మళ్లీ అవే అబద్ధాలు
కరోనాను పట్టించుకోవట్లేదంటూ రోత రాతలు
కేసీఆర్ ప్రభుత్వంపై దుమ్మెత్తి పోయడానికి వెలుగు పత్రిక (చీకటి అని చదువుకోండి) కరోనాను ఆయుధంగా వాడుకుంటోంది. ప్రతినిత్యం నెగటివ్ స్టోరీలు రాస్తూ రాక్షసానందం పొందుతోంది. సెకండ్ వేవ్‌ను కంట్రోల్ చేయడం లేదంటూ ఈ రోజు ఒక కహానీ రాసింది. మొత్తం అబద్దాలతో స్టోరీని నింపేసింది. నిజం ఏంటంటే కరోనాను అత్యంత సమర్థంగా కంట్రోల్ చేస్తున్న రాష్ట్రాల్లో తెలంగాణ ఒకటి. టెస్టుల సంఖ్య పెరగడం, కరోనా ప్రొటోకాల్సును సమర్థంగా అమలు చేయడం, వ్యాక్సినేషన్‌ను పెంచడం ఇందుకు కారణాలు. ఈ విషయంలో బీజేపీ పాలిత రాష్ట్రాలు చాలా వెనుకబడ్డాయి. తెలంగాణలో కరోనా మరణాలు అతితక్కువ. అయినా వెలుగు పత్రిక ప్రభుత్వాన్ని బద్నాం చేయడం మానడం లేదు.
జనానికి తెలుసు ప్రభుత్వం ఏం చేస్తుందో! ఇలాంటి అమ్ముడుపోయిన మీడియాలు రాసిన స్టోరీలు చిత్తుకాగితంతో సమానం అనే విషయాన్ని పత్రిక యజమాని వివేక్ గుర్తుంచుకోవాలి. అన్ని రాష్ట్రాల్లాగే తెలంగాణలో రోజురోజుకు కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య పెరిగిపోతోంది. దీంతో రాష్ర్ట వైద్యారోగ్య మంత్రిత్వ శాఖ అప్రమత్తమైంది. ఇవాళ ఉదయం వైద్యారోగ్య శాఖ అధికారులతో ఆ శాఖ మంత్రి ఈటల రాజేందర్ ఫోన్లో మాట్లాడి పరిస్థితిని సమీక్షించారు. కరోనా నిర్ధారణ పరీక్షల సంఖ్య పెంచాలని అధికారులకు మంత్రి సూచించారు. టెస్టింగ్, ట్రేసింగ్, ట్రీటింగ్ పద్దతి కచ్చితంగా అమలు చేయాలని అధికారులను మంత్రి ఆదేశించారు.
కరోనా కేసులు పెరుగుతున్న నేపథ్యంలో రేపు వైద్య శాఖ అధికారులతో మంత్రి ఈటల రాజేందర్ అత్యవసరం సమావేశం నిర్వహించనున్నారు. రాష్ట్రంలో గడిచిన 24 గంటల్లో 684 పాజిటివ్ కేసులు రికార్డయ్యాయని తెలంగాణ వైద్య ఆరోగ్యశాఖ బుధవారం హెల్త్ బులిటెన్‌లో పేర్కొంది. వైరస్ ప్రభావంతో మరో ముగ్గురు మృత్యువాతపడ్డారు. కరోనా నుంచి 394 మంది బాధితులు కోలుకుని డిశ్చార్జి అయ్యారు. ప్రస్తుతం రాష్ట్రంలో 4,665 యాక్టివ్ కేసులున్నాయి. ప్రస్తుతం 1,873 మంది బాధితులు హోం ఐసోలేషన్‌లో ఉన్నారు.కొత్తగా 684 పాజిటివ్ కేసులు కొత్తగా రికార్డయిన కేసుల్లో అత్యధికంగా 184 కేసులు జీహెచ్ఎంసీ పరిధిలోనే ఉన్నాయి. మంగళవారం రాష్ట్రంలో 56,122 టెస్టులు చేసినట్లు వైద్య ఆరోగ్యశాఖ వివరించింది. తాజాగా నమోదైన కేసులతో మొత్తం పాజిటివ్ కేసుల సంఖ్య 3,07,889కు చేరగా.. 3,01,227 మంది కోలుకున్నారు. మృతుల సంఖ్య 1,697కు పెరిగింది. ఈ అంకెలను పరిశీలిస్తే తెలంగాణ రాష్ట్రం మిగతా రాష్ట్రాలతో పోలిస్తే చాలా బాగా పనిచేస్తోందని అర్థమవుతుంది. లేకపోతే పరిస్థితి చెయ్యి దాటిపోయేది.