ఏం పీకుతున్నారని మీడియా  చూపాలి ?

  • ఏం పీకుతున్నారని మీడియా  చూపాలి ?
  • కాంగ్రెస్‌ ప్ర‌జావ్య‌తిరేకి కాబ‌ట్టే మీడియా ప‌ట్టించుకోవ‌డం లేదు

 

కాంగ్రెసోళ్ల‌కు ఏ స‌మ‌స్య‌పై ఎప్పుడు ఏం మాట్లాడాలో తెలియ‌దు. ఏ అంశంపై ఎప్పుడు ఆందోళ‌న చేయాలో తెలియ‌దు. పార్టీకి ఓ విధానం అంటూ ఉండ‌దు. ఓ ప‌ద్ధ‌తి అంటూ క‌నిపించ‌దు. వీళ్లు వాగే సొల్లును మీడియా లైవ్‌లో చూపించాల‌ట‌. వీళ్ల ప్రెస్‌మీట్ల‌ను, ఆందోళ‌న‌ల‌ను బ్యాన‌ర్ వార్త‌లు చేయాల‌ట‌. దేశంలోని అత్యంత నిజాయ‌తీప‌రుడైన మ‌హానేత రేవంత్ రెడ్డి ఆశ ఇది. లేక‌పోతే  గ‌త్త‌ర లేపుత‌డ‌ట‌. ఆగ‌మాగం చేస్త‌డ‌ట‌. మీడియా సంస్థ‌ల‌ను బ‌జారుకు ఈడ్చుత‌డ‌ట‌! ‘‘ ప్రభుత్వం చేస్తున్న తప్పుల్ని ఎత్తి చూపుతున్నాం .

ప్రజలకోసం ఎన్నో చేస్తున్నాం కానీ కాంగ్రెస్ పార్టీకి గురించి మీడియా వార్తల్ని ప్రసారం చేయడం లేదు. ప్రతిపక్ష పార్టీ హోదాలో ఉన్న తమ వార్తల్ని ప్రసారం చేయకపోవడాన్ని సీరియస్ గా తీసుకుంటాం. ప్రభుత్వం తప్పుల్ని ఎత్తి చూపుతూ ఆయా తీర్మానాల్ని మీడియా యాజమాన్యాలకు పంపిస్తాం.ఆ తరువాత నుంచి నిరసన కార్యక్రమాలు ఉంటాయి” ఇవీ రేవంత్​ చేసిన బెదిరింపులు. ఈ ఉడత బెదిరింపులకు ఎవరూ భయపడతరు  ఎంపీగారు ? ‌మీరు దాదాపు ప‌దేళ్ల నుంచి ప్ర‌తిప‌క్షంలో ఉంటున్న‌రు.

ఏనాడైనా ఒక నిర్మాణాత్మ‌క ఉద్య‌మం చేశారా ? ఒక్క స‌మ‌స్య‌ను ప‌రిష్క‌రించారా ? ఏదైనా ఒక‌ విష‌యంపైన అయినా ప్ర‌జ‌ల‌కు అవ‌గాహ‌న క‌లిగించారా ? క‌రోనా స‌మ‌యంలో ప్ర‌భుత్వంపై పిచ్చి విమ‌ర్శ‌లు చేస్తూ నవ్వుల‌పాల‌య్యారు. పోతిరెడ్డిపాడు గురించి గ‌వ‌ర్న‌మెంటు కంప్లెయింట్ చేసిన త‌రువాత కూడా ఉత్తుత్తి దీక్ష‌ల‌తో ప‌రువుపోగొట్టుకున్నారు. ఇటువంటి బుడ్డ‌ర్‌ఖాన్ వేషాల‌ను మీడియా ఎందుకు చూపిస్తుంది ? ‌దానికి వేరే ప‌నేమీ లేదా ? ‌మీరు చేసే కార్య‌క్రమాలు బాగుంటే మీడియానే మీ వెంట‌ప‌డుతుంది. దాని ద‌గ్గ‌రికి మీరు వెళ్లాల్సిన ప‌ని లేదు. కేసీఆర్ ప్రెస్‌మీట్ అన‌గానే జ‌నం టీవీల‌కు అతుక్కుపోత‌రు. నువ్వు గానీ ఉత్త‌మ్ గానీ భ‌ట్టి గానీ మాట్లాడితే ఎవ‌డైనా వింటాడా ? అస‌లు మీకు ఏ విష‌యంపైనా అవ‌గాహ‌న ఉండ‌దు. పార్టీలో అంద‌రూ దేడ్‌దిమాగ్‌లు. మీడియా మీకు ఇంపార్టెన్స్ ఇవ్వాల‌నుకోవ‌డం మీ అత్యాశ‌.