రేవంత్ రెడ్డి.. ప్రతిపక్ష పాత్ర ఇన్నాళ్లకు గుర్తు వచ్చిందా…

  • రేవంత్ రెడ్డి.. ప్రతిపక్ష పాత్ర ఇన్నాళ్లకు గుర్తు వచ్చిందా…
  • ఇన్నాళ్ళుగా నిర్మాణాత్మకంగా వ్యవహరించే లేక మూల్యం చెల్లించుకున్నారు…
  • త్వరలోనే మీ పార్టీ భూస్థాపితం కాక తప్పదు…
  • రాష్ట్రంలో టిఆర్ఎస్ ఉండగా మరో పార్టీ అవసరం లేదు…
తెలంగాణ మున్సిపల్ ఎన్నికల్లో ఓడిపోయిన తర్వాత కాంగ్రెస్ పార్టీ నేత రేవంత్ రెడ్డి జ్ఞానోదయం అయినట్లు తెలుస్తోంది. ఇప్పటినుంచైనా ప్రతిపక్ష పాత్ర మెరుగ్గా పోషించాలని తన పార్టీ నేతలతో ఆయన సూచించడం వెనుక ఓటమిప్రభావం  బాగానే ఉన్నట్లు తెలుస్తోంది. అసలు గత ఆరేళ్లుగా నిర్మాణాత్మక ప్రతిపక్ష పాత్ర పోషించగా పోవడం వల్లే కాంగ్రెస్ పార్టీ రాష్ట్రంలో జరిగిన అనేక ఎన్నికల్లో ఓటమిపాలు అవుతూ వస్తోంది. తాజాగా జరిగిన మున్సిపల్ ఎన్నికల్లో ఆ పార్టీ ఘోరంగా దెబ్బతిని వరుస ఓటములు నమోదు చేసిందని విశ్లేషకులు గుర్తు చేస్తున్నారు. ఏదిఏమైనా రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అంతర్ధానమయ్యేస్థితిలో జ్ఞానోదయం జరిగిందని అంటున్నారు.  ఇప్పుడు ఎన్ని రకాల ఆలోచనలు చేసిన వేస్ట్  అని విశ్లేషకులు పేర్కొంటున్నారు. చేతులు కాలాక ఆకులు పట్టి నట్లుగా కాంగ్రెస్ పార్టీ నేతలు వ్యవహరిస్తున్నారని అభిప్రాయపడుతున్నారు.
అసలు ఓటుకు నోటు కేసులో అడ్డంగా బుక్కైన జైల్లో చిప్పకూడు తిన్నా రేవంత్ రెడ్డి లాంటి నేతలను పార్టీలోకి చేర్చుకోవడం కాంగ్రెస్ పార్టీ నానాటికి దిగజారి అని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. మరోవైపు సమైక్య రాష్ట్రంలో తెలంగాణ పై సవతి తల్లి ప్రేమ చూపించిన కాంగ్రెస్ పార్టీని ఇప్పటివరకు నమ్మడం లేదు. దీంతో ప్రతి ఎన్నికల్లోనూ చెవి కోసిన మేకల ఆ అరుస్తున్న కాంగ్రెస్ నేతలను రాష్ట్ర ప్రజలు ఎవరూ నమ్మడం లేదు. ఈ క్రమంలో రోజురోజుకు పార్టీ క్షీణించి తెలంగాణలో భూస్థాపితం అయ్యే దిశగా పెరుగుతుందని విశ్లేషకులు గుర్తు చేస్తున్నారు. ఇప్పటికైనా కాంగ్రెస్ పార్టీ నేతలు బుద్ది తెచ్చుకొని ప్రజల పక్షం పోరాడాలని లేకపోతే త్వరలోనే వాళ్ళు రాజకీయ సన్యాసం తీసుకోవాల్సిన అవసరం ఏర్పడుతుంది అని విశ్లేషకులు హెచ్చరికలు జారీ చేస్తున్నారు. మరోవైపు మున్సిపల్ ఎన్నికల తర్వాత రాష్ట్రంలో ఏకైక పార్టీగా తెలంగాణ రాష్ట్ర సమితి పార్టీకి రాబోయే రోజుల్లో ఆ పార్టీకి ఎదురులేకుండా విశ్లేషకులు వ్యాఖ్యానిస్తున్నారు.

Leave a Reply

Your email address will not be published.