వైద్య సిబ్బంది , పోలీస్ , పారిశుధ్య కార్మికుల సేవకు చేతులెత్తి మొక్కుతున్న

  •  వైద్య సిబ్బంది , పోలీస్ , పారిశుధ్య కార్మికుల సేవకు చేతులెత్తి మొక్కుతున్న
  • మున్సిపల్‌, గ్రామ పారిశుద్ధ్య సిబ్బందికి  రూ.5000
  • జీహెచ్‌ఎంసీ, హెచ్‌ఎండబ్ల్యూఎస్‌ రూ. 7500 ప్రత్యేక ప్రోత్సాహకం
  •   రాష్ట్ వ్యాప్తంగా 95,392 పారిశుద్ధ్య కార్మికుల సంతోషం

 

తమ ప్రాణాలకు తెగించి.. తమకు కూడా వైరస్‌ సోకోచ్చు అనే బాధ ఉండి.. వాటన్నింటిని పక్కన పెట్టి మన వైద్యులు అద్భుతమైన పని చేస్తున్న వైద్య, పారిశుద్య సిబ్బంది సేవలను సీఎం కేసీఆర్‌ కొనియాడారు.  హాస్పిటల్‌లో పని చేస్తున్న స్వీపర్‌ నుంచి మొదలుకొని డైరెక్టర్‌ వరకు వైద్య సిబ్బంది అందరికి.. రెండు చేతులెత్తి నా తరపున, రాష్ట్ర ప్రజల తరపున వారికి దండం పెడుతున్నా. పాదాభివందనం చేస్తున్నా అని సీఎం తెలిపారు. వాళ్ల ధైర్యం గొప్పది. వారు గొప్పవారు. డాక్టర్లు, నర్సులు, ఫార్మాసిస్టులకు ఎంత దండం పెట్టినా తక్కువే. వారి సమయాన్ని త్యాగం చేసి గొప్ప పని చేస్తున్నారు అని సీఎం పేర్కొన్నారు.

కరోనా నియంత్రణ చర్యల్లో విశ్రాంతి లేకుండా పని చేస్తున్న పారిశుద్ధ్య కార్మికులకు సీఎం కేసీఆర్‌ తీపి కబురు వినిపించారు. ప్రగతి భవన్‌లో కరోనా ప్రభావం, లాక్‌డౌన్‌ అమలుపై అత్యున్నత స్థాయి సమావేశం ముగిసిన అనంతరం సీఎం కేసీఆర్‌ మీడియాతో మాట్లాడారు. రాష్ట్ర వ్యాప్తంగా పారిశుద్ధ్య కార్మికులు 95,392 మంది వరకు ఉంటారు. పారిశుద్ధ్య కార్మికుల సగం జీతం వాయిదాను వెంటనే ఉపసంహరించుకోని పూర్తి జీతం చెల్లిస్తున్నామన్నారు. అంతేగాక  ప్రత్యేక ప్రోత్సాహం కింద మున్సిపల్‌ మున్సిపల్‌, గ్రామపంచాయతీ పారిశుద్ద్య కార్మికులకు రూ. 5 వేలు,  జీహెచ్‌ఎంసీ, హెచ్‌ఎండబ్ల్యూఎస్‌ కార్యకర్తలకు రూ. 7,500 ఇవ్వనున్నట్టు సీఎం ప్రకటించారు. అలాగే  డాక్టర్లు, వైద్య సిబ్బందికి  వారి మూల వేతనంలో పది శాతం జీతాలు పెంచి ఇస్తామని సీఎం కేసీఆర్‌ హామీ ఇచ్చారు.  దీంతో పారిశుధ్య కార్మికులు.. హెచ్‌ఎండబ్ల్యూఎస్‌ వర్కర్ల కుటుంబాల్లో ఆనందం వెల్లి విరుస్తోంది. కేసీఆర్‌ లాంటి సీఎం మాకుండడం మా అద్రుష్టం అని కొందరు పారిశుధ్య కార్మికులు ఆనందంతో ధన్యవాదలు  తెలిపారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *