పాలన చేతగాని అసమర్థ సర్కారు కేంద్రంలోని బిజెపి సర్కారు…
ఆరేళ్లుగా ప్రజలకు ఉపయోగపడే ఏ ఒక్క పథకం కూడా ప్రవేశపెట్టలేదు…
నోట్ల రద్దు, జిఎస్టిలాంటి పనికిమాలిన వాటితో ప్రజల నడ్డి విరిచారు…
త్వరలోనే బీజేపీ భూస్థాపితం కాక తప్పదని తెలుసుకోండి…
భారతీయ జనతా పార్టీ నేతలను చూస్తే పిచ్చి లేసి తిక్కవాగుడు వాగుతూ ఉన్నట్లుగా అనిపిస్తుంది. కేంద్రంలోని నరేంద్ర మోడీ సర్కారు పేద ప్రజలకు ఉపయోగపడేలా సంక్షేమ పథకాలు అమలు చేస్తున్నారని చెబుతుంటే ప్రజలంతా ఫక్కున నవ్వుతున్నారు. కార్పొరేట్ల అడుగులకు మడుగులొత్తే నరేంద్ర మోడీ సర్కారు పేద ప్రజలను ఎప్పుడూ పట్టించుకుందని ఈ సందర్భంగా ప్రశ్నిస్తున్నారు. లాక్డౌన్ వేళ ఒకవైపు జనమంతా ఇబ్బందులు పడుతూ ఉద్యోగాలను వ్యాపారాలను కోల్పోతుంటే 79 వేల కోట్ల రూపాయల రుణాలను మాఫీ చేసిన చరిత్ర కేంద్ర ప్రభుత్వ సొంతం. కార్పొరేట్లకు కొమ్ముకాయడానికి తప్పించి పేద ప్రజలకు ఉపయోగపడే ఏ ఒక్క పని కూడా నరేంద్ర మోడీ చేపట్టలేదు. పైపెచ్చు కోవిడ్‌పై పోరాటం చేసే రాష్ట్రాలను కూడా ఎలాంటి సహాయం ఇవ్వక పోవడం లేదు. అసలు పేద ప్రజల గురించి మాట్లాడే అర్హత కేంద్రంలోని భారతీయ జనతా పార్టీ సర్కార్‌కు లేదనే ఈ సందర్భంగా తెలుసుకుంటే మంచిది.