సన్నాలకు రాష్ట్ర ప్రభుత్వం బోనస్ ఇస్తామంటే ఎఫ్సీఐ ద్వారా అడ్డుకున్నది కేంద్రం కాదా.. బండి సంజయ్…

 

సన్నాలకు రాష్ట్ర ప్రభుత్వం బోనస్ ఇస్తామంటే ఎఫ్సీఐ ద్వారా అడ్డుకున్నది కేంద్రం కాదా.. బండి సంజయ్…
బీజేపీ ప్యూర్ రైతు వ్యతిరేక పార్టీ…
దేశవ్యాప్తంగా బిజెపిని తిప్పి కొడుతున్నా మీకు ఇంత కూడా సిగ్గు రావడం లేదు…

తెలంగాణ భారతీయ జనతా పార్టీ అధ్యక్షుడు ఎంపీ బండి సంజయ్ కుమార్ కు మించిన కొత‌ల్రాయుడు మరొకరు ఉండరు ఎలాంటి అతిశయోక్తి లేదు. ఎన్నికల్లో గెల‌వ‌డానికి  ఎన్నో అభూత క‌ల్ప‌న‌లు, మాయ మాటలు చెప్పి తద్వారా రాజ‌కీయ ల‌బ్ధి పొంది,  ఎన్నికలు ముగిశాక తెప్ప త‌గిలేయ‌డంలో  మొదటివాడు సంజయ్. తమను గెలిపిస్తే అది చేస్తాం ఇది చేస్తామని చెప్పి ఇప్పుడు నంగనాచి మాటలు మాట్లాడుతున్న బిజెపి నేతల వైఖరి ఇందుకు ప్రబల నిదర్శనం.

ఇక తమను గెలిపిస్తే హైదరాబాద్ నగరంలో వరదల కారణంగా న‌ష్ట‌పోయిన వారికి 25 వేల సాయం అందిస్తామని చెప్పి, 48 డివిజన్లు గెలిచాక ఇప్పుడు పత్తాలేకుండా పోయారు. ఇంకా కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన రైతు చట్టాల గురించి ఎంత తక్కువ చెప్పుకుంటే అంత మంచిది. దేశానికి అన్నం పెట్టే రైతన్న నడ్డి విరిచేలా ఉన్న ఇలాంటి చట్టాలను యావ‌త్‌ భారతం చీదరించు కుంటుంది. ఇక తెలంగాణలో సన్నాలు వేసిన రైతులను ఆదుకునేందుకు తెలంగాణ ప్రభుత్వం బోనస్ ఇస్తామని పేర్కొన్నప్పటికీ కూడా తన సంస్థ ఎఫ్‌సీఐ ద్వారా కోనుగోళ్లు చేయ‌బోమ‌ని కేంద్ర ప్రభుత్వ బెదిరింపుల‌కు పాల్ప‌డ‌టం  సిగ్గులేని తనానికి నిదర్శనం.

ఇక కోతల గురించి మాట్లాడుతున్న బండి సంజయ్ కుమార్ నువ్వు కరీంనగర్ ఎంపీ గెలిచి ఏడాదిన్న‌ర‌ అవుతున్నప్పటికీ కూడా ఆ నియోజకవర్గానికి చేసిందేమీ లేదు. ప్రజలకు మాయమాటలు చెప్పి ఓటు వేయించుకోవ‌డం  తప్పించి నిధులు తెచ్చి అభివృద్ధి చేయడం చేత‌గావ‌డం లేదు. పాలన చేతగాని మీకు గత ఆరేళ్లుగా కేంద్రంలో అమలు చేసిన ఒక సంక్షేమ పథకం పేరైనా చెప్తే మీకు ప్ర‌జ‌లు దండేసి దండం పెడుతారు. ప్రభుత్వ సంస్థలను పప్పు బెళ్లాలా కార్పొరేట్లకు దోచి పెట్టడమే తప్పించి, భారతీయ జనతా పార్టీ ప్రజలకు చేసిందేమీ లేదన‌డంలో ఎలాంటి సందేహం లేదు. ప్రజలందరూ గమనిస్తున్నారు అందుకే దేశవ్యాప్తంగా జరుగుతున్న ఎన్నికల్లో భారతీయ జనతా పార్టీని తిప్పి కొడుతున్నారు. భారతీయ జనతా పార్టీ కి కౌంట్ డౌన్ స్టార్ట్ అయింది. ఇప్పటి నుంచి జరిగే అన్ని ఎన్నికల్లోనూ ఆ పార్టీని ప్రజలంతా చిత్తుగా ఓడించి తగిన బుద్ధి చెప్పనున్నారు.