లక్ష్మయ్యా..ఏందయ్యా ఇది…?

 

లక్ష్మయ్యా..ఏందయ్యా ఇది…?

 

కాంగ్రెస్ అని ఒక పార్టీ ఉండేది…ఇదీ…పొన్నాల లక్ష్మయ్యా…మీ పార్టీ గురించి ముందు ముందు ప్రజలు చెప్పుకునేది. అధికారంలో ఉన్నప్పుడు ఇష్టానుసారం రైతు వ్యతిరేక నిర్ణయాలు తీసుకుని అన్నదాతలు అప్పులపాలయ్యే పరిస్థితి తీసుకొచ్చింది..కేంద్రంలో, ఉమ్మడి రాష్ట్రంలోని కాంగ్రెస్ ప్రభుత్వాలు కాదా..? మీ తీరు గ్రహించే కదా..తెలంగాణలో ప్రజలెవరూ మీకు ఓట్లేయనది. నానాటికీ తీసికట్టు నానంభొట్టు అన్నట్టు రోజురోజుకీ రాష్ట్రంలో మీ పరిస్థితి దిగజారుతున్నా…మీకు బుద్ధి రాకపోతే ఎట్లయ్యా…

టీఆర్ఎస్ ది నిఖార్సయిన రైతు ప్రభుత్వం. రైతుబీమా, రైతు బంధు, ఉచిత విద్యుత్..ఇలా చెప్పుకుంటూ పోతే ఒకటా..రెండా..రైతుల కోసం సీఎం కేసీఆర్ చేసినన్ని పనులు ఇంకే రాష్ట్రంలో అయినా…ఎవరయినా చేశారా..?కాంగ్రెస్ పాలిత రాష్ట్రాల్లో ఎప్పుడయినా రైతుల కోసం ఇన్ని పథకాలు ప్రవేశపెట్టారా…ఇప్పుడు ప్రతిపక్షంలో ఉండడం వల్లే కదా…మీరు వ్యవసాయ చట్టాలకు మద్దతిచ్చింది.

మీరూ అధికారంలో ఉంటే రైతుల గొంతుకోసే చట్టాలు ఇలాంటివి ఇంకెన్ని తెచ్చేవాల్లో…అలాంటిది టీఆర్ఎస్ ది రైతులపై దొంగ ప్రేమంటావా…తెలంగాణ ప్రజలందరికీ..ఆ మాటకొస్తే దేశప్రజలందరికీ తెలుసు లక్ష్మయ్యా…రైతులపై కాంగ్రెస్ ది దొంగప్రేమో…టీఆర్ఎస్ ది దొంగ ప్రేమో…అసలు దేశంలో వ్యవసాయాన్ని దెబ్బతీసింది మీ పార్టీనే కదా…ఈ ఆరేల్ల కాలంలో సీఎం కేసీఆర్ తెలంగాణలో రైతుల కోసం చేపట్టిన సంక్షేమ కార్యక్రమాల్లో కొన్నిచేసినా దేశంలో ఇవాల వ్యవసాయం పరిస్థితి, అన్నదాత ఆవేదన ఇలా ఉండేదా…?

వ్యవసాయ చట్టాల పేరుతో బీజేపీ చేస్తున్న పాపంలో మీకూ భాగంలేదా..గతంలో మీరూ ఇలాంటి చట్టాలు ప్రవేశపెట్టాలనుకోలేదా…లక్ష్మయ్యా..మీ పార్టీచేసిన పాపాలు….మీరు మర్చిపోయారేమో కానీ..ప్రజలు మర్చిపోలేదు. మర్చిపోరు కూడా. అలాగే తమకోసం టీఆర్  ఎస్ ప్రభుత్వం ఏమేం చేస్తోందో రైతులు గమనిస్తున్నారు. రైతుల పొట్టకొట్టే వ్యవసాయ చట్టాలను ఉపసంహరించాలని డిమాండ్ చేస్తూ జరుగుతున్న ఆందోలనకు సీఎం కేసీఆర్ మద్దతివ్వడం అన్నదాతలకు కొండంత బలం. భారత్ బంద్ కు కేసీఆర్ మద్దతు ప్రకటించిన తర్వాతే దేశవ్యాప్తంగా ఊపు వచ్చింది. కాంగ్రెస్ నేతలు కూడా టీఆర్ఎస్ పై పడి ఏడ్వడం మాని..రైతులకు మేలు చేసేందుకు ఎలాంటి పనులు చేయాలో ఆలోచిస్తే మంచిది.