సంజ‌య్‌.. కేసీఆర్ నీలాగ ద‌ద్ద‌మ్మ కాదు.. పోరాడే ద‌మ్మున్న నాయ‌కుడు

  • సంజ‌య్‌.. కేసీఆర్ నీలాగ ద‌ద్ద‌మ్మ కాదు..
  • పోరాడే ద‌మ్మున్న నాయ‌కుడు
  • తెలంగాణ‌కు అన్యాయం జ‌రిగే ఊర్కోడు
  • జ‌గ‌న్ గిగ‌న్ జాన్తానై..
  • పోతిరెడ్డిపై పోరు త‌ప్ప‌దు

 

కుక్కకు బొక్క దొరికినట్టు ప్రతిపక్షాలకు పోతిరెడ్డిపాడు అనే ప్రాజెక్టు దొరికింది. దీని ఆధారంగా పిచ్చిపిచ్చి వేషాలు వేస్తున్నారు. దీక్షలంటూ బఫూన్​ వేషాలు వేస్తున్నరు. ఏపీ ప్రభుత్వం రెగ్యులేటర్​ సామర్థ్యం పెంచడం పూర్తిగా అక్రమం. దీనిపై తెలంగాణ తీవ్రంగా స్పందించింది. ఎలా నిరసన తెలపాలో అలా తెలిపింది. దీనిపై ఇంకా చర్చలు నడుస్తున్నాయి. కొత్త బిచ్చగాడు సంజయ్​ మాత్రం రెచ్చిపోతున్నడు. రాష్ట్రానికి తీవ్ర నష్టం కలిగించేలా ఏపీ పోతిరెడ్డిపాడు విస్తరణ చేపడుతున్నా సీఎం కేసీఆర్​ ఇంతకాలం ఎందుకు మౌనంగా ఉన్నారని ప్రశ్నించాడు. సీఎం కేసీఆర్, ఏపీ సీఎం జగన్ కలిసి ఇరు రాష్ట్రాలను దోచుకుంటున్నారని ఆరోపించాడు. ఒక్క విషయం గుర్తుంచుకో సంజయ్..

రాష్ట్ర ప్రయోజనాల విషయానికి వస్తే కేసీఆర్​ ఒక్కశాతం కూడా రాజీపడరు. ఇరిగేషన్​ ప్రాజెక్టుల విషయంలో జగన్​ తండ్రి వైఎస్సార్​తోనే పోరాటం చేశారు. జగన్​ను డీల్​ చేయడం ఆయనకు పెద్ద విషయం కాదు.  శ్రీశైలం ప్రాజెక్టు నుంచి కృష్ణా జలాలను వినియోగిస్తూ పోతిరెడ్డిపాడు కాల్వల సామర్థ్యం పెంపు, రాయలసీమ ఎత్తిపోతల పథకాలు చేపట్టేందుకు ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం తీసుకొచ్చిన జీవో 203 పూర్తిగా అక్రమమని తెలంగాణ ప్రభుత్వం కృష్ణా నదీ యాజమాన్య బోర్డుకు ఫిర్యాదు చేసింది. రాష్ట్ర పునర్వ్యవస్థీకరణ చట్టానికి విరుద్ధంగా, తెలంగాణ ప్రయోజనాలకు తీవ్ర భంగకరంగా ఉన్న ఈ ప్రాజెక్టుల టెండర్ల ప్రక్రియ సహా ఎలాంటి ముందడుగు వేయకుండా ఏపీ ప్రభుత్వాన్ని అడ్డుకోవాలని విజ్ఞప్తి చేసింది. ఉమ్మడి మహబూబ్‌నగర్, నల్లగొండ జిల్లాల్లో కృష్ణా జలాలను ఆధారంగా చేసుకొని చేపట్టిన సాగునీటి ప్రాజెక్టులకు ఏపీ నిర్ణయం తీవ్ర నష్టం చేస్తుందని పేర్కొంది.

దీనిపై నీటి పారుదల శాఖ ప్రిన్సిపల్‌ సెక్రటరీ రజత్‌కుమార్‌ కృష్ణా బోర్డుకు లేఖ రాశారు. ఇందులో ఏపీ తెచ్చిన జీవో అంశాలను లేఖలో పేర్కొంటూ, ఎక్కడెక్కడ ఉల్లంఘనలు జరిగాయో వివరించారు. శ్రీశైలం నీటిని అక్రమంగా తరలించేందుకు ఏపీ చేపడుతున్న ఎత్తిపోతలతో పాటు, పోతిరెడ్డిపాడు విస్తరణను అడ్డుకునేలా తగిన చర్యలు తీసుకోవాలని కోరారు.ఏపీ ప్రభుత్వం తెచ్చిన 203జీవోను సీరియస్‌గా తీసుకున్న ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు, ఈ ప్రాజెక్టులపై కృష్ణాబోర్డు చైర్మన్‌ను నేరుగా కలిసి వివరించాలని రజత్‌కుమార్‌ను ఆదేశించారు. దీంతో రజత్‌కుమార్‌ బుధవారం మధ్యాహ్నం 3 గంటలకు బోర్డు చైర్మన్‌తో భేటీ అయి, ఏపీ జీవోలపై ఫిర్యాదు చేశారు.