కరోన వ్యాప్తికి అడ్డుకట్ట వేయడంలో పట్టణాలకు మార్గము చూపుతున్న పల్లెలు.

  • కరోన వ్యాప్తికి అడ్డుకట్ట వేయడంలో పట్టణాలకు మార్గము చూపుతున్న పల్లెలు.
  • పట్టణాలతో పోలిస్తే పల్లెలే సేఫ్ అంటున్న సర్వేలు. 
  • ప్రజాప్రతినిధుల సహకారంతో కరోన వ్యాప్తికి చెక్ పెడుతున్న గ్రామస్తులు. 
పల్లెలే దేశానికి పట్టుగొమ్మలు అన్నారు మహాత్మా గాంధీ గారు, అదే బాటలో ఇప్పుడు తెలంగాణ రాష్ట్రంలో గ్రామాల్లో కరోన వ్యాప్తికి సంబంధించిన అవగాహన పట్టణాలకే ఆదర్శం అయ్యే రీతిలో ఉంది అని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. కరోన వ్యాప్తికి అడ్డుకట్ట వేయడంలో పల్లెలలో, పట్టణాలలో వ్యవస్థ ఎలా ఉంది అని నిర్వహించిన ఒక సర్వేలో పల్లెలో ఉండటమే సేఫ్ అని నిర్ధారించినట్లు పరిగణిస్తున్నారు. ఇప్పటివరకు తెలంగాణ లో నమోదు కాబడ్డ కరోన కేసులన్నీ పట్టణాలకు చెందినవే
తెలంగాణ రాష్ట్రాన్ని మరియు దేశాన్ని కాపాడుకోవాలంటే మన దగ్గర ఉన్న ఏకైక ఆయుధం సామాజిక దూరం పాటించడం అన్న ముఖ్యమంత్రి గారి మాటలను తూచా తప్పకుండా పాటిస్తూ ఉన్న గ్రామస్థులు కరోన వ్యాప్తిని ఎలాగైనా అడ్డుకట్ట వేయాలనే ఉద్దేశంతో గ్రామస్తులు పనిచేస్తున్నారు. ముఖ్యంగా ప్రజాప్రతినిధుల సమన్వయంతో ఎప్పటికప్పుడు జాగ్రత్త చర్యలను పకడ్బందీగా అమలు చేస్తున్నారు. ముఖ్యంగా పట్టణాల్లో చదువుకున్న వాళ్ళు ఎక్కువగా ఉంటారు అయిన కూడా మాకేం అవుతుంది లే అన్న అజాగ్రత్తతోని కరోనను కొని తెచ్చుకుంటున్నారు. కాబట్టి పల్లెలను చూసైనా పట్టణాల్లో నివసిస్తున్న ప్రజలు తగిన జాగ్రత్త చర్యలు తీసుకుంటే కరోనాను తెలంగాణ రాష్ట్రం నుంచి సాగనాంపవచ్చని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *