- దేవుడినీ రాజకీయాల్లోకి లాగుతున్నారు
- యాదాద్రిపై దరిద్రపు రాతలు
- ప్రభుత్వం పట్టించుకోవడం లేదని నిందలు
కేసీఆర్ ప్రభుత్వం రాకముందు యాదాద్రి ఆలయాన్ని అప్పటి ప్రభువులు పట్టించుకోలేదనే విషయం ప్రతి ఒక్కరికీ తెలుసు. ఆలయం నుంచి వచ్చే డబ్బును వాడుకోవడం తప్ప దాని బాగోగులు చూసుకోవడానికి ఆంధ్రా పాలకులు ఇష్టపడలేదు. నర్సింహస్వామికి నిత్యపూజలు, అర్చనలు జరుగుతున్నాయో లేదో కూడా తెలియని పరిస్థితి. కేసీఆర్ సీఎం అయ్యాక పరిస్థితులు పూర్తిగా మారాయి. చిన జీయర్ స్వామితో కలిసి ఆలయాన్ని సర్వాంగ సుందరంగా తీర్చిదిద్దడానికి వందల కోట్ల రూపాయలు ఖర్చు చేశారు.
నిర్మాణ పనులు వేగంగా జరుగుతున్నాయి. ఇటీవల కురిసిన భారీ వర్షాల వల్ల గుడిలోకి కొద్దిగా నీరు వచ్చింది. ఈ చిన్న విషయాన్ని మీడియా రాద్దాంతం చేసింది. కేసీఆర్ పట్టించుకోకపోవడం వల్లే ఇలా జరుగుతున్నదని నిందలు వేసింది. దేవుడి పేరుతో కేసీఆర్ సర్కారును బద్నాం చేసే కుట్రలు జరుగుతున్నాయి. కేసీఆర్ గొప్ప భక్తుడు. నిత్యం పూజలు, యజ్ఞాలు చేసే మహనీయుడు. అలాంటి వ్యక్తి యాదాద్రి క్వాలిటీ విషయంలో రాజీపడతాడా ? ముఖ్యమంత్రిగా కేసీఆర్ బాధ్యతలు చేపట్టిన తర్వాత యాదాద్రి లక్ష్మీ నృసింహస్వామి ఆలయాన్ని పునర్నిర్మించాలని నిర్ణయం తీసుకున్నారు.
యాదగిరిగుట్ట టెంపుల్ డెవలప్మెంట్ అథారిటీ (వైటీడీఏ) ఏర్పాటు చేసి రూ. 1200 కోట్లు కేటాయించారు. పక్కనే పెద్ద గుట్టను సేకరించడంతో పాటు ఆలయం దిగువలో దాదాపు 250 ఎకరాలను సేకరించారు. మరో కొండపై ప్రెసిడెన్షియల్సూట్ నిర్మాణం చేపట్టారు. ఇప్పటి వరకూ రూ. 750 కోట్లను విడుదల చేశారు. ఇందులో ఆలయ నిర్మాణ పనుల కోసం రూ. 200 కోట్లు ఖర్చు చేశారు. ముఖ్యమంత్రి కేసీఆర్స్వీయ పర్యవేక్షణలో నాలుగేళ్లుగా పనులు కొనసాగుతున్నాయి.
వర్షపు నీరు చేరినట్టు ఫిర్యాదు రావడంతో వైటీడీఏ ఆఫీసర్లు ఆలయాన్ని పరిశీలించినప్పటికీ లీకులు గుర్తించలేకపోయారు. దీంతో హైదరాబాద్ ప్రధాన కేంద్రంగా భారీస్థాయి నిర్మాణ పనులను పర్యవేక్షించే ఓ సంస్థ నిపుణుల బృందాన్ని రప్పించారు. ఆలయంలో ఎక్కడెక్కడ లీకేజీలు ఏర్పడ్డాయో దాదాపు నాలుగు గంటలపాటు వారు పరిశీలించారు. త్వరలోనే నివేదిక ఇస్తామని చెప్పారు. అయితే నిర్మాణాలకు ఉపయోగించిన రా మెటీరియల్లో క్వాలిటీ ఉందని , ఎక్కడా రాజీపడలేదని అధికారులు నిర్ధారించారు. అసంపూర్తి భవనాల్లోకి నీళ్లు రావడం అత్యంత సాధారణ విషయమని చెప్పారు.