ప్రతి ఇంటికీ 5జీ స్పీడ్​ ఇంటర్నెట్​ కేటీఆర్​ చొరవతో హైస్పీడ్​ నెట్​

ప్రతి ఇంటికీ 5జీ స్పీడ్​ ఇంటర్నెట్​

కేటీఆర్​ చొరవతో హైస్పీడ్​ నెట్​

టెక్నాలజీపై పట్టున్న ఎక్స్​పర్ట్​ ఇండస్ట్రీల మంత్రి అయితే ఆ రాష్ట్రానికి ఎదురుండదు. గతంలో సాఫ్ట్​వేర్​ జాబ్​ చేసిన కేటీఆర్​ మంత్రిగా రాష్ట్రంలో నెట్​ వాడకాన్ని విపరీతంగా పెంచుతున్నారు. ఈ దిశగా ఆయన తాజాగా మరో అడుగు ముందుకు వేశారు. రాష్ట్ర ప్రభుత్వం చేపడుతున్న వినూత్న పథకాల నేపథ్యంలో గ్రామాల్లో ఇంటర్నెట్‌ వినియోగం పెరిగింది. నెట్​ లేకుండా పూట గడవని పరిస్థితి ఉంది. అయితే గ్రామాల్లో తగినన్ని టవర్లు లేక జనానికి తగినంత స్పీడ్​తో నెట్​ అందడం లేదు. ఈ సమస్యను పరిష్కరించడానికి తెలంగాణ ప్రభుత్వం భారీ ప్రాజెక్టును చేపట్టింది. సహజంగా కేటీఆర్​ టెక్​ శావీ పర్సన్​ కాబట్టి ఈ ప్రాజెక్టును సక్సెస్​ఫుల్​గా నిర్వహిస్తున్నారు. నెట్​ గొప్పతనం తెలుసు కాబట్టి రాష్ట్రం వచ్చిన మొదట్లోనే ఆయన దీని గురించి ఆలోచించారు.  రాష్ట్రంలో త్వరలోనే ప్రతి ఇంటికీ ఇంటర్నెట్ కనెక్టివిటీని అందిస్తారు. త్వరలో ప్రతి ఇంటికీ ఇంటర్నెట్ అందించిన తొలి రాష్ట్రంగా అవతరించబోతోందని కేటీఆర్​ మరోసారి ప్రకటించారు.

ఇందుకోసం రాష్ట్ర ప్రభుత్వం ప్రారంభించిన ఫైబర్‌‌ గ్రిడ్‌‌ ప్రాజెక్టు త్వరలోనే పూర్తి కానుంది. మారుమూల ప్రాంతాల్లోకి సైతం 5జీ నెట్ వర్క్ అందుబాటులోకి వస్తుంది. అంటే ఒక సినిమాను కేవలం నిమిషంలోనే డౌన్​లోడ్​ చేసుకోవచ్చు. ఆన్​లైన్​ క్లాసులు మరింత ఈజీ అవుతాయి. ఈ–పాలన మరింత సులువుగా మారుతుంది.  టెక్నాలజీ వాడకంతో ప్రజల జీవితంలో ఎన్నో మార్పులు వస్తాయి. అగ్రికల్చర్‌‌, హెల్త్‌‌కేర్‌‌, ఎడ్యుకేషన్‌‌ రంగాల్లో ఇన్నోవేషన్‌‌, ఎమర్జింగ్‌‌ టెక్నాలజీలను విస్తృతంగా వాడేలా ఇది వరకే కేటీఆర్​ చర్యలు తీసుకున్నారు. ఆయన చొరవ వల్లే వ్యవసాయ రంగంలో డ్రోన్లు ఉపయోగిస్తున్నారు. హెల్త్‌‌కేర్‌‌లో ‘మెడిసిన్‌‌ ఫ్రం ది స్కై’ ప్రాజెక్టులు అమలవుతున్నాయి. అంతేకాదు కొన్నె నెలల క్రితం పల్లె ప్రగతి పీఎస్‌ యాప్‌, ఇన్‌స్పెక్షన్‌ యాప్‌లను తీసుకొచ్చారు. పంచాయతీ కార్యదర్శి చేపట్టే రోజువారి, నెలవారీ కార్యకలాపాలను సజావుగా సాగించేందుకు ఈ యాప్‌లు ఉపయోగపడతాయి.

పారిశుద్ధ్యం, వీధి దీపాల నిర్వహణ, వ్యర్థాల సేకరణ, పల్లె ప్రగతి పనులు, పంచాయతీ రికార్డుల నిర్వహణ, జనన, మరణ ధ్రువీకరణ పత్రాల జారీ, పంచాయతీ ఆదా యం, ఆమోదించిన చెక్కులు, జీతాల రసీదులు ఇలా ఏ పని చేసినా ఈ యాప్‌ల ద్వారానే జరుగుతున్నాయి. ఇవే కాకుం డా ప్రతి నెలా పంచాయతీల ఆదాయ, వ్యయాలను ఆడిట్‌ చేస్తున్నారు. తాజాగా ఇండ్ల రికార్డులను కూడా డిజిటలైజేషన్‌ చేసి ఆన్‌లైన్‌లో పెట్టారు. అయితే, ఈ పనులన్నింటికీ ఇంటర్నెట్‌ సిగ్నల్‌ ప్రధాన అడ్డంకిగా మారింది.  మారుమూల గ్రామాల్లో నెట్‌వర్క్‌ సిగ్నల్‌ సరిగా లేక వివరాల నమోదులో జాప్యం ఏర్పడుతున్నది. ఈ సమస్యలకు చెక్‌ పెట్టేందుకే గ్రామాలకు ఫైబర్‌ నెట్‌ సదుపాయం కల్పించనుంది.  నెట్‌ సదుపాయం అందుబాటులోకి వస్తే ఇ కపై ఇలాంటి సమస్యలు ఉండవు. ప్రజలకు సత్వర సేవలు అందుతాయి. ముఖ్యంగా గవర్నమెంటు సేవలను త్వరగా పొందవచ్చు.