చెల్లని రూపాయిని ఎవరు కొంటారయ్యా షబ్బీరూ..!

చెల్లని రూపాయిని ఎవరు కొంటారయ్యా షబ్బీరూ..!

– పగటి కలల్లో మునిగితేలుతున్న కాంగ్రెస్ నేతలు
– ఓటమి ఖాయమని తెలిసినా ప్రగల్భాలు
– మున్సిపల్ ఎన్నికల నేపథ్యంలో పనికిరాని మాటలు

కాంగ్రెస్ నేతలు తమ శక్తిని అతిగా ఊహించుకుంటున్నారు. ఎవరో వచ్చి తమను కొనుక్కుని వెళ్తారని ఆశల్లో మునిగి తేలుతున్నారు. ఎలాగూ ఓటమి ఖాయమని తెలిసి.. ఎవరైనా టీఆర్ఎస్ నేతలు వచ్చి తమను ఆ పార్టీలోకి తీసుకువెళ్తే బాగుండునని పగటి కలలు కంటున్నారు. ఇలాంటి వారిలో షబ్బీర్ అలీ అనే రాజకీయంగా పేరు పోగొట్టుకున్న కాంగ్రెస్ నేత ముందు వరుసలో నిలుస్తున్నారు. ప్రత్యక్ష ఎన్నికల్లో గెలవలేక.. శాసనసమండలిలో సీటు సాధించేంత బలం లేక.. అధికారానికి దూరమై కకావికలమైన తమ రాజకీయ బతుకును చూసి.. షబ్బీర్ తల్లడిల్లిపోతున్నాడు.

అందుకే.. ఆయన ఓ మాట అంటున్నాడు. తమను ఎవరూ కొనలేరని కామెంటు చేస్తున్నాడు. వాస్తవానికి టీఆర్ఎస్ లో చాలా మంది నాయకులు ఉన్నారు. షబ్బీర్ అలీకే చెందిన కామారెడ్డి నుంచి బలమైన ప్రాతినిధ్యం టీఆర్ఎస్ కు ఉంది. అలాంటప్పుడు.. నీలాంటి వాళ్లను ఎవరు కొంటారు షబ్బీరూ? బలం లేని.. ప్రజలకు సంక్షేమం చేయలేని నీ లాంటి వారిని ఎవరు తమ పార్టీల్లో చేర్చుకుంటారు షబ్బీరూ? రాష్ట్రంలో ఎలాగూ టీడీపీ లేదు. నువ్వు బీజేపీలోకి వెళ్లే అవకాశం లేదు. ఆ కారణం నీకూ తెలుసు. కమ్యూనిస్టు పార్టీల్లోకి వెళ్తే రాజకీయంగా ఆత్మహత్యా సదృశమే అని నీకూ తెలుసు. మిగిలింది మజ్లిస్. పోతే అందులోకే వెళ్లాలి. కానీ.. రాష్ట్ర వ్యాప్తంగా పూర్తి స్థాయి విస్తరణ లేని ఆ పార్టీలోకి నువ్వు వెళ్లే అవకాశమే లేదు.

ఇలాంటి సందర్భంలో.. నీ కంటికి కనిపించే ఓన్లీ ఆప్షన్ టీఆర్ఎస్. నీకు అక్కడికి వెళ్లాలని ఉంది కాబట్టే.. పరోక్షమైన కామెంట్లను చేస్తున్నావని ప్రజలకు అర్థమవుతోంది. నిన్ను ఎవరూ కొనలేరు అని నీకు నువ్వే ప్రకటన ఇచ్చుకుంటే.. ఎవరో ఒకరు ఆ కామెంట్ ను చాలెంజ్ గా తీసుకుని వచ్చి.. నిన్ను టీఆర్ఎస్ లో చేర్చుకుంటారని భావించకు షబ్బీరూ. రాజకీయంగా నీ స్థాయి ఎప్పుడో దిగజారిపోయింది. నీ పార్టీ కాలగర్భంలో కలిసిపోయింది. ప్రస్తుతం నీ పార్టీకి నాయకుడిగా ఉన్న వ్యక్తే.. అస్త్ర సన్యాసం చేసేందుకు సిద్ధమయ్యాడు. ఇక నువ్వెంత. ఈ విషయం ప్రజలు తెలుసు కాబట్టే.. నీ ప్రకటనలకు స్పందించకుండా తమ పని తాము చేసుకుంటున్నారు. టీఆర్ఎస్ ను మరింత బలపరుస్తున్నారు.

కామారెడ్డే కాదు. ఎక్కడి నుంచి ఎవరిని అభ్యర్థులుగా కాంగ్రెస్ ఖరారు చేసినా.. టీఆర్ఎస్ కు వచ్చిన నష్టం ఏమీ లేదని జనం కుండబద్ధలు కొడుతున్నారు. మున్సిపల్ ఎన్నికల్లో ఫలితాలపై ఆశలు వదులుకుంటే మంచిదని హితవు పలుకుతున్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *