రేవంత్​ను అర్జెంట్​గా ఎర్రగడ్డకు పంపాలి

 

రేవంత్​ను అర్జెంట్​గా ఎర్రగడ్డకు పంపాలి

కేటీఆర్​ బామ్మర్ది అవినీతి అంటూ పిచ్చివాగుడు

అన్ని అర్హతలు ఉండబట్టే రాజేంద్ర ప్రసాద్​కు కాంట్రాక్టు

 

కాంగ్రెస్​ నాయకుడు రేవంత్​ రెడ్డికి మెదడు మోకాలిలో ఉంటుందన్న విషయం అందరికీ తెలుసు. ఏం మాట్లాడుతడో ఎందుకు మాట్లాడుతడో ఎవడికీ అర్థం కాదు. ఇదో మెంటల్​ కేసు. నిత్యం కేసీఆర్, కేటీఆర్​పై విషం చిమ్మడం వీడి పని. కేసీఆర్​ తనను జైలులో పెట్టించాడనే కోపంతో నిత్యం ఏదో పనికిమాలిన ఆరోపణ చేయడం రేవంత్​కు అలవాటుగా మారింది. తాజా ఆరోపణల సారాంశం ఏమిటంటే కరోనాకు విరుగుడు మందు హైడ్రాక్సీ క్లోరోక్విన్​.

కేటీఆర్​ బావమరిది రాజేంద్ర ప్రసాద్​కు ఈ మందు ఏపీఐ (ముడిసరుకు) సప్లై చేసే కాంట్రాక్టు ఇచ్చాడు. దీనివల్ల ఖజానాకు లక్ష కోట్ల నష్టం అన్నది రేవంత్​ వాదన. విషయం ఏమిటంటే కాంట్రాక్టు కేవలం ప్రసాద్​కు మాత్రమే రాలేదు. కొన్ని కంపెనీలకు కలిపి కాంట్రాక్టు ఇస్తే అందులో ప్రసాద్​ ఒకరు. హైడ్రాక్సీ క్లోరోక్విన్ డ్రగ్​కు ఇప్పుడు పెద్దగా డిమాండ్​ లేదు. లక్ష కోట్లు కాదు కదా.. కనీసం వంద కోట్ల కాంట్రాక్టు కూడా ఇది కాదు. ఈ కాంట్రాక్టు కోసం రాష్ట్ర ప్రయోజనాలను తాకట్టు పెట్టేంత తీవ్రత గానీ, ఇందులో కేసీఆర్​ ప్రయోజనం పొందేంత సీన్​ లేదు. ప్రసాద్​ కంపెనీ తయారు చేసే ఏపీఐలలో క్వాలిటీ లేకపోతే హైడ్రాక్సీ క్లోరోక్విన్ తయారీ కంపెనీలే వాపస్​ చేస్తాయి.

రేవంత్​ చెప్పిన రెమిడిసివిర్​ అనే డ్రగ్​ ఏపీఐ కానేకాదు. అసలు ఇది ఇంకా ప్రయోగాల దశలోనే ఉంది. యుమిఫోనొవిర్​ అనే డ్రగ్​ను ఇండియాలో ఎవడూ వాడడు. ఇంగ్రీడియెంట్స్ తయారీకి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ప్రోత్సాహకాలు కూడా ఇవ్వడం లేదు. కాబట్టి ప్రసాద్​ పెద్దగా బాగుపడేది ఏమీలేదు. రేవంత్​ ఈ ఆరోపణలు చేసే ముందు కాంట్రాక్టు రూల్స్​ను కొంచెం కూడా స్టడీ చేయలేదు. పిచ్చి ఆరోపణలు చేసి మరోసారి పరువు తీసుకున్నడు. రేవంత్​ మాటలకు పైసా విలువ కూడా లేదు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *