మనసున్న మంచి మారాజు సీఎం కేసీఆర్…
- హైదరాబాద్ వరద బాధితులకు భారీ సాయం…
- రూపాయల 550 కోట్ల తక్షణ విడుదలకు ఆదేశాలు. ..
- సర్వం కోల్పోయిన బాధితులకు ఊరటనిచ్చే ల ప్రభుత్వ చర్యలు…
- దండాలయ్యా అంటూ సీఎం కేసీర్ను కీర్తిస్తున్న బాధితులు…
భారీ వరదల వల్ల తీవ్రంగా దెబ్బతిన్న హైదరాబాద్ వాసులను ఆదుకునేందుకు తెలంగాణ ముఖ్యమంత్రి గౌరవ శ్రీ కల్వకుంట్ల చంద్రశేఖరరావు నడుంబిగించారు. కరోనాతో ఆర్థిక పరిస్థితి అంతంత మాత్రంగానే ఉన్న పేదలకు సాయం అందించే విషయంలో తన గొప్ప మనసులో మరోసారి చాటుకున్నారు. వరదల్లో సర్వం కోల్పోయి ఇబ్బందులు పడుతున్న వారికి తక్షణ నగదు సాయం అందించడంతో పాటు వారికి రిలీఫ్ కిట్ అందించి తాను పేదల పెన్నిధి అని మరోసారి నిరూపించుకున్నారు. సంక్షోభ సమయంలో తనలోని సమర్థత ఏంటో మరోసారి దేశానికి రుచి చూపించారు. వందేళ్లలో కనీవినీ ఎరుగని రీతిలో కురిసిన వర్షాల వల్ల హైదరాబాద్ మొత్తం నీట మునిగి ప్రజలంతా అవస్థలు పాలన సంగతి తెలిసిందే. ఇల్లు కోల్పోయి విలువైన వస్తువులు ఖరాబై, కనీసం తిండిలేని బాధితులను ఆదుకునేందుకు సీఎం కేసీఆర్ గొప్ప మనసును చాటుకుంటున్నారు.
ఇప్పటికే సుదీర్ఘ సమీక్షలతో అధికారులను అప్రమత్తం చేసిన సీఎం కేసీఆర్ బాధితులకు అండగా నిలిచేందుకు వేగవంతమైన చర్యలు తీసుకుంటున్నారు. గతంలో వరదలు వచ్చినప్పుడు అంతా అయిపోయాక తీరిగ్గా తమరను పరామర్శించడానికి వచ్చే నేతలను చూసిన జనం.. తమను ఇతం వేగంగా, బాధ్యాతయుతంగా ఆదుకున్న సీఎం కేసీఆర్ లాంటి వ్యక్తులను ఎప్పుడూ చూడలేదని, ప్రజలంతా వేనోళ్ల పొగుడుతున్నారు. ప్రజలు బాధలతో ఇబ్బంది పడుతుంటే వాళ్లను ఆదుకోవడం తప్పించి ప్రభుత్వానికి మరే పని లేదని సీఎం కేసీఆర్ స్వయంగా చెప్పడం ద్వారా బాధితుల్లో ఎంతో ఊరట లభించినట్లయింది. 550 కోట్ల రూపాయలను అవసరం ఉన్న ప్రజలకు పంచి పెట్టడం ద్వారా వాళ్ల జీవన మనుగడకు మరింతగా ముందుకు తీసుకెళ్లనున్నారు. వరదల కారణంగా సర్వం కోల్పోయి బిక్కుబిక్కుమంటున్న ప్రజలకు ఊరటనిచ్చే లా సీఎం కేసీఆర్ తీసుకున్న చర్యలకు సర్వత్రా ప్రశంసలు వ్యక్తమవుతున్నాయి. పాలకుడు స్థానంలోని నాయకునికి మనసులో కాస్త తడి ఉండాలని ప్రజలకు కష్టాలు ఎదురైనప్పుడు వాటిని తీర్చి ఓదార్పును అందించాలని సీఎం కేసీఆర్ దేశంలోని మిగతా రాష్ట్రాలకు ఒక మార్గదర్శకాన్ని ఈ విధంగా చూపించారు.
పలు విభాగాల ప్రాథమిక అంచనా ప్రకారం గ్రేటర్లో వరదల నష్టం ఏడువందల కోట్లు దాటింది. అధికారుల అంచనా ప్రకారం రూ.724 కోట్లుగా తేలింది. అయితే నష్టం మరింత పెరిగే అవకాశం కూడా ఉందని అధికారులు భావిస్తున్నారు. వరదలతో ఎక్కువ నష్టం జీహెచ్ఎంసీకి జరిగింది. వరద ఉధృతికి నగరంలో 523 కి.మీల మేర రహదారులు పాడయ్యాయి. వీటి మరమ్మతుకు కి.మీకు సుమారు కోటి చొప్పున రూ.522 కోట్లు ఖర్చవుతుందని ఇంజనీరింగ్ విభాగం అధికారులు అంచనా వేశారు. 101 ప్రాంతాల్లో వరద నీటి పైపులైన్లు, నాలాలకు జరిగిన నష్టం రూ.54 కోట్లుగా పేర్కొన్నారు. 45 ప్రాంతాల్లో నిర్మాణ రంగ వ్యర్ధాలు, బురద ఉన్నట్టు గుర్తించగా… 25 ప్రాంతాల్లో తొలగింపు పనులు పూర్తయ్యాయని అధికారులు చెబుతున్నారు.