తెలంగాణలోని గురుకులాలు భేష్-అసదుద్దీన్ ఓవైసీ

  • తెలంగాణలోని గురుకులాలు భేష్-అసదుద్దీన్ ఓవైసీ
  • మైనార్టీలు,దళితుల అభివృద్ధి కేసీఆర్ తోనే సాధ్యమని కితాబు. 
  • కెసిఆర్ పాలనలో తెలంగాణ రాష్ట్రం సుభిక్షం. 
తెలంగాణ రాష్ట్రంలో ఎంతో ప్రతిష్టాత్మకంగా అమలు కాబడుతున్న గురుకులాలు ఎంతో బేషుగ్గా పనిచేస్తున్నాయని ఎంఐఎం పార్టీ అధ్యక్షుడు అసదుద్దీన్ ఓవైసీ మెచ్చుకున్నారు.గౌరవనీయులైన తెలంగాణ ముఖ్యమంత్రి శ్రీ కల్వకుంట్ల చంద్రశేఖర రావు గారి హయాంన్లోనే మైనార్టీలు దళితుల అభివృద్ధి జరుగుతుంది అని ముఖ్యంగా ముస్లింలకు ఉన్న వెనుకబాటు తనాన్ని పోగొట్టాలి అన్న ఉద్దేశంతో వాళ్లకి చక్కని నాణ్యమైన విద్యను అందించాలనే ఉద్దేశంతో అమలవుతున్న గురుకులాలు చక్కగా పని చేస్తున్నాయని పేర్కొన్నారు.తెలంగాణ రాష్ట్రంలో భిన్నమైన మతాలు కులాలు ఉన్నప్పటికీ అందర్నీ సమాన దృష్టితో చూసి చక్కనైన పరిపాలన అందిస్తున్నారు అసదుద్దీన్ అని చెప్పడం జరిగింది.
తెలంగాణ రాష్ట్ర ఏర్పాటులో భాగంగా ఆనాటి మైనార్టీలు దళితుల కనీస అవసరాలను తీరుస్తూ వాళ్ళ జీవితాలను చక్కదిద్దుతాను అని చెప్పి తెలంగాణ రాష్ట్రం సాధించి అధికారంలోకి వచ్చి అనుక్షణం వాళ్ల గురించి ఆలోచిస్తూ షాదీ ముబారక్ కళ్యాణ లక్ష్మి లాంటి అద్భుతమైన పథకాలను ప్రవేశపెట్టి తెలంగాణ రాష్ట్ర ఆడపడుచులకు ఒక పెద్ద అన్న లాగా సీఎం కేసీఆర్ ఉన్నారు అని చెప్పడంలో ఎటువంటి అతిశయోక్తి కూడా లేదు.తెలంగాణ రాష్ట్రంలో అమలవుతున్న గురుకులాలు నాణ్యమైన విద్యను అందిస్తూ ప్రస్తుతం ఉన్న పోటీ పరీక్షలను తట్టుకునే శక్తిని అందిస్తున్నాయి.
తెలంగాణ రాష్ట్రంలో భిన్నమైన మతాలు ఉన్న నేపథ్యంలో కూడా మతసామరస్యాన్ని పెంపొందిస్తూ ఇప్పటివరకు ఒక్క అవాంచనీయ సంఘటనలు కూడా జరగకుండా భిన్నత్వంలో ఏకత్వంని పెంపొందించిడంతో తెలంగాణ రాష్ట్రం సుభిక్షంగా ఉంది అని అసదుద్దీన్ ఓవైసీ పేర్కొన్నారు.మరోవైపు కేంద్రంలో అధికారంలో ఉన్న భారతీయ జనతా పార్టీ ఒక వర్గాన్ని టార్గెట్ చేసేలా పిచ్చి చట్టాలను తీసుకు వస్తున్న కూడా తెలంగాణ రాష్ట్రంలో అన్నివర్గాలకు న్యాయం చేసేలా కెసిఆర్ పాలన బాగుంది అని చెప్పారు.తెలంగాణ ప్రజలు అభివృద్ధిని కోరుకుంటున్నారని కాబట్టే ఎన్నికలు వచ్చినా కూడా తెలంగాణ రాష్ట్ర సమితికి ప్రజలు బ్రహ్మరథం పడుతున్నారు అని కితాబు ఇచ్చారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *