ సమపాళ్లలో జరగాలి కదా?. అందుకే కొన్ని విషయాల్లో లేట్ అవుతోంది. ప్రతిపక్ష నేతలు, ప్రభుత్వ వ్యతిరేకులు ఇందుకు కాస్త సహనంతో ఉండాలి. ఎక్కడ సందు దొరుకుతుందా అని ఆలోచించడం కాదు.. ప్రభుత్వ వైపు నుంచి కూడా ఆలోచించాలి. సో.. పనికిమాలిన విమర్శలు కోదండరామ్ మానుకుంటే మంచిది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *