పసుపు రైతుల కోసం తండ్లాడింది  కవితమ్మ మాత్రమే!

పసుపు రైతుల కోసం తండ్లాడింది  కవితమ్మ మాత్రమే!

కేంద్రమంత్రుల ఆఫీసుల చుట్టూ చెప్పులరిగేలా తిరిగారు

లాబీయింగ్​ చేశారు. హైదరాబాద్​లో మీటింగ్​లు పెట్టారు

ఈ విషయంలో బీజేపీ, కాంగ్రెస్​వి దొంగ మాటలు

పసుపు రైతుల కన్నీళ్లు తుడవడానికి అప్పటి నిజామాబాద్​ ఎంపీ కల్వకుంట్ల కవిత ఎక్కడ కొండ లేదు. మొక్కని బండ లేదు. పసుపుబోర్డు ఏర్పాటు కోసం కేంద్ర మంత్రుల కార్యాలయాల చుట్టూ చెప్పులు అరిగేలా తిరిగారు. చివరికి తన తండ్రి కేసీఆర్​తో పైరవీలు చేయించారు. హైదరాబాద్​లో ప్రత్యేకంగా మీటింగులు పెట్టారు. బోర్డు ఏర్పాటు వల్ల ప్రభుత్వంతోపాటు రైతులకు లాభమని మొత్తుకున్నారు. అయినా బీజేపీ ప్రభుత్వం పట్టించుకోలేదు. ఎందుకంటే నిజామాబాద్​లో ఆమె ఓడిపోవాలన్నది దాని ప్లాన్​. మాయమాటలు చెప్పి జనాన్ని మోసం చేసి, డబ్బు పంచి, కవితపై ప్రాపగాండా చేసి గెలిచిన అర్వింద్​ తడిగుడ్డతో పసుపు రైతుల గొంతు కూశాడు. బోర్డు ఇస్తానని హామీ ఇచ్చి చివరికి స్పైసెస్​ బోర్డు అంటూ డ్రామాలాడాడు. ఇటీవల వందలాది మంది రైతులు వీడి మొహాన ఉమ్మేశారు. అయినా సిగ్గులేకుండా.. స్పైసెస్​ బోర్డు ఘనత నాదే అంటూ గొప్పలు చెప్పుకుంటున్నాడు. మద్దతు ధరతో తనకు సంబంధం లేదని బుకాయిస్తున్నాడు. ఇప్పుడు సీన్​లోకి రేవంత్​ రెడ్డి వచ్చాడు.  పసుపు రైతులకు కాంగ్రెస్ పార్టీ అండగా ఉంటుందని ప్రకటించుకున్నాడు. ఎంపీ అయిన తరువాత ఒక్కసారి కూడా ఈ సబ్జెక్టు మీద మాట్లాడని ఈ సన్నాసి ఇప్పుడు ఎన్నికలు ఉన్నాయి కాబట్టి మైకు పట్టుకొని ఊగిపోతున్నాడు. కాంగ్రెస్​ అధికారంలో ఉన్నప్పుడు ఒక్కడూ పసుపు బోర్డు గురించి పట్టించుకోలేదు.  అయితే, బీజేపీ అగ్రనేతలు ఎన్నికల సమయంలో ఇదే ఆర్మూర్ లో పసుపు రైతులకు అనేక వాగ్దానాలు చేసి మర్చిపోయారన్న ఇతడి విమర్శల్లో నిజం ఉంది. పసుపుకి గిట్టుబాటు ధర ఇస్తామని చెప్పి రైతులను మోసం చేశారు. అర్వింద్ గెలిస్తే పసుపు బోర్డు ఇస్తామని రాంమాదవ్ మాటిచ్చారు. ఎంపీ అర్వింద్ బాండ్ రాసిచ్చి రైతులను మోసం చేశాడు.  ప్రపంచంలో అన్ని విషయాల మీద మాట్లాడే బండి సంజయ్ కి నిజామాబాద్ జిల్లా పసుపు రైతులు ఎందుకు కనబడటం లేదో అర్థం కావడం లేదు.   పసుపు మద్దతు ధర కోసం పార్లమెంటులో గళం విప్పుతామన్న కాంగ్రెస్​ నాయకుల మాటలను నమ్మడం చాలా కష్టం. కాంగ్రెస్​, బీజేపీ.. రెండూ రైతు ద్రోహులే! వీళ్ల కాన్సంట్రేషన్​ అంతా కార్పొరేట్ల మీదే ఉంటుంది.  ఈ విషయంలో చిత్తశుద్ధిగా పోరాడింది కవిత ఒక్కరే!