ఇచ్చింది గోరంత.. చెప్పుకునేది కొండంత‌

  • ఇచ్చింది గోరంత.. చెప్పుకునేది కొండంత‌
  • కేంద్రం నుంచి వ‌చ్చిన‌వి రెగ్యుల‌ర్ ఫండ్సే
  • క‌రోనా హెల్ప్ కోసం ఇచ్చిన‌వి 215 కోట్లే….

 

క‌రోనా విశ్వ మ‌హ‌మ్మారి కాబ‌ట్టి రాజ‌కీయాలు చేయ‌కూడ‌ద‌నే స‌దుద్దేశంతో కేసీఆర్ కేంద్ర ప్ర‌భుత్వాన్ని ప‌ల్లెత్తు మాట కూడా అన‌డం లేదు. కానీ బీజేపీ నాయ‌కులు మాత్రం కుక్క‌బుద్ధి చూపించుకుంటున్నారు. శ‌వ రాజ‌కీయాలు చేస్తున్నారు. ఇటువంటి విప‌త్క‌ర ప‌రిస్థితుల్లో రాష్ట్రాల‌కు సాయం చేయాల్సింది పోయి నీచ రాజ‌కీయాల‌కు దిగుతున్నారు. ఒక కేంద్ర మంత్రిస్థాయి వ్య‌క్తి అయిన కిష‌న్ రెడ్డి గ‌ల్లీలీడ‌ర్‌స్థాయిలో మాట్లాడుతున్నాడు.

కేంద్రం తెలంగాణ‌కు ఫుల్‌గా నిధులు ఇచ్చినా ఇక్క‌డ ఏమీ జ‌రుగుతలేదంటూ దిమాగ‌ల్ లేని మాట‌లు మాట్లాడిండు. ఆయ‌న మాట‌లు వింటే క‌న‌క‌పు సింహాస‌మున‌… శున‌క‌మును కూచుండ‌బెట్టినా సామెత గుర్తుకు వ‌స్తుంది. ఇంత‌కీ క‌రోనా వ్యాధి నియంత్ర‌ణ‌కు కేంద్రం తెలంగాణ‌కు ఇచ్చింది ఎంతో తెలుసా కేవ‌లం రూ.215 కోట్లు!! జ‌స్ట్ రూ.215 కోట్లు!! కిష‌న్ రెడ్డే స్వ‌యంగా ఈ విష‌యాన్ని ఒప్పుకున్నాడు. దాదాపు ఏడు కోట్ల జ‌నాభా ఉన్న రాష్ట్రానికి ఈ డ‌బ్బు ఏ మూలకు స‌రిపోతుంది ? గ‌చ్చిబౌలిలో ఆస్ప‌త్రికి క‌ట్ట‌డానికి కొన్ని వంద‌ల కోట్లు ఖ‌ర్చు చేశారు. పేద‌ల ఖాతాల్లో రూ.1,500 చొప్పున న‌గ‌దు వేయ‌డానికి, బియ్యం అందించ‌డానికి దాదాపు రూ.ఆరు వేల కోట్లు ఖ‌ర్చు చేశారు.

బియ్యంలో కొన్ని తామే ఇచ్చాం అన్న‌ది కిష‌న్ లేవ‌నెత్తిన మ‌రో పాయింట్‌. ఎఫ్‌సీఐ గోదాముల్లో బియ్యం ముక్కి మూలుగుతున్న‌య్ కాబ‌ట్టి వాటిలో కొన్నింటిని రాష్ట్రాల‌కు పంపించారు. అంత‌కుమించి వీళ్లు చేసిన సాయం ఏమీ లేదు. ఉద్యోగుల‌కు ఈపీఎఫ్ నిధుల‌ని, డిజాస్ట‌ర్ నిధుల‌ను మ‌రో లిస్టు చ‌దివాడు. ఇవ‌న్నీ రెగ్యుల‌రుగా ఢిల్లీ నుంచి వ‌చ్చేవే! కేంద్రం అందించిన సాయం రాష్ట్రం పెట్టిన ఖ‌ర్చులో క‌నీసం ఐదుశాతం కూడా కాదు. ఈమాత్రం దానికే ఇలా గొప్ప‌లు చెప్పుకోవ‌డానికి సిగ్గ‌నిపించ‌డం లేదా కిష‌న్ రెడ్డి ?  నీ సొంత రాష్ట్రానికి మోడీ కేవ‌లం ముష్టి విసిరినా దానిని గొప్ప‌గా చెప్పుకుంటావా ?  ‌రాష్ట్రానికి ప‌న్నుల వాటాగా రావాల్సిన డ‌బ్బు రావ‌డం లేదు. ప్రాజెక్టుల నిధులు విడుద‌ల చేయ‌డం లేదు. ఈ స‌మ‌స్య‌ల గురించి ఏనాడైనా ప్ర‌స్తావించావా ?  ‌లేదు. ఎందుకంటే ఇలాంటి విష‌‌యాలు మాట్లాడితే మోడీ, షాలు నీ …మీద తంత‌రు! నువ్వు జ‌స్ట్ పేప‌ర్ టైగ‌ర్‌వి! అంతే.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *