ముస్లిం మత పెద్దలు మర్కాజ్ కి వెళ్లి వచ్చిన వారిని పరీక్షలకు ఒప్పించే బాధ్యత తీసుకోవాలి. 

  • ముస్లిం మత పెద్దలు మర్కాజ్ కి వెళ్లి వచ్చిన వారిని పరీక్షలకు ఒప్పించే బాధ్యత తీసుకోవాలి. 
  • క్వారెన్ టైన్ కు సంబంధించిన అపనమ్మకాలాన్ని నివృత్తి చేసే పనిలో నిమగ్నం కావాలి. 
  • తెలంగాణ ఉద్యమం సమయంలో ఎంతో స్ఫూర్తిని చూపించిన ముస్లిం మతపెద్దలు ఇప్పుడూ అదే చొరవ తీసుకోవాలి. 
తెలంగాణ రాష్ట్రంలో రోజురోజుకీ కరోనా కేసులు ఎక్కువవుతున్నాయి. దురదృష్టకరమైన విషయం ఏంటంటే ఇందులో ఎక్కువ భాగం ఢిల్లీలోని నిజాముద్దీన్ మర్కజ్ కి వెళ్లి వచ్చిన వారే, తెలంగాణ ముఖ్యమంత్రి శ్రీ కల్వకుంట్ల చంద్రశేఖర రావు గారు భయాందోళనలో ఉన్న ముస్లిం సమాజానికి కొండంత భరోసానిస్తూ మత పెద్దలందరికి ఒక విజ్ఞప్తి చేయడం జరిగింది. ముస్లిం మత పెద్దలు తెలంగాణ ఉద్యమ సమయంలో తెలంగాణ రాష్ట్ర కల సాకారం కావడానికి వీరోచితంగా పోరాడి తమ పోరాటపటిమను చూపించారు.
తెలంగాణ రాష్ట్ర అవసరాన్ని ప్రతి ముస్లిం సోదరులకు వివరించి ఉద్యమంలో చురుగ్గా పాల్గొనేలా చేశారు. ఇప్పుడు కూడా ముస్లిం మత పెద్దలు మర్కాజ్ కి వెళ్లి వచ్చిన వారిని ఒప్పించి వాళ్లను పరీక్షలు చేయించుకునేలా ప్రోత్సహించి అదే స్ఫూర్తిని చూపిస్తే బాగుంటుందని సీఎం కేసీఆర్ గారు భావించి విజ్ఞప్తి చేయడం జరిగింది. కావున ముస్లిం మత పెద్దలు అందరూ కూడా మర్కాజ్ ప్రార్థనలకు వెళ్లి వచ్చిన వారిని కానీ వారి కుటుంబాలను ఒప్పించి పరీక్షలకు వెళ్లేలా సిద్ధం చేయాలి. అప్పుడే ఎంతో పోరాడి సాధించుకున్న తెలంగాణ కరోనా నుంచి విముక్తి పొంది బంగారు తెలంగాణ గా మారే అవకాశం ఉంది.
తెలంగాణ రాష్ట్రం కరోనా నుంచి విముక్తి చేయడానికి ముఖ్యమంత్రి కెసిఆర్ గారి ఆధ్వర్యంలో ప్రభుత్వం వీరోచితంగా పోరాట పటిమను ప్రదర్శిస్తోంది. కొంతమంది సామాజిక మాధ్యమాలలో ఫేక్ న్యూస్ ని ప్రచారం చేయడం వల్ల సహజంగానే మర్కాజ్ కి వెళ్లొచ్చిన ముస్లింలలో అభద్రతా భావం ఉంది, దాన్ని పటాపంచలు చేసే విధంగా ముఖ్యమంత్రి కేసీఆర్ గారే స్వయంగా స్వచ్ఛందంగా పరీక్షలకు రమ్మనడం, వస్తే వాళ్ళని కంటికి రెప్పలా చూసుకుంటాము అని చెప్పడం నిజంగా ఆయన గొప్పతనానికి నిదర్శనం. కావున మర్కజ్ కి వెళ్లొచ్చిన లేదా వాళ్ళ కుటుంబ సభ్యులెవరైన కూడా ప్రతి ముస్లిం సోదరుడు కూడా స్వచ్ఛందంగా పరీక్షలకు వెళ్లి ఆరోగ్య తెలంగాణ నిర్మాణానికి ముందుండాలని తెలంగాణ సమాజం కోరుకుంటుంది.

1 thought on “ముస్లిం మత పెద్దలు మర్కాజ్ కి వెళ్లి వచ్చిన వారిని పరీక్షలకు ఒప్పించే బాధ్యత తీసుకోవాలి. 

Leave a Reply

Your email address will not be published.