కేసీఆరే లేకపోతే.. వాళ్ల పరిస్థితి ఏంటి? – కనీస బాధ్యత లేని ప్రధాని మోదీ

కేసీఆరే లేకపోతే.. వాళ్ల పరిస్థితి ఏంటి?
– కనీస బాధ్యత లేని ప్రధాని మోదీ
– వలస కార్మికులపై పట్టింపులేని వైఖరి
– ఆర్థిక సాయం, బియ్యంతో ఆదుకున్న తెలంగాణ సర్కార్
– ఏ రాష్ట్రమూ చేయని రీతిలో సహాయ చర్యలు


పాపం వలస కార్మికులు. లాక్ డౌన్ కారణంగా ఎటూ పోలేక.. ఉన్న చోటే చిక్కుకుని బిక్కుబిక్కుమంటూ గడిపారు. దేశంలోని చాలా రాష్ట్రాల్లో.. పనుల కోసమని వెళ్లిన ఇతర ప్రాంతాల వాళ్లు.. ఉన్నఫళంగా ముంచుకొచ్చిన లాక్ డౌన్ తో తిండీ తిప్పలు లేకుండా కన్నీళ్లతో దాహం తీర్చుకుంటూ కాలాన్ని వెళ్లదీశారు. ఇలాంటి తరుణంలో.. దేశమంతా వలస కార్మికులను విస్మరించింది. బాధ్యత తీసుకోవాల్సిన కేంద్ర ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరించింది. వాళ్లు కూడా మన దేశానికే చెందిన వాళ్లన్న విషయాన్ని మరిచిపోయింది. తండ్రిలా ఆదుకోవాల్సిన కేంద్రం.. తమను విస్మరించిన తీరుకు దేశ వ్యాప్తంగా చిక్కుకున్న వలస కార్మికులుకన్నీళ్లు పెట్టుకున్నారు. కనీసం తమ ఊళ్లకు పంపాలన్నారు.
ఇలాంటి వాళ్లను ఎవరూ పట్టించుకోకున్నా.. తెలంగాణ ప్రభుత్వం మాత్రం కడుపులో పెట్టుకుని చూసుకుంది. ఆపదలో ఉన్న వారికి అన్నీ తానై నిలిచింది. తెలంగాణకు చెందనివారైనా సరే.. వేరే ప్రాంతం నుంచి ఉపాధి నిమిత్తం మన రాష్ట్రానికి వచ్చిన వారిని అతిథులుగా గౌరవించింది. మనిషికి 12 కిలోల చొప్పున బియ్యంతో పాటు.. ఆర్థిక సహాయాన్ని అందించి ఆదుకుంది. వారు ఆకలి తీర్చి అమ్మలా సాకింది. సొంత బిడ్డల్లా చూసుకుంది. కానీ.. కేంద్రం మాత్రం అదే నిర్లక్ష్యాన్ని ప్రదర్శించి.. తీవ్ర విమర్శలపాలైంది.
ఇలాంటివారికి.. కేసీఆర్ ప్రభుత్వం అండగా లేకుంటే పరిస్థితి ఎంత దారుణంగా ఉండేదన్నది తలచుకుంటేనే కన్నీళ్లు ఉబికుబికి వస్తున్నాయ్. వారి ఇబ్బందులును గుర్తించారు కాబట్టే.. వెంటనే స్పందించిన ముఖ్యమంత్రి కేసీఆర్.. అన్ని విధాలా ఆదుకున్నారు. కానీ.. కేంద్రం మాత్రం పైసా విదిల్చకుండా సలహాలు, సూచనలతోనే కాలం వెళ్లదీసింది. ఏ మాత్రం ఆదుకునేందుకు ముందుకు రాకుండా.. ఎవరి చావు వారు ఛావాలన్నట్టుగా వ్యవహరించింది. ఆఖరికి వలస కార్మికులను ఇళ్లకు పంపే విషయంలోనూ కక్కుర్తిని ప్రదర్శించింది.
నడిపిందే ఆరు రైళ్లు. ఖర్చు కోటి కూడా దాటకపోవచ్చు. దేశవ్యాప్తంగా చిక్కుకుపోయిన వేలాది మందిని ఇళ్లకు చేర్చే కార్యక్రమం. అందులోనూ.. కేంద్రం.. ఒక్కో వలస కార్మికుడిని తమ రాష్ట్రానికి పంపినందుకు గాను 50 రూపాయల టికెట్ చార్జీ వసూలు చేసింది. పైగా.. 50 రూపాయలు మాత్రమే అంటూ.. మన కేంద్ర హోం శాఖ సహాయమంత్రి ఎర్ర బస్సు కిషన్ రెడ్డి గారు సెలవివ్వడం.. మరీ దారుణంగా ఉంది. అసలే ఉపాధి లేక.. లాక్ డౌన్ కారణంగా తినడానికి తిండి కూడా లేక అలమటిస్తుంటే.. వారి దగ్గర ఉన్నది ఊడ్చేసిన ఈ సిగ్గుమాలిన తనానికి కేంద్రం సిగ్గుపడాలి.
ఆర్థికంగా ఎన్ని ఇబ్బందులైనా సరే.. ఏ మాత్రం వెనకడుగు వేయకుండా వారందరినీ కేసీఆర్ ఆదుకున్నారు. ఆఖరికి.. సొంతూరికి పంపే సమయంలోనూ.. కడుపు నిండా ఆహారం, మంచినీళ్ల బాటిళ్లు, మాస్కులు, శానిటైజర్లు అందించి దాతృత్వాన్ని చాటుకున్నారు. ఈ మాత్రం సహాయం కూడా చేయడానికి చేతకాని కేంద్రాన్ని చూస్తే.. అసహ్యించుకోవాలో.. మాటలతో మభ్యపెట్టి జనాన్ని మోసం చేస్తున్న వారి తీరుకు మనకు మనమే సిగ్గుపడాలో అర్థం కావడం లేదు. కనీస మానవత్వం కూడా లేని ప్రధాని మోదీ తీరు అయితే.. మరీ బాధాకరం.
ఒక రాష్ట్ర ముఖ్యమంత్రికి ఉన్న సోయి.. ప్రధాని హోదాలో ఉన్న వ్యక్తికి లేకపోవడమే మన దేశ ప్రజల దౌర్భాగ్యం. అందుకే ప్రజలంటున్నారు…
కనకపు సింహాసనమున
మోదీని కూర్చుండబెట్టిన అశుభలగ్నమున
మన ఖర్మ తీర పట్టం కట్టిన
ఆ మూర్ఖత్వం మారునేల సుమతీ…
అని కొత్త పద్యం చెబుతున్నారు. వింటుంటే.. ఇది నిజమే అనిపిస్తోంది. మోదీ తీరు చూస్తుంటే.. ప్రజల ఆవేదనలోనూ అర్థం ఉందని అనిపిస్తోంది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *