కేసీఆర్ నిర్దేశించిన  వ్యవసాయానికి సై అంటున్న తెలంగాణ రైతులు…

 

  • కేసీఆర్ నిర్దేశించిన  వ్యవసాయానికి సై అంటున్న తెలంగాణ రైతులు…
  • కేసీఆర్ మాట పూలబాట అంటున్న వైనం…
  • ఇప్పటికే వ్యవసాయరంగానికి కేసీఆర్ ఎంతో చేశారని గుర్తు చేసుకున్న వైనం…
  • తెలంగాణ ప్రభుత్వ విధానాలకు తమ మద్దతు ఎప్ప‌టికీ అని వెల్లడి…

తెలంగాణ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర రావు చెప్పినట్టు నియంతృత్వ‌ సేద్యానికి రైతులు సై అంటున్నారు. ఇప్పటికే ధర్మపురి నియోజ‌క‌వ‌ర్గంలలోని కొన్ని గ్రామాలలో రైతులు నియంతృత్వ సేద్యానికి ఓకే చెప్పారు. సీఎం కేసీఆర్ మాట వింటే తాము రాజులుగా మారతాం అని అభివర్ణిస్తున్నారు. తరతరాలుగా ఒకే రకపు పంటలు సాగుచేసి, తాము తీవ్రంగా నష్టపోయామని ఇప్పటికైనా త‌మ జీవ‌న‌శైలిని మార్చుకొంటామని పేర్కొంటున్నారు. ఇప్పటివరకు సీఎం కేసీఆర్ తమ కోసం ఎన్నో మంచి పనులు చేశారని, ఆయన దారిలో నడిస్తే పూలబాట అని అంటున్నారు. నియంతృత్వ సేద్యం విషయంలో ప్రభుత్వం నుంచి ఎలాంటి ఆదేశాలు వచ్చినా కూడా వాటిని పాటిస్తామని అవి పేర్కొంటున్నారు. స్వయంగా ఒక రైతు అయినా సీఎం కేసీఆర్ చెప్పే మాటలు వింటే మరింతగా భవిష్యత్తు బాగుంటుంది అని అంటున్నారు.

త్వరలోనే ప్రభుత్వం ఆదేశాల ప్ర‌కారం రాష్ట్ర వ్యాప్తంగా సర్వే చేసి ఏ భూములు ఎలాంటి పంటలకు అనుకూలంగా ఉంటాయోన‌ని  అధికారులు నివేదిక ఇవ్వనున్నారు. తెలంగాణ వ్యవసాయ ముఖచిత్రాన్ని దశ దిశ మార్చే విధంగా సీఎం కేసీఆర్ నిర్ణయం తీసుకుంటున్నారు. రైతులు ఏ రకాల పంటలు వేయాలో చెప్పి, వారి పంటలకు మద్దతు ప్రకటించి, వాటిని తాము కొనుగోలు చేయనున్నట్లు తెలిపారు. ఇప్పటికే అనేక విషయాల్లో దేశవ్యాప్తంగా ఆదర్శంగా నిలిచిన తెలంగాణ వ్యవసాయ విధానాలలోనూ తమ మార్కు చూపెట్టుకుంది. తాజా విధానంతో తెలంగాణలో వ్యవసాయ విధానం మూడు పువ్వులు ఆరుకాయలుగా వర్ధిల్ల నుంది. రైతుల అప్పులు అన్ని తీరి వాళ్లంతా ఆ సుఖ సంపదలతో తులతూగే అవకాశం ఉంది.