మోడీ..నువ్వు ప్ర‌ధానిగా ఒక్క క్ష‌ణం కూడా ప‌నికిరావు

 

  • మోడీ..నువ్వు ప్ర‌ధానిగా ఒక్క క్ష‌ణం కూడా ప‌నికిరావు
  • నువ్వు చేస్తున్న ప‌నుల‌కు జ‌నం సిగ్గుతో త‌లదించుకుంటున్న‌రు
  • వ‌ల‌స కార్మికుల‌ను త‌ర‌లించినందుకు డ‌బ్బు వ‌సూలు చేస్తావా ?
  • నువ్వు దేశానికి ప్ర‌ధానివా ? లేక గుజ‌రాత్‌కు ప్ర‌ధానివా ?
  • వ‌ల‌స కార్మికులు నీ ప్ర‌జ‌లు కారా ? ‌వారిని ఆదుకోవా ?
  • క‌రోనా క‌ష్ట‌కాలంలోనూ నీ పార్టీ నాయ‌కుల‌తో బురద జ‌ల్లిస్తున్న‌వ్‌…
  • రాష్ట్రాల‌కు సాయం చేయ‌మంటే నీకు చేతులు రావ‌డం లేదు

 

ప్ర‌ధాని న‌రేంద్ర మోడీ వ‌ల్లే దేశంలో క‌రోనా వ్యాప్తి ఆగుతుందంటూ సోష‌ల్ మీడియాలో పోస్టులు పెట్టే వారిని చూస్తే కోపం, బాధ‌, ఆవేద‌న‌, ఆందోళ‌న‌.. అన్నీ కలుగుతాయి. మోడీ గోవులా క‌నిపించే మృగం అ‌ని, మాట‌లు త‌ప్ప పైసా ఇచ్చే ర‌కం కాద‌ని వీళ్లు జ‌న్మ‌లో తెలుసుకోరు. ఎంత‌సేపూ త‌న ప్ర‌తిష్ట పెంచుకోవ‌డానికి ప్ర‌య‌త్నించ‌డ‌మే త‌ప్ప ప్ర‌జ‌ల‌కు ఒక్క రూపాయి సాయం చేసే మ‌న‌సు ఆయ‌న‌కు లేద‌ని బీజేపీ భ‌క్తుల‌కు మ‌రో ప‌దేళ్ల‌యినా అర్థం కాదు. క‌రోనాను క‌ట్ట‌డి చేస్తున్న‌ది రాష్ట్ర ప్ర‌భుత్వాలు. పేద‌ల‌కు డ‌బ్బులు ఇస్తున్న‌ది రాష్ట్ర ప్ర‌భుత్వాలు. వ‌ల‌స కూలీల‌ను త‌మ సొంత ఖ‌ర్చుల‌తో త‌ర‌లిస్తున్న‌ది రాష్ట్ర ప్ర‌భుత్వాలు. పైస‌లు పెట్టేది రాష్ట్ర ప్ర‌భుత్వాలు అయితే పేరు మాత్రం మోడీకి! ఇదంతా బీజేపీ సోష‌ల్ మీడియా చేస్తున్న కుట్ర‌. రాష్ట్ర ప్ర‌భుత్వాల పాత్ర ఏమీ లేద‌ని అంతా మోడీయే చేస్తున్నార‌ని జ‌నంలో విప‌రీతంగా అబ‌ద్ధ‌పు ప్ర‌చారం జ‌రుగుతోంది. ఇంత‌టి ద‌య‌నీయ ప‌రిస్థితుల్లోనూ మోడీ క్రూరంగా వ్య‌వ‌హ‌రిస్తున్నారు.

 

ఉదాహ‌ర‌ణ‌కు వ‌ల‌స కార్మికుల విష‌యం చూద్దాం. లాక్‌డౌన్ కాలంలో వీళ్లు ప‌డ్డ క‌ష్టాల‌ను చెప్పాలంటే ఒక్క పుస్త‌కం రాయాలి. వీళ్ల బాధ‌ల‌ను వివ‌రిస్తూ సినిమాలే తీయొచ్చు. ఇలాంటి వారిని అక్కున చేర్చుకోవాల్సిన ప్ర‌భుత్వం సొంతగా రైళ్లు వేసి వారి స్వ‌స్థ‌లాల‌కు తీసుకెళ్తుంద‌ని ఎవ‌రైనా ఆశిస్తారు. కానీ కుర్చీలో ఉన్న‌ది మోడీ క‌దా! అలా ఎందుకు చేస్తాడు ? ఆయ‌న ఖ‌జానా నుంచి ఒక్క పైసా పెట్ట‌డు. రాష్ట్ర ప్ర‌భుత్వాలే అంతా ఇవ్వాలి. స్పెష‌ల్ ట్రైన్‌లో ప్ర‌యాణం చేసిన ఒక్కో కార్మికుడి నుంచి రూ.50 వ‌సూలు చేశారు. తిండికే గ‌తిలేని పేద కార్మికుల ద‌గ్గ‌ర డ‌బ్బులు ఉంటాయా ? ఇలాంటి వారి ద‌గ్గ‌రి నుంచి చార్జీలు తీసుకోవాల‌ని నిర్ణ‌యించిన మోడీకి వేల దండాలు పెట్టాలి! వ‌ల‌స కార్మికుల ద‌గ్గ‌రి నుంచి ఒక్క పైసా తీసుకోకుండా ర‌వాణా, తిండి, నీళ్లు వంటి అన్ని ఖ‌ర్చుల‌నూ కేసీఆర్ ప్ర‌భుత్వ‌మే భ‌రించింది. ఇదంతా ఒక ఎత్తు అయితే తెలంగాణ బీజేపీ నాయ‌కుల విమ‌ర్శ‌ల‌ను వింటే అస‌హ్యం వేస్తుంది. ఒక‌డేమో టెస్టులు జ‌రుగుత‌లేవు అంటడు. ఇంకొక‌డేమో కుంభ‌కోణాలూ లంబ‌కోణాలూ జ‌రుగుతున్న‌య్ అంట‌డు. రైతుల‌ను కాపాడ‌టం లేదు అని మ‌రొక‌డు వాగుత‌డు. సాక్ష్యాలు చూపండ్రా అంటే ఎవ‌డూ ముందుకు రాడు. మోడీ డైరెక్ష‌న్‌లోనే ఈ బుర‌దజ‌ల్లుడు కార్య‌క్ర‌మం జ‌రుగుతున్న‌ది. ఇలాంటి వ్య‌క్తి దేశ ప్ర‌ధాని కావ‌డం మ‌న దుర‌దృష్టం.

రాష్ట్రాల రోద‌న విన‌రు….

క‌రోనాను అడ్డుకోవ‌డానికి ఇప్ప‌టికి మ‌న ప్ర‌భుత్వం వేల కోట్ల రూపాయ‌లు ఖ‌ర్చు చేసింది. మోడీ ప్ర‌భుత్వం ఎంత ఇచ్చిందో తెలుసా ? జ‌స్ట్ రూ.500 కోట్ల లోపే! ఈ డ‌బ్బు క‌రోనా పేషెంట్ల ఒక్క రోజు ట్రీట్‌మెంట్‌కు కూడా స‌రిపోదు. పోనియ్‌.. ఇక్క‌డి ప‌రిశ్ర‌మ‌ల‌ను ఆదుకుందా .. అంటే… అదీ లేదు. టీవీల్లో ప్ర‌త్య‌క్ష్యం కావ‌డం. మిత్రో… అంటూ ప్ర‌సంగాలు దంచ‌డం తప్ప మోడీ పీకింది ఏమీ లేదు. లాక్‌డౌన్ పొడ‌గించామ‌ని, చ‌ప్ప‌ట్లు కొట్టాల‌ని, దీపాలు పెట్టాల‌ని చెప్ప‌డం.. ఇవీ మోడీ చేసిన ప‌నులు. ఎక్క‌డైనా బావే వంగ తోట కాడ మాత్రం కాద‌న్న‌ట్టు…ఎన్నో ప్ర‌సంగాలు మాత్రం చేస్తాడు. సుద్దులు చెబుతాడు. రాష్ట్రాల‌కు డ‌బ్బులు ఇవ్వాలంటే మాత్రం మోడీకి మ‌న‌సు రాదు. జీఎస్టీ ప‌న్ను వాటా ఇవ్వ‌మంటే స‌మాధానం రాదు.

ప్రాజెక్టుల డ‌బ్బులు ఇవ్వ‌మంటే ఆన్స‌ర్ చెప్పే వాడు ఉండ‌డు. సొమ్ము ఒక్క‌డిది సోకు ఒక‌డిది. క‌ష్ట‌మంతా రాష్ట్ర ప్ర‌భుత్వాలది. క్రెడిట్ మాత్రం మోడీకి! ఇదీ ఇప్పుడు జ‌రుగుతున్న‌ది. మోడీ.. నువ్వు ఇప్ప‌టికైనా మారాలి. కేసీఆర్‌లాగా పెద్ద మ‌న‌సు ఉండాలి. ఎంత‌సేపూ ధ‌నికుల గురించి ఆలోచించ‌డం కాదు. పేదోడికి ప‌ట్టెడ‌న్నం దొరికేలా చూడు. రాష్ట్రాల‌కు న్యాయం చెయ్యి. క‌రోనాకాలంలోనూ వివ‌క్ష వ‌ద్దు. నువ్వు గొప్ప న‌టుడివ‌ని అంద‌రికీ తెలుసు. క‌నీసం ఇటువంటి ఆప‌త్కాలంలో అయినా నిజాయ‌తీగా ప‌నిచెయ్యి. లేక‌పోతే ప్ర‌జ‌ల చేతిలో నీకు. నీ పార్టీకి శిక్ష త‌ప్ప‌దు.

 

 

 

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *