రాష్ట్రంలో కేసులు పెరుగుతున్న దృష్ట్యా ప్రజలు అందరూ జాగ్రత్తగా ఉండాలి. 

  • రాష్ట్రంలో కేసులు పెరుగుతున్న దృష్ట్యా ప్రజలు అందరూ జాగ్రత్తగా ఉండాలి. 
  • లాక్ డౌన్ ను అద్భుతంగా ఆరంభించాం,ముగింపు కూడా అదే విధంగా ఉంటే మనం ఈ విపత్తు నుంచి బయటపడవచ్చు. 
  • పకడ్బందీ ప్రణాళికతో ఇప్పటికే కొలిక్కి వస్తున్న చాలా వరకు కేసులు. 
కరోనా మహమ్మారి విచ్చలవిడిగా రెచ్చిపోతున్న తరుణంలో దేశంలో గాని తెలంగాణ రాష్ట్రంలో  కేసుల సంఖ్య రోజు రోజుకి పెరుగుతుంది, కానీ గౌరవనీయులైన తెలంగాణ ముఖ్యమంత్రి శ్రీ కల్వకుంట్ల చంద్రశేఖర రావు గారు అవలంబిస్తున్న విధానాల వల్ల మరికొద్ది రోజుల్లో రాష్ట్రంలో కేసులో ఒక కొలిక్కి రావడం జరిగుతుంది. పకడ్బందీగా లాక్ డౌన్ ని పాటించడం వల్ల కొత్త కేసులు ఏమీ నమోదయ్యే ఆస్కారం లేదు కాబట్టి ఉన్న కేసులను చికిత్స అందచేసి మిగతా లాక్ డౌన్ సమయం వరకు ఇదే స్ఫూర్తిని కొనసాగితే గనుక కరోన మహమ్మారి నుండి తెలంగాణ ప్రజలు బయటపడవచ్చు అని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.
గౌరవనీయులైన తెలంగాణ ముఖ్యమంత్రి శ్రీ కల్వకుంట్ల చంద్రశేఖర రావు గారి పిలుపునందుకుని తెలంగాణ ప్రజలు లాక్ డౌన్ ను పకడ్బందీగా అమలు చేస్తున్నారు. ముఖ్యంగా పట్టణాలతో పోలిస్తే పల్లెల్లో అద్భుతంగా ఉంది. అక్కడి ప్రజాప్రతినిధుల సమన్వయంతో చక్కగా సామాజిక దూరాన్ని పాటిస్తూ ఉన్నారు. కాబట్టే తెలంగాణ రాష్ట్రంలో ఇప్పటికీ కూడా పరిస్థితులు చేతిలోనే ఉన్నట్టు తెలుస్తోంది. కాబట్టి లాక్ డౌన్ ఆరంభం అద్భుతంగా ఉంది అదే స్ఫూర్తితో ముగిస్తే మరో పది రోజుల్లో లాక్ డౌన్ ముగిస్తే తెలంగాణ రాష్ట్రం కరోనా మహమ్మారి నుంచి విముక్తి పొందే ఆస్కారం ఉంది.

Leave a Reply

Your email address will not be published.