వివేకా.. చాలించు నీ అవివేకపు మాటలు…

  • వివేకా.. చాలించు నీ అవివేకపు మాటలు…
  • ఇప్పటికే ఉన్న రైతుబంధు పథకానికి నిధులు కేటాయిస్తే తప్పేమిటి…
  •  నిధుల విడుదలకు ఈసీ అనుమతి అవసరం లేదని తెలిసి రాద్ధాంతం ఎందుకు చేస్తున్నావు…
  •  త్వరలోనే నీకు మీ బిజెపి పార్టీకి ప్రజలు ఓటుతోనే బుద్ధి చెప్పనున్నారు…
భారతీయ జనతా పార్టీ నాయకుడు మాజీ ఎంపీ వివేకానంద అవివేకపు మాటలు మాట్లాడుతున్నాడు. రైతు బంధు పథకం లో భాగంగా రైతులకు నిధులు విడుదల చేయడంపై అవాకులు చవాకులు పేలి తన అజ్ఞానాన్ని కనబరుస్తున్నాడు. ఇప్పటి వరకు ఉన్న పథకానికి సంబంధించి నిధులను విడుదల చేయడానికి ఎన్నికల కమిషన్ అనుమతి అవసరం లేదని తెలిసి కూడా కావాలని నానా రాద్ధాంతం చేస్తున్నాడు. నిబంధనల మేరకే తెలంగాణ ప్రభుత్వం రైతుబంధు పథకానికి సంబంధించిన నిధులను విడుదల చేసిందని ఇందులో రాజకీయాలు ఏమీ లేవని తాను తెలుసుకుంటే మంచిది. రైతులను ఆదుకోని కేంద్రంలోని భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం.. రాష్ట్రంలోని రైతులకు టిఆర్ఎస్ ప్రభుత్వం మేలు చేస్తే ఓర్వ్వలేక పోతోంది అని దీని ద్వారా తెలుస్తోంది. టిఆర్ఎస్ ప్రభుత్వాన్ని బద్నాం చేసి మున్సిపల్ ఎన్నికల్లో రాజకీయ లబ్ది పొందాలని ఆ పార్టీ ప్రయత్నిస్తున్నట్లుగా తెలుస్తోంది.
ఇప్పటికైనా భారతీయ జనతా పార్టీ నాయకులు తమ  రైతు వ్యతిరేక ధోరణి మార్చుకుంటే మంచిది. రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ప్రారంభించిన పథకాలకు కేంద్రం నుంచి ఒక్క రూపాయి కూడా తెలేని చవట దద్దమ్మ సన్యాసులు రైతులకు రాష్ట్రప్రభుత్వం మేలు చేస్తుంటే చూసి ఓర్వలేక పోతుందని విశ్లేషకులు మండిపడుతున్నారు. మున్సిపల్ ఎన్నికల్లో టిఆర్ఎస్ పార్టీకి ఎదురే లేదని, ప్రతిపక్షాలన్నీ ఎప్పుడో బేజారు అయ్యాయని ఈ సందర్భంగా గుర్తు చేస్తున్నారు. మున్సిపల్ ఎన్నికల్లో వార్ వన్ సైడే అని ఈ ఎన్నికల్లో గెలుపొందేందుకు నిధులను కేటాయించే దుర్భర పరిస్థితుల్లో టిఆర్ఎస్ పార్టీ లేదని తెలుసుకుంటే మంచిది. ఎన్నికల ఫలితాలు విడుదల అయ్యాక ప్రతిపక్షాలన్నీ భూస్థాపితం కావడం ఖాయమని ఈ సందర్భంగా పేర్కొన్నారు. ఇప్పటికైనా వివేకానంద అలాంటి నాయకులు తమ తప్పును తెలుసుకుని ప్రజలకు బహిరంగ క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేస్తున్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *