కేంద్రానికి తెలంగాణపై ఇంత వివక్ష ఎందుకు…

కేంద్రానికి తెలంగాణపై  ఇంత వివక్ష ఎందుకు…

  • మహారాష్ట్ర, గుజరాత్ లపై నిధుల వరద కురిపిస్తూ ప్రేమ చూపిస్తున్న వైనం…
  • తెలంగాణ సమర్పించిన నిధుల జాబితాలోకి  58 శాతం మాత్రమే ఇప్పటి వరకు వచ్చింది…
  •  త్వరలోనే బిజెపికి ప్రజలంతా బుద్ధి చెబుతారు…
  •  ఎన్నికల్లో చీకొట్టినా పార్టీ తీరు మారటం లేదు..
వివిధ ఎన్నికల్లో భారతీయ జనతా పార్టీకి ఓటు హక్కుతో బుద్ధి చెప్పినప్పటికీ కూడా తన తీరు మారటం లేదు. తెలంగాణపై సవతి తల్లి ప్రేమ చూపిస్తూ ఉత్తరాది పార్టీగానే వ్యవహరిస్తోంది. ముఖ్యంగా ఉత్తరాది పార్టీలపై నిధుల వరద కురిపిస్తూ దక్షిణాది రాష్ట్రాలపై వివక్ష చూపిస్తూ తన లేకి బుద్ధి ప్రదర్శిస్తోంది. దక్షిణాది రాష్ట్రాల్లో తెలంగాణపై కావాలనే నిధులు ఇవ్వకుండా కుటిల యత్నాలకు దిగుతుంది. ముఖ్యంగా గుజరాత్ రాష్ట్రానికి నిధుల వరద కురిపిస్తూ ఆ రాష్ట్రంపై ఎనలేని ప్రేమను చూపిస్తోంది.
వివిధ పనుల రూపంలో గుజరాత్ లక్షా 65 వేల కోట్ల రూపాయలను ప్రతిపాదించగా 95 శాతం నిధులను కేటాయించింది. దీన్ని బట్టి చూస్తే మనకు అర్థమవుతుంది నరేంద్ర మోడీ దేశానికి ప్రధానమంత్రిగా ఉన్నారా లేకుంటే గుజరాత్ ప్రధానమంత్రిగా ఉన్నరా అని తెలుస్తోంది. ఒక రాష్ట్రం పై ఇంతగా ప్రత్యేకంగా ప్రేమ కనబర్చడం సమాఖ్య స్ఫూర్తికి విరుద్ధమని విశ్లేషకులు పేర్కొంటున్నారు.
ఇక పక్కనే ఉన్న మహారాష్ట్ర కూడా 96 వేల కోట్ల నిధుల గురించి ప్రతిపాదనలు పంపించింది. గతంలో కూడా ఆ రాష్ట్రంలో బిజెపి ప్రభుత్వం మాత్రమే ఉండగా 88శాతం నిధులను కేటాయించి తన పక్షపాత బుద్ధిని బీజేపీ మరోసారి ప్రదర్శించింది. ఇక తెలంగాణ విషయానికొస్తే గతంలో లక్షా25 వేలకోట్ల నిధులకు సంబంధించి ప్రతిపాదనలు రాష్ట్రం సమర్పించింది. అయితే ఇప్పటి వరకు కేవలం 59 శాతం నిధులను మాత్రమే కేటాయించి మరో సారి తన నీచ బుద్ధిని ఇలా ప్రదర్శన చేస్తోంది.
ఇప్పటివరకు ఎన్నికల్లో తమ ఓటు హక్కును బుద్ధి చెప్పి నప్పటికీ కూడా బిజెపి తీరు మారడం లేదు. రాష్ట్రంలో పార్టీని లేకుండా సమూలంగా భూస్థాపితం చేస్తేతేనే బాగుంటుందని విశ్లేషకులు సూచిస్తున్నారు. మరోవైపు కేంద్ర ప్రభుత్వం అనుసరిస్తున్న విధానాలపై తెలంగాణ బిజెపి సన్యాసులు ఒక్క మాట కూడా మాట్లాడలేదు. చవట దద్దమ్మ రూపాలకు నిదర్శనమైన రాష్ట్ర నేతలను చూసి అందరూ అసహ్యించుకుంటున్నారు. త్వరలోనే తెలంగాణ రాష్ట్ర ప్రజలు వీళ్ళకు తగిన విధంగా బుద్ధి చెబుతారని విశ్లేషకులు హెచ్చరికలు జారీ చేస్తున్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *