సీఎం కేసీఆర్ దారిలోనే నడుస్తున్న కేంద్ర ప్రభుత్వం… 

సీఎం కేసీఆర్ దారిలోనే నడుస్తున్న కేంద్ర ప్రభుత్వం… 

పాతబడిన పార్లమెంటు కూల్చి కొత్తది కడతామని తాజాగా స్పష్టీకరణ… 

రాష్ట్రంలో పాత సచివాలయాన్ని కూల్చి కొత్తగా కట్టనుండటంపై స్పూర్తి పొందిన కేంద్రం… 
ఇప్పటికైనా కమలనాథులు ద్వంద్వ వైఖరి విడనాడి అభివృద్ధి దిశగా అడుగులు వేయాలి…
భారత జనతా పార్టీ నేతల ద్వంద్వ వైఖరి ఇప్పుడు స్పష్టంగా అందరికీ వెల్లడైంది. ప్రతిష్ఠాత్మకమైన భారత పార్లమెంటు భవనానికి కూల్చివేసి కొత్తది కడతామని, భద్రతా కారణాల వల్ల ఈ నిర్ణయం తీసుకున్నామని కేంద్రం తాజాగా కోర్టుకు తెలిపింది. తెలంగాణలోని వివిధ కారణాలతో సచివాలయం కూల్చినప్పుడు కమలనాథులు హంగామా చేసిన వారు ఇప్పుడే మాట్లాడతారు ముఖం ఎక్కడ పెట్టుకుంటారో తెలియాలి. మీరు చేస్తే సంసారం మేము చేస్తే వ్యభిచారం అన్నట్టు కమలనాథులు వ్యవహరిస్తుండడం సిగ్గుచేటు .
అసలు ఇలాంటి దిక్కుమాలిన విధానాలకు పాల్పడుతున్నరు కాబట్టే గత రెండు ఎన్నికల్లో కమలం పార్టీ నేతలను తరిమి కొట్టిన వాళ్లకు బుద్ధి రావడం లేదు. సచివాలయం కూల్చివేత పై నానా హంగామా చేసిన కమలనాథులు ఇప్పుడు భారత పార్లమెంటు కూల్చివేత అంటే దీనికి ఏం సమాధానం చెబుతారో చూడాలి. ఇప్పుడు కేంద్రం తీసుకున్న నిర్ణయాన్ని సమర్థించుకుంటారు అనడంలో ఎలాంటి సందేహం లేదు. అయితే ఇతరులు చేస్తే మాత్రం దేశద్రోహంగా సూత్రీకరించడం వల్ల లేకితనానికి నిదర్శనం.
తాజా పరిణామాలతో దేశమంతా తెలంగాణ దారిలో నడుస్తుందని మరోసారి రుజువైందని అందరూ అనుకుంటున్నారు. ఇప్పటికే పాత సచివాలయం కూల్చి వేసి కొత్త సచివాలయం నమూనాలను తెలంగాణ ముఖ్యమంత్రి గౌరవనీయులైన కల్వకుంట్ల చంద్రశేఖర రావు పరిశీలిస్తున్న సంగతి తెలిసిందే. ఎంతటి ఘన భవనం అయినా కూడా పాతపడితే దానివల్ల ప్రజలకు ఇబ్బందులు ఏర్పడితే వాటిని తీసివేసే కొత్తది కట్టడం సమంజసం గా తేలింది. ఈ నేపథ్యంలో సీఎం కేసీఆర్ ఏర్పర్చిన దారిలోనే అందరూ నడుస్తున్నట్లు మరోసారి రుజువు అయింది. ఇప్పటికైనా కమలనాథులు తెలంగాణ ప్రభుత్వం చేపడుతున్న పనులపై నిర్మాణాత్మక విమర్శలు చేయాలి అంతేగాని అడ్డగోలు విమర్శలు చేసుకుంటూ పోతే సెల్ఫ్ గోల్ చేసుకుంటారదే అనడంలో ఎలాంటి సందేహం లేదు. ఏదేమైనా ప్రభుత్వం ఏ నిర్ణయం తీసుకున్నప్పటి కూడా ప్రజా సంక్షేమమే ముందుగా దానిలో ఇనుమడించాలి. దాని తర్వాతే ఏ విషయం అయినా కూడా చూసుకోవాలి అని మరోసారి తేటతెల్లమైంది.