అభివృద్ధి ముందుకు వెళ్లాలంటే ఎప్పటికప్పుడు ఎన్నికలు జరగాల్సిందే

  • అభివృద్ధి ముందుకు వెళ్లాలంటే ఎప్పటికప్పుడు ఎన్నికలు జరగాల్సిందే
  • మున్సిపోల్స్ తర్వాత సహకార ఎన్నికలు
  • షెడ్యూల్ ప్రకటించిన రాష్ట్ర సహకార ఎన్నికల అథారిటీ
  • ఫిబ్రవరి 15 న 906 ప్యాక్స్ లకు జరగనున్న ఎన్నికలు
  • ఇది అసలైన అభివృద్ధి అంటే

తెలంగాణలో మున్సిపోల్స్ హడావుడి ముగిసింది. మరో ఎన్నికల హడావుడికి తెర లేసింది. అవే సహకార ఎన్నికలు. అవును… ప్రాథమిక సహకార సంఘాల ఎన్నికల షెడ్యూల్ ను రాష్ట్ర సహకార ఎన్నికల అథారిటీ ప్రకటించింది. వచ్చే నెల 15న తెలంగాణలో ఉన్న 906 ప్రాథమిక సహకార సంఘాలకు ఎన్నికలు జరగనున్నాయి.

కాంగ్రెస్ హయాంలో తెలంగాణలో ఎన్నికలు నిర్వహించాలంటేనే భయపడిపోయేవారు. ఒకవేళ మిశ్రమ ఫలితాలు వస్తే తమ ప్రభుత్వం మీద ఎక్కడ ప్రభావం చూపిస్తుందోనని వాళ్లు భయపడిపోయేవారు. అందుకే.. ఎన్నికలను వాయిదా వేసేవారు. దాని వల్ల అభివృద్ధి కుంటుపడేది. కానీ.. సీఎం కేసీఆర్ హయాంలో… ఎప్పటి ఎన్నికలు అప్పుడే నిర్వహించి… అభివృద్ధిని ముందుకు తీసుకెళ్తున్నారు. ఎన్నికలు నిర్వహించాలని తెలంగాణ ప్రభుత్వం ఆరాటపడితే… కాంగ్రెస్, బీజేపీలు ఎలా ఎన్నికలు ఆపాలని, వాయిదా వేయించాలని ఆలోచిస్తున్నాయి. కోర్టుల్లో కేసులు వేస్తున్నాయి. అధికార టీఆర్ఎస్ పార్టీపై నిందలు మోపుతున్నాయి.

ఏది ఏమైనా… తెలంగాణలో జరుగుతున్న ఏ ఎన్నిక అయినా వార్ వన్ సైడే అయిపోతోంది. దీంతో ప్రతిపక్ష కాంగ్రెస్, బీజేపీలకు వణుకు పుడుతోంది. ఏం చేయాలో అర్థం కావడం లేదు. అందుకే… లేనిపోని కూతలు కూస్తున్నారు. అందుకే.. అభివృద్ధి వికేంద్రీకరణ జరగాలంటే.. అన్ని రకాల సంఘాల ఎన్నికలు జరగాల్సిందే. అందుకే… మున్సిపోల్స్ ముగియగానే మళ్లీ ఇప్పుడు సహకార సంఘాల ఎన్నికలు జరగబోతున్నాయి.

Leave a Reply

Your email address will not be published.