వ్యక్తిగత పరిశుభ్రత,సామాజిక దూరం పాటించడం వల్ల ఏ వైరస్ మనల్ని ఏమీ చేయలేదు. 

  • వ్యక్తిగత పరిశుభ్రత,సామాజిక దూరం పాటించడం వల్ల ఏ వైరస్ మనల్ని ఏమీ చేయలేదు. 
  • 130 కోట్ల దేశంలో వైరస్ సంక్రమించింది కేవలం వేలమందికి అందులోనూ చనిపోయింది పదుల సంఖ్యలోనే. 
  • మనల్ని మనం నమ్ముదాం.. అనవసరమైన భయాందోళనలు వదిలేసి సంతోషంగా మహమ్మారిని ఎదుర్కొందాం 
  • సంకల్పబలం ఉన్న గుండెకి భయానికి ఆస్కారం లేదు..ధైర్యానికి  చావు లేదు. 
కరోనా వైరస్ గురించి ప్రజలందరూ భయపడుతున్న వేళ ప్రఖ్యాత సైకాలజిస్ట్ విహాంగ్ వాహియా గారు తన సందేశాన్ని చెప్పడం జరిగింది. 130 కోట్ల మంది జనాభా గల దేశంలో వైరస్ వ్యాప్తి కేవలం వేల సంఖ్యలో మాత్రమే ఉంది.అందులోనూ చనిపోయిన వారి సంఖ్య పదుల సంఖ్యలోనే ఉంది. కాబట్టి భయపడాల్సిన అవసరం లేదు అని పేర్కొనడం జరిగింది. వైరస్ వ్యాప్తి అనేది కేవలం నోటి నుంచి ముక్కు నుంచి వచ్చే తుంపర్ల ద్వారా మాత్రమే వస్తుంది కనుక కనీసం ఆరు ఫీట్లు లేదంటే మూడు ఫీట్లు దూరం పాటిస్తే మనం కరోనా కి దూరంగా ఉండవచ్చునని, వ్యక్తిగత పారిశుద్ధ్యం మరియు సామాజిక దూరాన్ని పాటిస్తే గనుక కరోనాకి అసలు భయపడాల్సిన అవసరమే లేదని చెప్పడం జరిగింది. ముఖ్యంగా బయటకె వెళ్ళేటప్పుడు మాస్కులను ధరించడం,ఇంటికి రాగానే చేతులను కడుక్కోవడం,మనం నిత్యం వాడే దుస్తులను,షూలతో సహా వేరుగా ఉంచడం అత్యవసరం
ఆశ క్యాన్సర్ ఉన్న వాడిని కూడా బ్రతికిస్తది అదే భయం అల్సర్ ఉన్నవాడిని కూడా చంపేస్తది..కావున ప్రజలందరూ దృఢసంకల్పంతో ఉండి భయానికి ఏ మాత్రం అవకాశం ఇవ్వకుండా తగిన జాగ్రత్తలు తీసుకుని కరోనా వ్యాప్తిని అరికట్టవచ్చు.. భయపడటం లోనే పడటం ఉంది కాబట్టి మనం భయపడొద్దు నెగ్గాలి ఖచ్చితంగా, కాబట్టి ధైర్యంగా ఉందాం మన సంకల్ప బలం ముందు ఎటువంటి వ్యాధైనా తలవంచాల్సిందే.వ్యక్తిగత పారిశుధ్యం మరియు సామాజిక దూరాన్ని పాటించి, చేతులను ఎల్లవేళలా కడుక్కుంటూ చిన్న చిన్న జాగ్రత్తలు పాటించటం వల్ల కరోనాకి చెక్ పెట్టవచ్చు అని నిరూపితమైంది. కాబట్టి మనం కూడా వీటిని ఆయుధాలుగా చేసుకుని మహమ్మరిని తరిమికొడదాం.చిరునవ్వుతో కరోనాని చంపేద్దాం

Leave a Reply

Your email address will not be published.