రైతుబంధు ఆగేది లే.. అమలు పక్కా

రైతుబంధు ఆగేది లే..

అమలు పక్కా

సీఎం సారు హామీ

హుజురాబాద్​ ఎన్నికలు అయిపోగానే దళితబంధును మూలకుపడేస్తారని ఒకడు.. ఓట్ల కోసమే దళితబంధు అని.. త్వరలోనే దీనిని నిలిపేస్తారని మరొకడు.. దళితబంధుకు నిధులు ఇవ్వడం లేదని మరొకడు.. ఇలా ఎవడికి తోచినట్టు వాడు కామెంట్​ చేశాడు. నోటికి ఏదొస్తే అది వాగాడు. ప్రభుత్వం వివరణ ఇచ్చినా పట్టించుకోలేదు. ఈటల వంటి రాజకీయ వ్యభిచారులు అయితే ఈ పథకాన్ని ఆపడానికి ఢిల్లీ లెవెల్లో పైరవీలు చేయించారు. ఎలక్షన్ కమిషన్​కు కంప్లైంట్లు ఇచ్చారు.

కేసీఆర్​ వ్యూహాల ముందు ప్రతిపక్షాల కుట్రలు పారలేదు. దళితబంధును ఎట్టిపరిస్థితుల్లోనూ అమలు చేస్తామని సీఎం తాజాగా ఇచ్చిన స్టేట్​మెంట్ దళితులను సంతోషంలో ముంచింది. గత పాలకుల చేదు అనుభవాలతో, దశాబ్దాలుగా తాము ఎప్పుడూ మోసాలకు గురవుతూనే ఉన్నామనే దుఃఖం దళితవాడల్లో నెలకొన్నదని, వారి ఆర్తిని అర్థంచేసుకొని దళితులకు భరోసా కల్పించేదిశగా పనిచేయాల్సిన అవసరం ఉన్నదని సీఎం స్పష్టంగా చెప్పారు. ‘మీకు ఆకాశమే హద్దు.

మీరు ఇప్పటివరకు చేసిన ఏ పనిలోనూ లేని తృప్తి.. దళితబంధు పథకం అమలులో పాల్గొనడంలో దొరుకుతుంది’ అని చెప్పారు. దళిత కుటుంబాల ఆర్థిక స్థితిని మెరుగుపరిచేందుకు వున్న అన్ని అవకాశాలను, ప్రభుత్వ ప్రైవేట్‌ రంగాల్లోని అన్ని రకాల వ్యాపార ఉపాధి మార్గాలను శోధించాలని సూచించారు. పథకం అమలులో వెనక్కి తగ్గేదే లేదని కుండబద్దలు కొట్టారు. గత పాలకుల చేదు అనుభవాలతో, దశాబ్దాలుగా తాము ఎప్పుడూ మోసాలకు గురవుతూనే ఉన్నామనే దుఃఖం దళితవాడల్లో నెలకొన్నదని, వారి ఆర్తిని అర్థంచేసుకొని దళితులకు భరోసా కల్పించేదిశగా పనిచేయాల్సిన అవసరం ఉన్నదని కలెక్టర్లకు సీఎం కేసీఆర్‌ ఉద్బోధించారు.

‘మీకు ఆకాశమే హద్దు. మీరు ఇప్పటివరకు చేసిన ఏ పనిలోనూ లేని తృప్తి.. దళితబంధు పథకం అమలులో పాల్గొనడంలో దొరుకుతుంది’ అని చెప్పారు. దళిత కుటుంబాల ఆర్థిక స్థితిని మెరుగుపరిచేందుకు వున్న అన్ని అవకాశాలను, ప్రభుత్వ ప్రైవేట్‌ రంగాల్లోని అన్ని రకాల వ్యాపార ఉపాధి మార్గాలను పరిశీలించి స్కీమును అమలు చేస్తారు. హుజూరాబాద్‌ నియోజకవర్గంతోపాటు ఇప్పటికే ప్రకటించిన నాలుగు జిల్లాల్లోని నాలుగు మండలాల పరిధిలో దళితబంధును ముందుగా ప్రకటించిన విధంగానే సంతృప్త స్థాయిలో అమలు చేస్తారు. ఇందుకు త్వరలోనే నిధులు విడుదల చేస్తారు. రాష్ట్రవ్యాప్తంగా అన్ని నియోజకవర్గాల్లో వంద మంది లబ్ధిదారులను ఎంపిక చేస్తారు.