ఐసీఎంఆర్ గైడ్‌లైన్స్ ప్ర‌కార‌మే డిశ్చార్జ్‌లు

  • ఐసీఎంఆర్ గైడ్‌లైన్స్ ప్ర‌కార‌మే డిశ్చార్జ్‌లు
  • ల‌క్ష‌ణాలు లేకుంటే క‌రోనా టెస్టులు అవ‌సరం లేదు

 

ప్ర‌భుత్వాన్ని ఎలాగైనా విమ‌ర్శించే ప్ర‌య‌త్నంలో పిచ్చివార్త‌లు రాస్తూ వెలుగు ప‌త్రిక న‌వ్వుల‌పాల‌వుతోంది. క‌రోనా విష‌యంలో ఎలాగైనా కేసీఆర్ స‌ర్కారును బ‌ద్‌నాం చేయ‌డానికి పాపం అష్ట‌క‌ష్టాలు ప‌డుతున్న‌ది. రోజుకో ఫేక్ న్యూస్ రాస్తూ జ‌నం వాటిని న‌మ్ముతున్న‌ర‌ని భ్ర‌మ‌ప‌డుతున్న‌ది.  కరోనా సోకిన వాళ్లలో కొంతమందికి టెస్టులు చేయకుండానే హాస్పిటల్ నుంచి డిశ్చార్జ్ చేస్తున్నర‌ని గురువారం ఒక న్యూస్ రాసింది. వ్యాధి బాధితుల‌ను ప‌ట్టించుకోవ‌డం లేద‌నే యాంగిల్లో ఈ వార్త ఉంది.

ప్ర‌భుత్వం ఒక్కో పేషేంట్ ట్రీట్‌మెంట్‌కు రూ.నాలుగు ల‌క్ష‌ల వ‌ర‌కు ఖ‌ర్చు చేస్తుంటే వెలుగు వంటి ప‌త్రిక‌లు మాత్రం ఇలాంటి దిక్కుమాలిన వార్త‌లు రాస్తూ పైశాచిక ఆనందం అనుభ‌విస్తున్నాయి. క‌రోనా డిశ్చార్జ్‌ల విష‌యంలో డాక్ట‌ర్లు పూర్తిగా ఐసీఎంఆర్ రూల్స్‌ను పాటిస్తున్నారు. ఈ విష‌యంలో ప్ర‌భుత్వం ప్ర‌త్య‌క్షంగా జోక్యం చేసుకోవ‌డం లేదు. డాక్ట‌ర్ల విచ‌క్ష‌ణ‌కే వ‌దిలిపెట్టింది. రూల్స్ ప్ర‌కారం ఇప్పటివరకూ వరుసగా రెండు టెస్టుల్లో నెగెటివ్ వచ్చినవాళ్లను మాత్రమే డిశ్చార్జ్ చేశారు. బుధవారం 79 మందికి అసలు టెస్టులు చేయకుండానే ఇంటికి పంపించారు.

మరో 38 మందికి ఒక టెస్టులో నెగెటివ్ రావడంతో హాస్పిటల్ నుంచి బుధవారం డిశ్చార్జ్‌‌ చేశారు. ఇలా హాస్పిటల్  నుంచి మొత్తం 117 మంది డిశ్చార్జయ్యారు. వీరు హాస్పిటల్‌‌లో చేరి 15 రోజులు దాటింది. వీళ్లలో ఎవరికీ వైరస్ లక్షణాలు, జ్వరం ఏమీ లేవని డాక్టర్లు చెప్పారు. అంబులెన్స్‌‌లలో వీళ్లను ఇండ్లకు చేర్చారు. ఇండ్లలోనే 14 రోజులు ఐసోలేషన్ లో ఉండాలని సూచించారు. వైరస్ పాజిటివ్ వచ్చిన పది రోజుల తర్వాత, వరుసగా 3 రోజులపాటు జ్వరం లేకుంటే టెస్టులు చేయకుండానే డిశ్చార్జ్ చేయొచ్చని ఇటీవల ఇండియన్ కౌన్సిల్ ఫర్ మెడికల్ రీసెర్చ్‌‌(ఐసీఎంఆర్‌‌‌‌) గైడ్‌‌లైన్స్‌‌ జారీ చేసింది. ఈ గైడ్‌‌లైన్స్‌‌ అమలు చేయాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. అందులో భాగంగానే వారిని డిశ్చార్జ్  చేసినట్లు వైద్యారోగ్యశాఖ క్లియ‌ర్ గా చెప్పింది.