సొంత డబ్బా కొట్టుకుంటూ ప్రజలను మోసం చేస్తున్న బీజేపీ

  • సొంత డబ్బా కొట్టుకుంటూ ప్రజలను మోసం చేస్తున్న బీజేపీ
  • 2022 నాటికి దేశంలో ప్రతి కుటుంబానికి ఇల్లు అంటూ అసత్య ప్రచారాలు
  • 2014 నుంచి ఇదే మాట చెబుతున్న బీజేపీ
  • ఇప్పటి వరకు తెలంగాణలో కేంద్ర ప్రభుత్వం తరుపున ఒక్క ఇల్లూ నిర్మించలేదు
  • అన్నీ అబద్ధపు ప్రచారాలే

బీజేపీ.. కేంద్రంలో అధికారంలో ఉన్న పార్టీ. కేంద్రంలో అధికారంలో ఉన్న పార్టీ అంటే ఎలా ఉండాలి. ఒక దేశాన్ని పాలిస్తున్న పార్టీ ఎంత నీతితో వ్యవహరించాలి. కానీ.. ఆ పార్టీలో నీతినియమాలు అంటూ ఏం లేవు. చేసేదేమీ ఉండదు కానీ.. సోషల్ మీడియాలో మాత్రం సొంత డబ్బా కొట్టుకోవడంలో బీజేపీ తర్వాతే ఎవ్వరైనా? ఏ పార్టీ అయినా? ఏం నీతులు చెబుతారు. అసలు.. ప్రజలను ఆదుకునేదే మేము అని చెబుతారు. కానీ.. ఆచరణలో మాత్రం ఏముండదు. జనాలు.. వీళ్ల ప్రచారాన్ని చూసి నిజమే కాబోలు అన్నట్టుగా ఉంటాయి వీళ్ల మాటలు.

2022 నాటికి దేశంలోని ప్రతి కుటుంబానికి ఇల్లు ఉండాలన్న లక్ష్యంతో బీజేపీ అడుగులు వేస్తోందట. 2014 నుంచి ఇదేమాట చెబుతూ వస్తున్నారు కానీ.. ఇప్పటి వరకు ఒక్క ఇల్లూ నిర్మించలేకపోయారు. ప్రధానమంత్రి ఆవాస్ యోజన కింద 96 లక్షల ఇళ్లు మంజూరు అయ్యాయంటూ ప్రచారం చేస్తున్నారు. ఏకంగా బీజేపీ తెలంగాణ ఫేస్ బుక్ పేజీలోనే… బీజేపీ ఎంతో చేస్తోందంటూ సొల్లు కబుర్లు చెప్పారు. ప్రధానమంత్రి ఆవాస్ యోజన కింద తెలంగాణలో 96.5 లక్షల ఇళ్లు మంజూరయ్యాయంటూ అసత్య ప్రచారాలు చేస్తున్నారు. 95 లక్షల ఇళ్లు కాదు కదా.. ఒక్కటంటే ఒక్క ఇల్లును కూడా కేంద్ర ప్రభుత్వం నిర్మించలేదు.

తెలంగాణ ప్రభుత్వం నిర్మిస్తున్న డబుల్ బెడ్ రూం ఇళ్లకు కేంద్రం నుంచి సాయాన్ని కోరితేనే స్పందించలేదు. వీళ్లు తెలంగాణలో ప్రత్యేకంగా లక్షల ఇళ్లు కట్టిస్తారంటే ప్రజలు నమ్మాలా? ఎవరి చెవ్వుల్లో పువ్వులు పెడుతున్నారు మీరు. అసలు.. ఇళ్ల కోసం ఇప్పటి వరకు స్థలాలే లేవు.. ముగ్గే పోయలేదు.. కానీ.. అప్పుడే 57 లక్షల ఇళ్లు నిర్మాణంలో ఉన్నాయంటూ సోది చెబుతున్నారు వీళ్లు.

ఇలా తప్పుడు సమాచారంతో సొంత డబ్బా కొట్టుకొని బీజేపీ నేతలు ఏం సాధిస్తారో? తెలంగాణ బీజేపీ నేతలకు తెలంగాణ ప్రజలను మోసం చేయడానికి మనసెలా వచ్చిందో అర్థం కావడం లేదు. బీజేపీ అసత్య ప్రచారాలను తెలంగాణ ప్రజలు ఇప్పటికైనా తిప్పికొట్టాలి. బీజేపీని మరోసారి బొందపెట్టాలి.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *