ఏ మొకం పెట్టుకొని తిరుపతి వెళ్తవ్​ సంజయ్​ ? స్టీలు ఫ్యాక్టరీ గురించి జనానికి ఏం చెబుతవ్​ ? ఫ్యాక్టరీని అమ్మడం కరెక్టేనని చెబుతవా ?

ఏ మొకం పెట్టుకొని తిరుపతి వెళ్తవ్​ సంజయ్​ ?

స్టీలు ఫ్యాక్టరీ గురించి జనానికి ఏం చెబుతవ్​ ?

ఫ్యాక్టరీని అమ్మడం కరెక్టేనని చెబుతవా ?

బండి సంజయ్​ను తెలంగాణలోనే ఎవరూ కేర్​ చేయరు. అలాంటిది ఈ మొనగాడు పొరుగు రాష్ట్రంలోని తిరుపతికి వెళ్లి బీజేపీ కోసం ప్రచారం చేస్తాడట! ఈయన వెళ్లి కోతలు కోయగానే ప్రజలంతా గొర్రెల్లా తలలు ఊపి ఓట్లు గుద్దుతారని బీజేపీ భ్రమల్లో ఉంది. వేల మందికి ఉపాధి కల్పిస్తున్న వైజాగ్​ స్టీలు ఫ్యాక్టరీని మోడీ ప్రభుత్వం అమ్మకానికి పెట్టింది. దానికి ఇనుము గనులు ఇవ్వకుండా ఎదుగుదలను అడ్డుకుంది. ఇప్పటి వేలాది మంది బతుకులు నాశనం కాబోతున్నాయి. పరోక్షంగా లక్షలాది మంది రోడ్డున పడతారు. దీని గురించి అటు తెలంగాణ బీజేపీ గానీ ఇటు ఏపీ బీజేపీ గానీ పీకింది ఏమీ లేదు. ప్రజల ఆస్తులను ప్రైవేటు కంపెనీలకు ఎలా ఇస్తారని అడిగితే సంజయ్ ఏం చెబుతాడో తెలియదు. స్టీల్​ ఫ్యాక్టరీ అమ్మకాన్ని ఏ విధంగా సమర్థించుకుంటాడు ? మోడీకిజనం అధికారం ఇచ్చింది ఇందుకేనా! ఏపీకి ప్రత్యేకహోదా ఇస్తామని నమ్మించి గొంతు కోశారు.

కనీసం ప్యాకేజీ కూడా ఇవ్వడం లేదు. అలాంటి చోటికి ఈ అరగుండోడు ఏం మొకం పెట్టుకొని వెళ్తడో తెలియదు. మొన్నటి ఎమెల్సీ ఎన్నికల్లో తెలంగాణలో బీజేపీ ఘోరంగా ఓడిపోయింది. ఇందుకు నైతికంగా సంజయ్​దే బాధ్యత. పీఆర్సీ కోసం గవర్నమెంటు ఉద్యోగులు తెరాసను గెలిపించారని స్టేట్మెంట్ ఇచ్చి తన ఇమ్మెచ్చూరిటీని బయటపెట్టుకున్నాడు. జనాన్ని రెచ్చగొట్టడం, మతం పేరుతో కులం పేరుతో విడదీయం తప్ప సంజయ్​లో లీడర్షిప్​ క్వాలిటీస్​ అస్సలు కనిపించవు. తెలంగాణకు మోడీ ప్రభుత్వం చేస్తున్న​ అన్యాయాన్ని ప్రశ్నించలేని ఈ సన్నాసి ఆంధ్రాకు వెళ్లి ఏం పీకుతాడు ? 2019 ఎన్నికల్లో తిరుపతి పార్లమెంట్‌ పరిధిలో బీజేపీకి ఆరో స్థానం దక్కింది.

గత ఎన్నికల్లో  వైఎస్సార్‌సీపీ అభ్యర్థి బల్లి దుర్గాప్రసాద్‌రావుకు 7,22,877 ఓట్లు వచ్చాయి. టీడీపీ అభ్యర్థి పనబాక లక్ష్మికి 4,94,501 ఓట్లు రాగా మూడో ప్లేస్‌లో నోటాకు 25,781 ఓట్లు వచ్చాయి. నాలుగో స్థానంలో కాంగ్రెస్‌ అభ్యర్థి చింతామోహన్‌కు 24,039 ఓట్లు మాత్రమే వచ్చాయి. బీజేపీ అభ్యర్థి బొమ్మి శ్రీహరికి 16,125 ఓట్లు రాగా ఆరో స్థానంలో నిలిచారు.  బీజేపీ ఈసారి మాజీ ఐఏఎస్​ రత్నప్రభను నిలిపింది. అధికారికంగానే ఈమె ఆస్తులు రూ.35 కోట్లు. అనధికారికంగా ఎంత ఉంటుందో అర్థం చేసుకోవచ్చు. గతంలో ఈమె ఆమ్ (సామాన్యుడు అని అర్థం)​ ఆద్మీ పార్టీ తరఫున పోటీ చేసింది. ఇప్పుడు అమీర్​ (ధనవంతుడు) ఆద్మీ పార్టీలో చేరింది. ఈమెపై తిరుపతి జనానికి కొంచెం కూడా నమ్మకం లేదు. అక్కడ ప్రధాన పోటీ టీడీపీ, వైసీపీ మధ్యే ఉంటుంది.