మల్టీ నేషనల్ కంపెనీలకు కేరాఫ్ అడ్రస్ తెలంగాణ

  • మల్టీ నేషనల్ కంపెనీలకు కేరాఫ్ అడ్రస్ తెలంగాణ
  • ప్రపంచదేశాల చూపు తెలంగాణ వైపే
  • తెలంగాణకు రానున్న మరో పెద్ద కంపెనీ పిరమల్
  • మంత్రి కేటీఆర్ నేతృత్వంలో తెలంగాణకు తరలివస్తున్న పెద్ద కంపెనీలు

2014 కు ముందు తెలంగాణలో పెట్టుబడులు పెట్టాలంటేనే భయపడేవి పెద్ద పెద్ద కంపెనీలు. అప్పుడు ఉమ్మడి రాష్ట్రం. అందులో తెలంగాణను గత పాలకులు పట్టించుకున్న పాపాన పోలేదు. కానీ.. ఎప్పుడు తెలంగాణ వచ్చిందో, టీఆర్ఎస్ ప్రభుత్వం వచ్చిందో.. పెద్ద పెద్ద కంపెనీలన్నీ తెలంగాణకు క్యూ కట్టాయి. ఇప్పటికే ప్రపంచస్థాయి దిగ్గజ సంస్థలు గూగుల్, ఫేస్ బుక్ లాంటివి హైదరాబాద్ లో తమ కార్యకలాపాలను ప్రారంభించాయి. దేశంలోనే ఆయా సంస్థలు కేవలం హైదరాబాద్ లోనే ఉన్నాయి. వాటితో పాటు చాలా కంపెనీలు హైదరాబాద్ కు క్యూ కట్టాయి. ఇప్పుడూ కడుతూనే ఉన్నాయి.

తాజాగా పిరమల్ సంస్థ కూడా తెలంగాణలో తమ ప్లాంట్లను విస్తరించేందుకు ఒప్పందం కుదుర్చుకున్నది. ఇలా… ప్రతి కంపెనీ ఇండియాలో తమ బ్రాంచ్ కోసం ముందుగా తెలంగాణ వైపే చూస్తున్నాయి. అందుకే తెలంగాణ పెట్టుబడులకు కేంద్రంగా మారిపోయింది. తెలంగాణలో ఉన్న మౌలిక సదుపాయాలు, వసతులు, తెలంగాణ ప్రభుత్వం ఎంతో ప్రతిష్ఠాత్మకంగా తీసుకొచ్చిన టీఎస్ఐపాస్ వల్ల మల్టీ నేషనల్ కంపెనీలన్నీ తెలంగాణలో తమ సంస్థలను విస్తరించడానికి ఆసక్తిని చూపిస్తున్నాయి. అందుకే… నేడు తెలంగాణలో అంతర్జాతీయ స్థాయి కంపెనీలన్నీ కొలువై ఉన్నాయి.

ఇదంతా కేవలం ఐదేళ్లలోనే జరిగింది. కాంగ్రెస్ తెలంగాణను దాదాపు 40 ఏళ్ల పాటు పాలించింది. కానీ.. ఏం లాభం. తెలంగాణకు ఒక్కటంటే ఒక్క అంతర్జాతీయ కంపెనీని తీసుకొచ్చిందా? తీసుకురాలేదు. తెలంగాణను నాశనం చేసి వదిలేసింది. కానీ.. సీఎం కేసీఆర్, మంత్రి కేటీఆర్ నేతృత్వంలో… అంతర్జాతీయ కంపెనీలకు కావాల్సిన సదుపాయాలను ఏర్పాటు చేసి.. నిరుద్యోగులకు ఉపాధి కల్పన కల్పించాలనే సదుద్దేశంతో టీఎస్ఐపాస్ విధానాన్ని ప్రవేశపెట్టి… అనేక అంతర్జాతీయ కంపెనీలకు ఆహ్వానాన్ని అందించారు. అన్ని కంపెనీలు దేశంలోనే తమ మొదటి బ్రాంచ్ ను హైదరాబాద్ లో పెట్టడానికి ఆసక్తి చూపాయి. కొన్ని ఇప్పటికే తమ కార్యకలాపాలను ప్రారంభించగా.. మరికొన్ని సన్నాహాలు చేసుకుంటున్నాయి. తెలంగాణకు తరలివస్తున్న పెద్ద పెద్ద కంపెనీలన్నీ తెలంగాణకు మణిహారంలా నిలుస్తున్నాయి. ఇప్పుడు ప్రపంచస్థాయి కంపెనీలన్నీ తెలంగాణ వైపు చూస్తున్నాయంటే దానికి కారణం సీఎం కేసీఆర్, మంత్రి కేటీఆర్. వాళ్ల సరికొత్త విధానాలే నేడు తెలంగాణకు ప్రపంచస్థాయి గుర్తింపును తీసుకొచ్చాయి.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *