పసుపు బోర్డ్ పై మరోసారి పిచ్చి ప్రచారాన్ని షురూ చేసిన ధర్మపురి అర్వింద్ 

  • పసుపు బోర్డ్ పై మరోసారి పిచ్చి ప్రచారాన్ని షురూ చేసిన ధర్మపురి అర్వింద్ 
  • మీడియాలో వచ్చిన వార్తలను పార్టీలో వచ్చిన వార్తగా ప్రచారం చేస్తున్న వైనం. 
  • నువ్వు చెప్పె ప్రచారాలు అన్నిటినీ ప్రజలు నమ్మే పరిస్థితిలో లేరు అర్వింద్
తనను గెలిపిస్తే రెండు రోజుల్లో నిజామాబాద్ నగరానికి పసుపు బోర్డు తీసుకువస్తానని ప్రచారం చేసి గెలిచిన ధర్మపురి అర్వింద్. ప్రస్తుతం తెలంగాణలో జరుగుతున్న మున్సిపల్ ఎన్నికల్లో ప్రజలకు ముఖం చూపించే పరిస్థితి లేని తరుణంలో మరొక పిచ్చి వార్తను నిసిగ్గుగా ప్రచారం చేస్తున్నాడు. తాను ఎంపీగా గెలిచి ఆరు నెలలు గడుస్తున్నా కూడా నిజామాబాద్ పట్టణానికి పసుపు బోర్డు తీసుకొని రాని ఈ అసమర్థ ధర్మపురి అరవింద్. నిజామాబాద్ లో మున్సిపల్ ఎన్నికల కోడ్ అమల్లో ఉంది అందుకే మున్సిపల్ ఎన్నికలు అయిపోయిన తర్వాత నిజామాబాద్ కి పసుపు బోర్డ్ తీసుకొస్తానని సిగ్గులేకుండా అసత్యాలు చెబుతున్నాడు.
అసలు ధర్మపురి అర్వింద్ చెబుతున్న మాటలేవి బిజెపి పార్టీ నుంచి రాలేదు అది కేవలం మీడియాలో వచ్చిన ఫేక్ న్యూస్ గానే పరిగణించాల్సి ఉంది అని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. మున్సిపల్ ఎన్నికల్లో ప్రజలు టిఆర్ఎస్ పార్టీకి బ్రహ్మరథం పడుతున్న వేళ దానికి కనీసం పోటీ కూడా ఇవ్వని పరిస్థితుల్లో ఇటువంటి పిచ్చి వార్తలు మరోసారి ప్రచారం చేసి ఎన్నికల్లో క్యాష్ చేసుకోవాలని ధర్మపురి అరవింద్ భావిస్తున్నాడు.ఒక్కసారి ధర్మపురి అరవింద్ ని గెలిపించినందుకే పీకల్లోతుకి ముంచాడు అని మరోసారి నమ్మితే ప్రాణాలే లేకుండా చేశాడు అని నిజామాబాద్ ప్రజలు అనుకుంటున్నారు తెలంగాణ ముఖ్యమంత్రి శ్రీ కల్వకుంట్ల చంద్రశేఖర రావు గారు చేసే అభివృద్ధికి తాము కట్టుబడి ఉంటామని నిజామాబాద్ పట్టణంలోని టిఆర్ఎస్ పార్టీ అభ్యర్థులకు మంచి మెజారిటీ బ్రహ్మరథం పడతాము అని చెప్తున్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *