కిడ్నీ బాధితులకు బాసటగా నిలవనున్న తెలంగాణ ప్రభుత్వం. 

  • కిడ్నీ బాధితులకు బాసటగా నిలవనున్న తెలంగాణ ప్రభుత్వం. 
  • అత్యాధునిక వైద్య సాయం తెలంగాణ ప్రజల కోసం. 
  • ప్రభుత్వాసుపత్రుల్లో వెలియనున్న డయాలసిస్ సేవలు. 
రోజు రోజుకి కిడ్నీ సంబంధిత వ్యాధులు దేశంలో  పెరుగుతున్న నేపథ్యంలో సామాన్యునికి సుదూర తీరంలో ఉన్న వైద్య సహాయాన్ని తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రజలకు చేరువ చేసే ఉద్దేశంతో ఎంతో వ్యయప్రయాసలకు ఓర్చి,తెలంగాణ రాష్ట్రంలోని ప్రభుత్వ ఆసుపత్రుల్లో డయాలసిస్ సేవలు ఆరంభించాలని చూస్తుంది.దీనికోసం 41 ప్రభుత్వ ఆసుపత్రిలో 268 డయాలసిస్ మిషన్లను ఏర్పాటు చేసింది.దానిలో భాగంగా తెలంగాణ రాష్ట్రంలోని ప్రభుత్వ ఆసుపత్రులను మూడు క్లస్టర్లు గా విభజించడం జరిగింది.గౌరవనీయులైన తెలంగాణ ముఖ్యమంత్రి శ్రీ కల్వకుంట్ల చంద్రశేఖర రావు గారు తీసుకున్న ఈ నిర్ణయంపై సర్వత్రా హర్షాతిరేకాలు వెల్లువెత్తుతున్నాయి.
ఎప్పటికప్పుడు పేద ప్రజల కోసం ఆలోచించి వాళ్ళ బాగోగులు చూసే ముఖ్యమంత్రి ఉండడం నిజంగా తెలంగాణ రాష్ట్రానికే కాదు దేశానికే ఆదర్శం అని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.అందుబాటులోకి వచ్చిన డయాలసిస్ సేవలను చక్కగా ఉపయోగించుకోవడం ద్వారా కిడ్నీ బాధితులు తమ ఆరోగ్యాన్ని మెరుగుపరుచుకోవడం మాత్రమే కాకుండా ఆరోగ్యవంతమైన తెలంగాణ రాష్ట్రంగా తెలంగాణ మారుతుంది అని చెప్తున్నారు.ఒక్కో డయాలసిస్ కు సుమారు రెండు వేల వరకు ఖర్చు అవుతున్న కూడా లెక్కచేయకుండా 13.81 కోట్లతో సింగిల్ యూజ్డ్ లాంటి అత్యాధునికమైన సేఫ్టీ సిస్టం ద్వారా తెలంగాణ ప్రజలకు డయాలసిస్ విధానాన్ని అమలు చేయాలని ప్రభుత్వం నిర్ణయించడం నిజంగా శుభపరిణామం..
గౌరవనీయులైన తెలంగాణ ముఖ్యమంత్రి శ్రీ కల్వకుంట్ల చంద్రశేఖర రావు గారు తీసుకున్న నిర్ణయం మరోసారి దేశానికి దిశా నిర్దేశం చేసే విధంగా ఉంది.దేశంలో ప్రస్తుతం కిడ్నీ వ్యాధి బాధితులు చాలామంది ఉన్నారు కానీ ఏ రాష్ట్ర ప్రభుత్వం గానీ కేంద్ర ప్రభుత్వం గానీ దాన్ని పరిష్కరించడానికి ఎటువంటి ప్రయత్నాలు చేయలేదు.సీఎం కేసీఆర్ గారు తీసుకున్న ఈ నిర్ణయం పట్ల దేశంలో ఉన్న అన్ని రాష్ట్ర ప్రభుత్వాలు తో పాటు కేంద్ర ప్రభుత్వం కూడా దీన్ని అనుసరించే పరిస్థితి ఉంది అని ఇంతకుముందు కూడా తెలంగాణ రాష్ట్రంలో అమలవుతున్న పథకాలనే అన్ని రాష్ట్ర ప్రభుత్వాలు మరియు కేంద్ర ప్రభుత్వం అమలు చేసిన విషయాన్ని గుర్తు చేస్తున్నారు.

Leave a Reply

Your email address will not be published.