బిజెపి నేతల లారా.. మీకు నీతి వ్యాఖ్యలు చెప్పే హక్కు లేదు…

  • బిజెపి నేతల లారా.. మీకు నీతి వ్యాఖ్యలు చెప్పే హక్కు లేదు…
  • గోవా మణిపూర్ రాష్ట్రాల్లో మీరు ప్రభుత్వాలను ఎలా ఏర్పాటు చేశారు..
  • తెలంగాణ ఎన్నికల సంఘాన్ని ప్రశ్నించే ధైర్యం మీకు ఎక్కడినుంచి వచ్చింది…
  • ఇప్పటికైనా తీరు మార్చుకోండి లేకపోతే మీరు మూల్యం చెల్లించక తప్పదు…

    ఆడలేక మద్దెల ఓడు నా చందంగా అన్నట్లు భారతీయ జనతా పార్టీ నేతలు వ్యవహరిస్తున్నారు. ఇటీవల జరిగిన మనసు ఎన్నికల్లో ఘోరంగా దెబ్బతిన్న బిజెపి నేతలు తమ ఓటమిని ఇతర పార్టీల వైపు నెట్ ఎందుకు తీవ్రంగా ప్రయత్నిస్తున్నారు. ఈ క్రమంలోనే విలువలు ఓట్లు అంటూ తమకు తెలియని విషయాల గురించి ఈ విధంగా మాట్లాడుతున్నారు. అసలు దేశ రాజకీయాల్లో భ్రష్టు పట్టించిన చరిత్ర భారతీయ జనతా పార్టీకి ఉంటుందనడంలో ఎలాంటి సందేహం లేదు. మణిపూర్ గోవా లాంటి ప్రాంతాల్లో తమకు మెజారిటీ రాకపోయినప్పటికీ కూడా ఇతర పార్టీల ఎమ్మెల్యేల కొనుగోలు చేసి ప్రలోభాలకు దిగి రాష్ట్ర ప్రభుత్వాలు ఏర్పాటు చేసిన నీచ చరిత్ర బిజెపికి సొంతం. అలాంటి పార్టీ నుంచి నేతలు గా ఉండే ఇలాంటి నీటి మాటలు మాట్లాడటం వల్ల అవివేకానికి నిదర్శనం.
    దమ్ముంటే ఆయా రాష్ట్రాల్లో తాము రాష్ట్ర ప్రభుత్వాలు ఏర్పాటు చేయడం ఎలా నీతో నిర్వచించి తర్వాత ఇతర పార్టీలపై ఆరోపణలు చేయాలని విశ్లేషకులు సూచిస్తున్నారు. ఒకవేళ మీరు చేస్తే సంసారం వేరే వాళ్ళు చేస్తే వ్యభిచారమా అన్నట్లు బీజేపీ నేతలు వ్యవహరిస్తున్నారని గడ్డి పెడుతున్నారు. తెలంగాణలో ఇలాంటి చర్యలకు పాల్పడడం వల్లే భారతీయ జనతా పార్టీకి అసలు ఆధరణ దొరకడం లేదు. ఆ పార్టీని అసలు ఎవరు ఖాతరు చేయడం లేదని పేర్కొంటున్నారు. ఇకనైనా ఇలాంటి నీచచేష్టలు కట్టబెట్టి భారతీయ జనతా పార్టీ ప్రజల కోసం పోరాడితే బాగుంటుందని లేకపోతే కాంగ్రెస్ పార్టీ మాదిరిగానే రాష్ట్రం నుంచి అదృశ్యమైపోతుందని విశ్లేషకుల హెచ్చరికలు జారీ చేస్తున్నారు. మరోవైపు తెలంగాణ మున్సిపల్ ఎన్నికల్లో ఎక్స్ అఫిషియో మెంబర్గా ఆ రాజ్యసభ సభ్యుడు కె కేశవరావు ఓటు వేయడం పై నానా హంగామా చేస్తున్నారు. తెలంగాణ ఎన్నికల సంఘం సూచన మేరకు ఆయన ఇక్కడ ఓటు వేశారని ఎన్నికల సంఘాన్ని బెదిరించే స్థాయికి బీజేపీ నేతలు దుస్సాహానికి పాల్పడుతున్నారని పేర్కొంటున్నారు. ఇకనైనా బీజేపీ నేతలు తమ తీరు మార్చుకోవాలి లేకపోతే దానికి మూల్యం చెల్లించక తప్పదు.

Leave a Reply

Your email address will not be published.