మున్సిపల్ ఎన్నికల్లో వార్ వన్ సైడే.

మున్సిపల్ ఎన్నికల్లో వార్ వన్ సైడే.

  • టిఆర్ఎస్, సీఎం కేసీఆర్ వైపే ఉంటాము అంటున్న ప్రజలు…
  • రాష్ట్రవ్యాప్తంగా కారు జోరు కు బేజారు కానున్న ప్రతిపక్షాలు… 
  • ఎన్నికల తర్వాత కాంగ్రెస్ పార్టీ చరిత్ర కలవడం ఖాయం…
  • రాష్ట్రంలో టిఆర్ఎస్ మినహా మరో పార్టీ ఉండబోదు అంటున్న విశ్లేషకులు… 
తెలంగాణ రాష్ట్రంలో ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ దృష్టి ఎన్నికల పై పడిందని ప్రజలు ఎద్దేవా చేస్తున్నారు. ఇప్పటివరకు రాష్ట్రంలో ఎలాంటి ఎన్నికలు జరిగినా కూడా పరాజయాలు చవిచూసిన కాంగ్రెస్ పార్టీ మున్సిపల్ ఎన్నికల్లో సత్తా చాటాలని పేర్కొనడంపై ప్రజలు పొట్టచెక్కలయ్యేలా నవ్వుతున్నారు.  కాంగ్రెస్ పార్టీ నిర్వహించిన మున్సిపల్ ఎన్నికలపై సమావేశంలో ముగ్గురంటే ముగ్గురు మాత్రమే పాల్గొనడం ఆ పార్టీ ఎన్నికలను ఎంత సీరియస్గా తీసుకుంటుందో తెలుస్తోంది.
పొన్నం ప్రభాకర్ లాంటి ప్రజల్లో ఆదరణ లేని నాయకులను ముందు పెట్టి మున్సిపల్ ఎన్నికలకు పోతే కాంగ్రెస్ కు మరోసారి భంగపాటు తప్పదని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.  ఇప్పటికే రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ మొత్తానికి ఖాళీకా గా మిగతా నాయకులు కూడా ఇతర పార్టీల వైపు చూపులు చూస్తున్నారు అని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.  ఈ నేపథ్యంలో మున్సిపల్ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ ఘోర పరాజయం తప్పదని ఆ పార్టీ నేతలు మానసికంగానే ఓటమికి సిద్ధమయ్యారని వారి వ్యాఖ్యలను బట్టి తెలుస్తోంది.
వార్డుల విభజనపై రిజర్వేషన్ల ఖరారు పై ఆ పార్టీ నాయకుల మాటలను చూస్తే ఓటమిని ముందే ఖరారు చేసుకుని ఆ కారణాలు వెతికి ఉన్నట్లు తెలుస్తోంది. గత ఐదేళ్లుగా నిర్మాణాత్మక ప్రతిపక్షం గా వ్యవహరించడంలో విఫలమైన కాంగ్రెస్ పార్టీ ఇప్పుడు ఏ ముఖం పెట్టుకొని ప్రజల్లోకి వెళుతుందని విశ్లేషకులు ప్రశ్నిస్తున్నారు.మున్సిపల్ ఎన్నికల్లో కూడా అధికార తెలంగాణ రాష్ట్ర సమితి పార్టీ హవా స్పష్టంగా ఉందని కాంగ్రెస్ పార్టీకి మరోసారి చుక్కలు చూపిస్తారు అని పేర్కొంటున్నారు.
ఇక రాష్ట్రంలో ఎలాంటి ఎన్నికలు జరిగినా కూడా తామంతా టిఆర్ఎస్ వైపే ఉంటామని ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర రావు చేపట్టిన సంక్షేమ పథకాలపై తాము పూర్తిగా సంతృప్తిగా ఉన్నామని ప్రజలు పేర్కొంటున్నారు.  ఈ నేపథ్యంలో రాబోయే మున్సిపల్ ఎన్నికల్లో వార్ వన్ సైడే అని ప్రజలు తీర్మానానికి వచ్చేశారు.

Leave a Reply

Your email address will not be published.