రేవంత్​.. టూమచ్​గా మాట్లాడుతున్నవ్​… నువ్వు చిప్పకూడుతినే రోజు దగ్గర్లోనే ఉంది బిడ్డా!

రేవంత్​.. టూమచ్​గా మాట్లాడుతున్నవ్​…

నువ్వు చిప్పకూడుతినే రోజు దగ్గర్లోనే ఉంది బిడ్డా!

పంట కొనుగోలు కేంద్రాలు ఎత్తేసినా రైతు ధాన్యాన్ని అమ్ముకోవచ్చు

పూటకో కబ్జా.. వారానికో నేరం.. నిత్యం అబద్ధాలతో రాజకీయాలు చేసే రేవంత్​ రెడ్డి రైతుల బాగోగుల గురించి మాట్లాడుతుంటే వినడానికి అసహ్యమేస్తోంది. అసలు వీడి జీవితమే అబద్దాలమయం. నేరాలమయం. అవినీతిమయం. ఇలాంటి చిల్లరగాడు సీఎం కేసీఆర్​ను బెదిరించే సాహసం చేయడం ప్రజాస్వామ్యంలోని లోపమని చెప్పకతప్పదు. గ్రామాల్లో పంట కొనుగోలు కేంద్రాలపై అవగాహన లేకుండా నోటికొచ్చినట్టు కూస్తున్నాడు.  రైతు కొనుగోలు కేంద్రాలు ఎత్తేస్తే ..తెలంగాణలో కేసీఆర్ దుకాణం ఎత్తేస్తామని ఉత్తుత్తి బెదిరింపులకు దిగాడు. కరోనా ఎక్కువ ఉండటం వల్ల రైతులు మార్కెట్లకు రాలేరు కాబట్టి కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేశారు. ఇప్పుడు కేసులు పెద్దగా లేవు కాబట్టి గ్రామాల నుంచి వాటిని తొలగించాలని ఆలోచన చేస్తున్నారు. ఎప్పటిలాగే రైతు తనకు నచ్చిన చోట పంటను అమ్ముకోవచ్చు. మండీలు ఎలాగూ ఉంటాయి.

ఇక రేవంత్​కు ఎక్కడ నొచ్చిందో అర్థం కావడం లేదు. ఆల్రెడీ వీడి పార్టీ దుకాణాన్ని జనం మూసేశారు. అలాంటి కాంగ్రెస్​ పార్టీ కేసీఆర్​ పాలనను అంతం చేస్తదని బెదిరిస్తే ఎవడు నమ్ముతడు ? ఇలాంటి మతిలేని చేష్టలు, మాటల వల్లే కాంగ్రెస్​ గంగల కలిసింది.   ఇక నుంచి రైతులుమార్కెట్​ యార్డులు, ధాన్య సేకరణ కేంద్రాలకు వెళ్లాల్సిన అవసరం లేదు. బయటి రాష్ట్రాలకో, డిమాండ్​ ఉన్న ఇతర ప్రాంతాలకో పంటలను తీసుకెళ్లి అమ్ముకుంటే ఎక్కువ ధర గిట్టుబాటు అయ్యే అవకాశాలు ఉంటాయి. ఆన్​లైన్​లోనూ అమ్ముకోవచ్చు. ఎక్కువ ధర వచ్చేదాకా పంటను స్టోరేజీల్లో నిల్వ చేసుకోవచ్చు. కార్పొరేట్​ అగ్రిమెంట్లతో కంపెనీలకు అమ్ముకోవచ్చు.

ఇన్ని వెసులుబాట్లు ఉన్నప్పుడు పంట కొనుగోలు కేంద్రాలు దండగ. వీటి వల్ల అటు రైతులకు, ఇటు ప్రభుత్వానికి నష్టం తప్ప లాభం లేదు.   ఎఫ్​సీఐకి అమ్ముకోవచ్చు. వ్యాపారులకు అమ్ముకోవచ్చు. పక్క రాష్ట్రాల్లోనూ అమ్ముకోవచ్చు. ఐకేపీలను తీసేసినంతమాత్రాన ప్రభుత్వం తన బాధ్యత నుంచి తప్పుకున్నట్టు కాదు.  వ్యవసాయ మార్కెట్లు ఎలాగూ ఉంటాయి. అమ్మకాలు, కొనుగోళ్లు సక్రమంగా, పద్ధతి ప్రకారం జరుగుతాయి. టోకెన్ల ప్రకారం రైతులంతా తమ పంటను మార్కెట్ కు తీసుకువచ్చి అమ్ముకుంటారు. రైతుబంధు సమితులు, మార్కెట్ కమిటీలు, వ్యవసాయ విస్తరణాధికారులు సమన్వయంతో వ్యవహరించి ఏ గ్రామానికి చెందిన రైతులు ఎప్పుడు మార్కెట్ కు సరుకులు తీసుకు రావాలో నిర్ణయిస్తారు. ఏరకంగా చూసినా రైతుకు ఇబ్బంది ఉండదు. పెట్టుబడిసాయం, బీమా, నాణ్యమైన ఎరువులను అందించే కార్యక్రమాలు కొనసాగుతాయి.  ప్రభుత్వమే క్రయవిక్రయాలు జరపడం వల్ల విపరీతంగా నష్టాలు వస్తున్నాయి. అలా నష్టపోతున్న డబ్బునే వ్యవసాయరంగం అభివృద్ధికి ఖర్చు చేయాలనేది కేసీఆర్​ ప్లాన్​.  ఇంతమంచి ఆలోచనను విమర్శించడం మూర్ఖత్వం. అందుకే కాంగ్రెస్​, బీజేపీలకు రైతు ద్రోహుల పార్టీగా స్టాంప్​ పడింది.