సడలింపులు సమ్మతమేనా ? ఈ విష‌యంలో కేంద్రం మ‌రోసారి ఆలోచించాలి

  • సడలింపులు సమ్మతమేనా ?
  • ఈ విష‌యంలో కేంద్రం మ‌రోసారి ఆలోచించాలి
  • జ‌న‌మంతా బ‌య‌టికి వ‌స్తే ఎంతో ప్ర‌మాదం
  • అమెరికా ప‌రిస్థితి ఇక్క‌డా ఏర్ప‌డుతుంది
  • ఈ విష‌యంలో కేంద్రం మ‌రోసారి ఆలోచించాలి

 

లాక్‌డౌన్ వ‌ల్ల పేద, బీద‌, ధ‌నికుడు, కుబేరుడు అనే తేడా లేకుండా అంతా ఇబ్బందిప‌డుతున్న‌రు. కొంద‌రికైతే పూట గ‌డ‌వ‌ని ప‌రిస్థితి. ఇలాంటి వాళ్ల‌ను ప్ర‌భుత్వాలు, ఎన్జీవోలు ఆదుకుంటున్నాయి. వ్యాపారాల‌కు విప‌రీతంగా న‌ష్టం వ‌స్తోంది. ఉద్యోగాలు ఊడుతున్న‌యి. అందుకే రేప‌టి నుంచి లాక్‌డౌన్‌ను పాక్షికంగా ఎత్తేస్తున్నామ‌ని కేంద్రం ప్ర‌క‌టించింది. ఇందుకు 8 రాష్ట్రాలు సై అన్నాయి. దీనివ‌ల్ల లాభం కంటే న‌ష్టాలే ఎక్కువ అనేది విశ్లేష‌కుల మాట‌. జ‌నం ఒక్క‌సారి బ‌య‌టికి వ‌స్తే ఎవ‌రూ ఏమీ చేయ‌లేరు.

ప్ర‌తి ఒక్క‌రూ ఏదో ఒక వంక‌తో బ‌య‌టికి వ‌స్తారు. జ‌న స‌మ్మ‌ర్దం పెరిగి క‌రోనా విజృంభించే అవ‌కాశాల‌ను కొట్టిపారేయ‌లేం. ఇక్క‌డ కూడా అమెరికా వంటి ప‌రిస్థితి ఏర్ప‌డితే ప్ర‌భుత్వాలూ చేతులు ఎత్తేస్తాయి. ఎందుకంటే మ‌న ద‌గ్గ‌ర హెల్త్ ఇన్‌ఫ్రాస్ట్ర‌క్చ‌ర్ చాలా త‌క్కువ‌. కాబ‌ట్టి ఈ విష‌యంలో కేంద్రం మ‌రోసారి ఆలోచించాలి.  గాడి తప్పిన ఎకానమీని మళ్లీ దారిలోకి తీసుకొచ్చేందుకు, ప్రజలకు ఇబ్బందులను తొలగించేందుకు కొన్ని సడలింపులు ఇవ్వాలని నిర్ణయించారు.

కానీ ఒక్క‌టి గుర్తుంచుకోవాలి. అన్నింటికంటే ప్రాణం ముఖ్యం. దీనినిని తిరిగి తీసుకురాలేం. మిన‌హాయింపుల వ‌ల్ల కేసులు పెరిగితే ఎవ‌రిది బాధ్య‌త ?  కొత్త గైడ్‌లైన్స్ ప్ర‌కారం కన్​స్ర్టక్షన్, ఇరిగేషన్, రోడ్ల పనులకు అనుమతులు  ఉంటాయి. రెస్టారెంట్లు తెరుచుకుంటాయి. కొన్ని బ‌స్సుల‌ను న‌డుపుతాయి. ఇవ‌న్నీ ప్ర‌జ‌ల‌కు డేంజ‌రే. మోడీ ప్ర‌భుత్వం తెలిసో తెలియ‌కో ప్ర‌జ‌ల‌ను డేంజ‌ర్ జోన్‌లోకి నెడుతుందేమో అనిపిస్తున్న‌ది. తెలంగాణ మాత్రం ఈ విష‌యంలో క‌ఠినంగా ఉంది. ఎవ‌రికీ ఎలాంటి మిన‌హాయింపులూ ఇవ్వ‌బోమ‌ని ప్ర‌క‌టించింది. ఎంత న‌ష్టం వ‌చ్చినా ఫ‌ర్లేద‌ని కేసీఆర్ స్ప‌ష్టం