జగ్గూ.. నీకు అర్థం కాకపోతే.. ఆ మంచి ఏంటో జనానికి అర్థం కాదా!

జగ్గూ.. నీకు అర్థం కాకపోతే.. మంచి ఏంటో జనానికి అర్థం కాదా!

  • కేసీఆర్ చేస్తున్న సంక్షేమాన్ని అర్థం చేసుకోలేకపోతున్న జగ్గారెడ్డి
  • ఎందుకు ఓట్లేస్తున్నారో అంటూ.. అమాయకంగా నటిస్తున్న వైనం
  • కాంగ్రెస్ కు చేతకానిది టీఆర్ఎస్ కు చేతనైనందువల్లే అంటున్న జనం

జగ్గారెడ్డికి జనం క్లాస్ పీకాల్సిన సమయం వచ్చింది. తాము ఇచ్చిన తీర్పును సంగారెడ్డి నేత అయిన జగ్గారెడ్డి అవమానిస్తుంటే.. తిరగబడాల్సిన సమయం ఆ ప్రాంత ప్రజానీకానికి వచ్చింది. మంచి చేస్తున్నారు కాబట్టే.. పేదలు, వృద్ధులు, బీడీ కార్మికులు, వితంతువులు, దివ్యాంగులు, ఒంటరి మహిళలను.. అన్నలా, బిడ్డలా, తోబుట్టువులా, తండ్రిలా, తల్లిలా ఆదుకుంటున్నాడు కాబట్ట కేసీఆర్ నాయకత్వాన్ని గెలిపించారు.

కానీ.. ఆ గెలుపును అపహాస్యం చేసేలా.. ప్రజలు ఇచ్చిన తీర్పును అవమాన పరిచేలా.. జగ్గారెడ్డి వ్యాఖ్యలు చేస్తున్నడు. అసలు ప్రజలు కేసీఆర్ కు ఎందుకు ఓటేస్తున్నారో తనకు అర్థం కావడం లేదంటూ మతి లేని మాటలు మాట్లాడుతున్నడు. ఓ వైపు మంత్రులు హరీష్, కేటీఆర్ ను అభినందిస్తూనే.. మరోవైపు టీఆర్ఎస్ డబ్బు పంచుతోందంటూ పసలేని నిరాధార ఆరోపణలు చేశారు.

ఈ సందర్భంగా జగ్గారెడ్డి ఓ విషయాన్ని గమనించాలి. ఎన్నికలు రాగానే జనంలోకి వెళ్లి ఊదరగొట్టే సంస్కృతిని టీఆర్ఎస్ నెమ్మదిగా తగ్గించేస్తోంది. తను చేసిన పనితో.. తను చేసిన సంక్షేమంతోనే మాట్లాడుతూ.. ప్రతి ఎన్నికల్లో ఓట్ల వర్షాన్ని పొందుతోంది. జనం ఆదరణతో.. అసమాన ఫలితాలు సాధిస్తోంది. ఈ లెక్కన ప్రజలపై అచంచల విశ్వాసంతో ప్రచారానికే దూరంగా ఉంటున్న టీఆర్ఎస్ ను.. ప్రజలు ఎంతగా ఆదరిస్తే ఇంతటి ఫలితాలు రావాలి?

ఈ మాత్రం కనీస రాజకీయ పరిజ్ఞానం జగ్గారెడ్డికి లేకుంటే.. ఎవరూ ఏమీ చేయలేరు. అందుకే సంగారెడ్డి ప్రజలు కూడా ఆయన కనిపిస్తే ఛీ కొడుతున్నారు. ఎన్నికల్లో ఆయన ప్రచారం చేసినా.. ఓట్లు మాత్రం టీఆర్ఎస్ కే పడేలా చేశారు. అందుకే.. మతి భ్రమించి ఇలా జగ్గారెడ్డి వింత మాటలతో చికాకు పెడుతున్నాడు. ప్రజలారా.. ఇలాంటివారిపై నిత్యం ఓ కన్నేసి ఉంచండి. కేసీఆర్ పాలనపై మతి లేని మాటలు చేస్తున్న ఇలాంటివారిని రాజకీయంగా తరిమికొట్టండి.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *