లక్ష్మణ్ అయిపోయింది..ఇప్పుడు జితేందరా?.

  • లక్ష్మణ్ అయిపోయింది..ఇప్పుడు జితేందరా?.
  • పార్టీలో చేరికలపై బీజేపీ నాయకులు గంపెడాశలు పెట్టుకున్నారనుకుంట.
  • ఏకంగా టీఆర్ఎస్ ఎమ్మెల్యేలే చేరుతారట.. ఆశకు హద్దుండాలి జితేందర్ రెడ్డి.
  • అధికార పార్టీని కాదని.. కనీసం అసెంబ్లీలో చోటేలేని బీజేపీలోకి వస్తారా?.
  • టీఆర్ఎస్ జాతకం కాదు.. నీ జాతకం తెలిసే జనం నిన్ను ఓడించారు.

బీజేపీలోకి భారీగా చేరికలుంటాయని.. ఆ పార్టీ నాయకులు కొన్ని నెలలుగా ప్రచారం చేస్తూనే ఉన్నారు. ఒక మోడీ సమక్షంలో అని.. మరోసారి అమిత్ షా సమక్షంలో అని రకరకాలుగా ప్రచారం నిర్వహించారు. కానీ, మోడీ, అమిత్ షాల సమక్షంలో కనీసం ఒక్కరంటే ఒక్కరు కూడా పెద్దలీడర్లు చేరిన సందర్భాలు లేవు. జాతీయ నేతలు రాష్ట్రంలో పర్యటించిన సందర్భాల్లో కేవలం పంచాయతీల్లోని మాజీ ప్రజాప్రతినిధులు మాత్రమే బీజేపీలో చేరారు. మొన్నటి వరకు బీజేపీ లక్ష్మణ్ భారీగా చేరికలు ఉంటాయని ప్రచారం చేసిండు.. ఇప్పుడు జితేందర్ వంతు వచ్చిందనుకుంటా?.
త్వరలో బీజేపీ భారీ బహిరంగ సభ నిర్వహిస్తామని.. టీఆర్ఎస్ ఎమ్మెల్యేలు తమ పార్టీలో చేరతారని జితేందర్ రెడ్డి మాట్లాడుతున్నాడు.

నువ్వెన్ని సభలు పెట్టుకున్నా…. టీఆర్ఎస్ నుంచి ఒక్క ఎమ్మెల్యే కూడా రారు జితేందర్. అధికార పార్టీని వదిలి .. మీ పార్టీలో ఎమ్మెల్యేలు చేరతారని ఏ విధంగా భ్రమ పడుతున్నావ్. బీజేపీ నుంచి టీఆర్ఎస్ లో చేరికలు ఉంటాయేమోగానీ.. టీఆర్ఎస్ నుంచి బీజేపీలోకి చేరికలు అనేది అసాధ్యం జితేందర్ రెడ్డి. పగటి కలలు కనడం ఆపి.. వాస్తవంలోకి రా?. ఇప్పటికైనా ప్రజల చెవిలో కమలం పూలు పెట్టడం మానుకోండి.
టీఆర్ఎస్ జాతకం తెలుసుకునేందుకు పార్టీలో చేరావా?.

మరి పార్లమెంటరీ పార్టీ నేతగా పదవులు అనుభవించినప్పుడు ఈ మాటలెందుకు రాలే మోతుబరి. అందితే కాళ్లు.. అందకుంటే జుట్టు పట్టుకునే రకం నువ్వని తెలిసే మహబూబ్ నగర్ ప్రజలు నిన్ను చిత్తుగా ఓడించారు. అఫ్ కోర్స్ అవకాశ వాద రాజకీయాలు చేసే నీలాంటి వాళ్లు టీఆర్ఎస్ కు అవసరం లేదు. మీరెన్ని ప్రయత్నాలు చేసినా.. టీఆర్ఎస్ నుంచి కనీసం ఒక సర్పంచ్ స్థాయి నాయకుడిని కూడా చేర్చుకోలేరు జితేందర్.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *